Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
 లవ్ యు లవ్ యు soooooo మచ్ శ్రీమతిగారూ - చెల్లెమ్మా , అమ్మవారుల దర్శనం చేసుకురాగానే బుజ్జిఅమ్మ అమ్మరూపంలోకి మారింది . బుజ్జిఅమ్మ బుజ్జిఅమ్మ .......... రేయ్ మామా - రేయ్ మామా ......... హృదయం ఆనందంతో పులకించిపోతోంది - అమ్మకు హాఫ్ సారీ ఫంక్షన్ జరిపించే అదృష్టం మనకు కలిగింది అని గుండెలపై చేతినివేసుకున్నాము . మాటల్లో వర్ణించలేని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ముగ్గురమూ ప్రాణంలా ఒకరినొకరం కౌగిలించుకుని సంతోషాన్ని పంచుకున్నాము .

బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని నాన్నలూ ........ అని పెదాలను కదిలించి స్వచ్ఛమైన సిగ్గుపడుతున్న బుజ్జిఅమ్మవైపు అనందబాస్పాలతో చూసి , లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా అని చేతితో ముద్దులుపెట్టాము . 
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నలూ ......... అని కిస్సెస్ అందుకుని , మీ గుండెలపై ఒకసారి వాలాలని ఆశపడుతున్నట్లు చిరునవ్వులు చిందిస్తూ కోరిక కోరారు . 
లవ్ టు లవ్ టు బుజ్జిఅమ్మా .......... అని చుట్టూ అంతమంది ఉన్నా పట్టించుకోకుండా సంతోషంతో లోపలికి అడుగుపెట్టాము .

అక్కయ్య మావైపు కాస్త కోపంతో చూసి చెల్లీ ........ అని ప్రక్కకు పిలిచారు . చెల్లి చెవిలో గుసగుసలాడినట్లు - ఒకవైపు బాధ మరొకవైపు ఆనందపడుతూనే వచ్చి శ్రీవారూ - అన్నయ్యా ........... మీరు ఇక్కడ ఉండటం అక్కయ్యకు ఇష్టం లేదు - ముఖ్యన్గా అన్నయ్యా ......... మీరు - మహి స్వాతి ........ వాళ్లకు ఇక్కడ కూడా సైట్ కొడుతున్నారు అని అక్కయ్య చాలా చాలా కోపంగా ఉంది అని మూసిముసినవ్వులతో మా చేతులను అందుకుని బయటకు లాక్కినివెళ్లడం చూసి , బుజ్జిఅమ్మ బాధపడటంతో కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి . 
అన్నయ్యా .......... పుష్పవతి అయిన అమ్మాయి అమ్మ గదిలో మగవాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు . 
చెల్లెమ్మా .......... బుజ్జిఅమ్మ అమ్మరూపంలోకి మారిన తరువాత కోరిన తొలి కోరిక మా గుండెలపై చేరాలని ............ తీర్చలేకపోతే బాధపడతారు అని కళ్ళల్లో చెమ్మతో చేప్పాము.

చెల్లి : నవ్వుకుని మాచేతులను అందుకుని మీ ప్రియమైన ఏంజెల్స్ - ప్రాణమైన చెల్లి - ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిఅక్కయ్య ఉన్నది దేనికి , అక్కయ్య లేని సమయం చూసి బుజ్జిఅమ్మను మీ గుండెలపైకి చేర్చే బాధ్యత మాది . 
మరొక్కసారి మిమ్మల్ని మా తల్లులతో చూశారంటే అక్కయ్య కోపం తారాస్థాయికి చేరుకుని కొట్టినా కొట్టేస్తారు అన్నయ్యా ......... , ఏమో అనుకున్నాను కానీ అక్కయ్య మీపై ఒక కన్నువేసిఉంచారు , కాస్త జాగ్రత్త - ముద్దులు ప్రక్కన ఉంచండి కనీసం చిటికెన వేలుని టచ్ చేశారని తెలిసినా అక్కయ్య ఉగ్రరూపాన్ని తట్టుకోలేరు. తన తల్లులు కేవలం తన తమ్ముడికి మాత్రమే సొంతమట కాస్త జాగ్రత్త అన్నయ్యా .......... ఏ క్షణమైనా చెంపలు చెల్లుమంటాయి అని చిరునవ్వులు చిందిస్తూ నా చేతిని చుట్టేసింది చెల్లి .
కృష్ణ : ఆ దెబ్బలు చాలా కోపపు దెబ్బలురా , హమ్మయ్య ....... నేనైతే వాటి నుండి సేఫ్ .
చెల్లీ ......... అక్కయ్య సున్నితమైన చేతిదెబ్బలు ఒక్కటైనా రుచిచూడాలని ఆశగా ఉంది . 
చెల్లి : అయితే ఇప్పుడే వెళ్లి మహికానీ , స్వాతికానీ , ప్రసన్నా కానీ , స్వప్న చేతిని కానీ చిన్నగా స్పృశించండి ఒక్కటేమిటి కోరినన్ని ప్రేమతో ఇస్తారు అనిచెప్పడంతో ముగ్గురమూ సంతోషంతో నవ్వుకున్నాము .

