24-12-2020, 07:45 PM
(24-12-2020, 08:05 AM)Okyes? Wrote: నరేశా.......
పరేషాన్ కాకు నివ్వు ప్రేమలో పడ్డావు.....
ఇంత రోమాంటిక్ గా రాయాలంటే......
నీవూ తియ్యటి చేదు పండు కొరికావు.....
నీకూ ఆ మత్తుమందు రుచి తగిలింది....
లేక పోతే.......
"తన చూపే మదురం
తన సన్నిధి లో ప్రతిక్షణం అమరం
తనని చేరేవరకు నా మదిలో సమరం
తన అదరం జార్చే ప్రతి పలుకూ అతి మధురం....".
ఔ..... జరూర్ ప్రేమల పడినవ్ తమ్మీ...
ఇగ బుకాయించకు గింతగనమా.....
యాసలు ప్రాసలు ఆశువుగా.......
"పలుకరించగానే
నయాగరా జలపాతం లా దూకే నా వాక్ ప్రవాహ ఝూరి సహారా ఎడారిలో వర్షంలా
గగనమైపోవడంతో......"
గింత పెద్ద మాట దమ్ము తీసుకోకుండా రాసినవంటే....
మళ్ళ చెపుతున్నా....... నీకు జరూర్ ప్యార్ అయ్యింది..
సూపర్ నరేశ్..... సూపర్... సహారా లో ఓయసిస్ లా..
థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్.....
అవును బాబాయ్ నేను నిజంగానే ప్రేమలో పడ్డాను.
కాకపోతే ఇది ఆకర్షించే ప్రేమ కాదు.. ఏదో చేయాలనే ప్రేమ కూడా కాదు..
కనీసం ఏదైనా ఆశించిన ప్రేమ కూడా కాదు..
నేను చాలా రకాల ప్రేమలు అనుభవించాను కానీ ఇలా ఆశ లేని, ఆకర్షణ లేని ప్రేమ ఇదే అనుభవించడం.
తను చూస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది, నవ్వుతుంటే తృప్తిగా అనిపిస్తుంది.
తను ఎవరితో మాట్లాడినా , ఏం చేసినా ఆ అనుభూతి నేను అనుభవిస్తున్నాను.
చర్యలు తనవి, ప్రతిస్పందనలు నావి