శ్రీవారూ - అన్నయ్యా ......... చాలా పనులున్నాయి ఇంటిని శుభ్రం చేయాలి - బుజ్జిఅమ్మకు స్నానం చేయించి బాపూ బొమ్మలా రెడీ చెయ్యాలి - మన పద్ధతుల ప్రకారం అన్నీ కార్యక్రమాలూ జరిపించాలి - బిగ్గెస్ట్ షాపింగ్ చెయ్యాలి - బుజ్జిఅమ్మను కూర్చోబెట్టి అందమైన ఫంక్షన్ జరిపించాలి ........... ఇది బాధపడే సమయం కాదు అన్నయ్యా సంబరాలు చేసుకునే సమయం అని మా కళ్ళల్లో చెమ్మను తుడిచి నా నుదుటిపై వాడి పెదాలపై ముద్దులుపెట్టింది .
మేము చిరునవ్వులు చిందించడం చూసి లవ్ యు శ్రీవారూ - లవ్ యు అన్నయ్యా ............ నేను లోపల నుండి ఏమేమిచెయ్యాలో కాల్ చేసి చెబుతాను చకచకా పూర్తిచేయ్యండి అనిచెప్పి లోపలికివెళ్లింది చెల్లి .

రేయ్ మొత్తం నీ వల్లనేరా ....... అని వాడిని ఒంగోబెట్టి గుద్దు గుద్దాను .
నొప్పితో వాడు కేక వెయ్యడం కాకుండా నా చెయ్యే నొప్పి పుట్టినట్లు చేతిని విదిలించాను .
నవ్వితే మరింత కోప్పడతానని లొలొపలే నవ్వుకుని దెబ్బ బాగా తగిలిందా మామా అని అడిగాడు . 
ఈ దెబ్బ నిమిషంలో మాయమౌతుంది - ఇంతకాలమైనా అమ్మను అక్కయ్య చెంతకు చేర్చకపోవడం వల్ల కలిగే నొప్పికి మందు లేదురా , మనమే తమ్ముళ్లని చెబితే అక్కయ్య అమితమైన ఆనందాన్ని పొందడమే కాకుండా తమ్ముళ్లూ ......... నాకు అమ్మకూడా కావాలని తొలి కోరిక కోరతారు - అంత ఆనందంలో అమ్మ ఎక్కడ ఉన్నారో తెలియదు అన్న బాధ అక్కయ్య కన్నీటికి కారణమౌతుంది - అమ్మ లేకుండా బుజ్జిఅమ్మ ఫంక్షన్ ఎలా జరుపగలము . అమ్మ ఎక్కడరా ....... అమ్మ ఎక్కడ ........ అని వాడిని కౌగిలించుకున్నాను .
కృష్ణ : లవ్ యు లవ్ యు రా మామా .......... , దుబాయ్ లో అమ్మ ఐడెంటిటీ మొత్తాన్ని మార్చేశాడు రా అందుకే ఆలస్యం అవుతోంది . దుబాయ్ లోని ఇండియన్ ఎంబసీ అమ్మను కనిపెట్టడాన్ని ప్రెస్టీజ్ గా తీసుకుంది అని మొబైల్ తీసి చూయించాడు . రేయ్ మామా .......... ఇది ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్ నుండి ఉదయం వచ్చింది . " ఐడెంటిటీ చేంజ్ దృష్ట్యా ఆలస్యం అవుతోంది - వన్ వీక్ లో రెస్పెక్టేడ్ జానకి గారిని ఇండియాకు తీసుకురాబోతున్నాము ".
రేయ్ మామా ......... ఇదేవిషయాన్ని వాళ్ళు వైజాగ్ వచ్చినరోజునుండీ ........ ఎన్ని వారాలు గడిచిపోయాయో తెలుసా ? .

కృష్ణ : రేయ్ మామా ......... ఇన్ని రోజులు ఆగావు ఒక్క వారం ఆగురా , ఇండియన్ ఎంబసి కనిపెట్టలేకపోతే మనమే వెళదామురా ......
ఏంట్రా మళ్లీ చెప్పు ..........
మనం ఒక్కటే కాదురా నీ ప్రియమైన ఏంజెల్స్ - నీ ప్రాణమైన చెల్లి - మన ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ .......... చివరగా చివరగా మన హృదయ స్పందన అయిన అక్కయ్యతోపాటు .
అక్కయ్య అనగానే నా పెదాలపై చిరునవ్వుతో లవ్ యు లవ్ యు soooooo మచ్ రా మామా అని కౌగిలించుకున్నాను .
కృష్ణ : హమ్మయ్యా ........ ప్రస్తుతానికి కూల్ అయ్యాడు . రేయ్ మామా ........ నీ చెల్లి చెప్పిందికదా చాలా పనులున్నాయని ఫ్రెష్ అయ్యి రెడీగా ఉందాము అని పైకి పిలుచుకుని వెళ్ళాడు .

ట్రిప్ నుండి రాగానే ఇంటికివెళ్లిన అంటీ వాళ్ళు - లావణ్యవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మరియు ఇంటర్ అమ్మాయిలు - వదినలు ......... అందరికీ విషయం తెలిసి సంతోషంతో ఇంటికి చేరుకున్నారు . ఇల్లు అంతా సందడి సందడిగా మారిపోయింది . 
అందరూ బుజ్జిఅమ్మా - బుజ్జిఅమ్మమ్మా - జానకి ........ అంటూ సంతోషంతో వెళ్లి సిగ్గుపడుతున్న బుజ్జిఅమ్మ నుదుటిపై బుగ్గలపై ముద్దులుపెట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు . ఈ క్షణం నుండీ సాంప్రదాయం ప్రకారం ఫంక్షన్ అయ్యేంతవరకూ టిఫిన్ - లంచ్ - డిన్నర్ మా ఇళ్ల నుండే వస్తాయి . మొదట మా ఇంటి నుండి లేదు లేదు మొదట మా ఇంటి నుండి అని ఆప్యాయతలతో వాదులాడుకోవడం చూసి , అక్కయ్య ఆనందించారు .

పెద్దమ్మ : నాకు కాల్ చేశారు . తల్లీ వాసంతి బుజ్జిజానకికి ఏలోటూ లేకుండా సాంప్రదాయం ప్రకారం ఘానంగా ఈ వైజాగ్ లొనే ఎవ్వరూ జరిపించనంతలా పుష్పవతి ఫంక్షన్ జరిపిద్దాము . 
అంటీవాళ్ళు : wow ......... లవ్ యు పెద్దమ్మా , మా వంతు మేమూ చేసి ఈ అదృష్టంలో భాగం అవుతాము .
వాసంతి - అక్కయ్యా - చెల్లీ - అమ్మా , పెద్దమ్మా ......... ఏవైనా పనులుంటే చెప్పండి సంతోషంగా చేస్తాము అని ఒకరికొకరు సహకరించుకుంటూ ఉత్సాహంతో ఇంటినిమొత్తం శుభ్రం చేస్తున్నారు .

అక్కయ్య : అందరినీ మరియు బుజ్జిఅమ్మ సంతోషాన్ని చూసి ఆనందబాస్పాలతో లవ్ యు పెద్దమ్మ  అని గుండెలపై చేరారు .
పెద్దమ్మ : అక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టి , తల్లీ ........ మేమంతా జాలితో చెయ్యడం లేదు తల్లీ , మా ప్రాణమైన వాసంతి - బుజ్జిజనకి పెదాలపై సంతోషం చూడటం కోసం చేస్తున్నాము . మా వాసంతి రుణం తీర్చుకునే అదృష్టం ఈ విధంగానైనా వచ్చినందుకు అందరమూ సంతోషంతో సంబరంలా ఫంక్షన్ చేసుకుందాము .
లావణ్య వాళ్ళు : అమ్మా ......... బుజ్జిజానకి అమ్మమ్మ ఫంక్షన్ మన ఇంటి ఫంక్షన్ మాత్రమే కాదు ఈ వీధిలో ఉన్న ప్రతీ ఒక్కరి ఫంక్షన్ . ఇన్ని సంవత్సరాలలో మన ఇంట్లో ఇంత సంతోషంగా ఒక్కటి కూడా జరుపుకోలేదు అయినా కూడా మీరు ప్రతి ఒక్కరి ఫంక్షన్ కు వచ్చి ప్రతీ పనిలో సహాయం చేసారు . ఫస్ట్ టైం ఆ అదృష్టం వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికీ లభించింది . ఊరికే వధులుతామా ....... మా అమ్మ ఇక చాలు తల్లులూ అనేలా ధూమ్ ధామ్ చేస్తాము . మీ ప్రాణమైన బుజ్జిఅమ్మ ఫంక్షన్ అందరికీ జీవితాంతం సంతోషంగా గుర్తుండేలా చేద్దాము అని అక్కయ్య బుగ్గలను ముద్దులతో నింపేశారు . 
అక్కయ్య ఆనందాలకు అవధులులేనట్లు లవ్ యు తల్లులూ - అక్కయ్యలూ - చెల్లెళ్ళూ .......... అని ప్రాణంలా హత్తుకున్నారు .
ఏంజెల్స్ : మేము కూడా మేముకూడా అని బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి అందరినీ చుట్టేసి ఆనందాన్ని పంచుకున్నారు .
అందరి సంతోషాలను ముఖ్యన్గా అక్కయ్య ఆనందబాస్పాలను చూసి బుజ్జిఅక్కయ్య ఫ్లైయింగ్ కిస్సెస్ వదలడం చూసి , బుజ్జిఅమ్మ కళ్ళలో ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యను ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని ప్రక్కనే కూర్చున్న చెల్లి మెడమ్స్ గుండెలపై వాలారు . 

చెల్లి : అక్కయ్యా , పెద్దమ్మా , తల్లులూ ......... ఫంక్షన్ జరుపుకుంటున్న మా బుజ్జిఅమ్మను వదిలి మీలో మీరే కౌగిలించుకుని ఆనందిస్తే ఎలా ......... అని అన్నదో లేదో , 
బుజ్జిఅమ్మా , బుజ్జిఅమ్మమ్మా , బుజ్జిజానకి ......... అంటూ పరుగున బెడ్ పైకి చేరిపోయి చెల్లి - బుజ్జిఅమ్మ - బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా చుట్టేశారు . చిరునవ్వులు - మూసిముసినవ్వులు - చిలిపినవ్వులతో సందడి వాతావరణం నెలకొంది .

మహి - ఏంజెల్స్ : అమ్మా - పెద్దమ్మా ......... ఇంటిని మొత్తం శుభ్రం చేసేసాము . నెక్స్ట్ ఏమిటి అని అడిగారు .
అక్కయ్య .......... తియ్యదనంతో పెద్దమ్మవైపు చూసారు .
పెద్దమ్మ : ఆ అదృష్టం నాకు ఇచ్చావా తల్లీ , లవ్ యు .......... , తల్లులూ ........ సాయంత్రం లోపు బుజ్జిజానకికి అందరమూ కలిసి గిలిగింతలుపెడుతూ ఆటపట్టిస్తూ స్నానం చేయించి కొత్త లంగా ఓణీ కట్టించి పుత్తడి బొమ్మలాగా రెడీ చెయ్యాలి . ఇక ఫంక్షన్ వరకూ మనం కాకుండా ఎవ్వరూ బుజ్జిజానకిని కలవకుండా - ఇల్లుదాటి ఎక్కడికీ వెళ్లకుండా చూసుకోవాలి - కోరిన కోర్కెలన్నింటినీ తీర్చాలి .
చెల్లి : పెద్దమ్మా ......... ఎవ్వరినీ కలవకూడదా అని బాధతో అడిగింది . 
బుజ్జిఅమ్మ - బుజ్జిఅక్కయ్య - ఏంజెల్స్ కూడా బాధపడటం చూసి ,
పెద్దమ్మ : తల్లులూ ......... కోరిన కోర్కెలన్నింటినీ తీర్చాలి అనిచెప్పాను వినలేదా అని అక్కయ్యకు కనిపించకుండా చెల్లివైపు కన్నుకొట్టారు .
చెల్లి : లవ్ యు లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా ........ అని బుజ్జిఅక్కయ్యను హత్తుకున్న బుజ్జిఅమ్మను ప్రాణంలా హత్తుకున్నారు .
మహి : వెంటనే తీర్చాలికదా పెద్దమ్మా , ఇప్పుడెలా ...........
పెద్దమ్మ : మహి నుదుటిపై ముద్దుపెట్టి , బుజ్జిజానకిని బాపూ బొమ్మలా రెడీ చేసాక ఒకరిని తోడుగా ఉంచి మనమంతా షాపింగ్ వెళుతున్నాము . షాపింగ్ వెళ్ళాక తొలికోరిక తీర్చండి అని చెవిలో గుసగుసలాడారు   ఇంతకీ ఫంక్షన్ ఎప్పుడో తెలుసా ..........
అందరూ ఆత్రం పట్టలేక ఎప్పుడు పెద్దమ్మా ఎప్పుడు ఎప్పుడు రేపేనా .......... అని పెద్దమ్మను మాట్లాడనీకుండా చేసేసారు .
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు తల్లులూ .......... , వాసంతి తల్లీ నువ్వే చెప్పు నీ ఇష్టమే అందరి ఇష్టం .
అక్కయ్య : సాంప్రదాయం ప్రకారం ఒకరోజు తరువాత .
యాహూ ........ యే యే యే ........ ఎల్లుండి ఫంక్షన్ అని బుజ్జిఅమ్మను ముద్దులతో ముంచెత్తారు .
పెద్దమ్మ : సరిగ్గా చెప్పావు తల్లీ , ముత్తైదువులందరినీ స్వయంగా వెళ్లి ఆహ్వానించడానికి ఒకరోజు సమయం అయినా కావాలి . తల్లులూ ........ ఎవ్వరినీ మిస్ చెయ్యకూడదు లిస్ట్ రెడీ చెయ్యండి . 
చెల్లి : మహీ స్వాతి లావణ్య ........ మన వీధిలోని మీ అమ్మలు మరియు మీ ఫ్రెండ్స్ అమ్మలు తరువాత లిస్ట్ లో మొదట చేర్చాల్సింది ఎవరినో తెలుసా? .
మహి - లావణ్య : తెలుసు తెలుసు ........ అమ్మా , బుజ్జిఅమ్మమ్మ పేరుతో ఉన్న జానకి అమ్మ - ఇందు అమ్మ - కావ్యమ్మ , ఆయిషా అమ్మ - డాక్టర్ అమ్మ మొదలుకుని ప్రేమ ఆప్యాయతలతో విరాజిల్లుతున్న కుటుంబంలోని అందరినీ అందరినీ ఆహ్వానిద్దాము .
చెల్లి : లవ్ యు తల్లులూ .......... మీ మావ ......... నాలుక కరుచుకుని మా అక్కయ్య మనసులోని కోరిక కూడా అదే .........
అక్కయ్య : ఆవును చెల్లీ , సరైన సమయానికి గుర్తుచేశావు . అందరమూ కలిసివెళ్లి ఆహ్వానిద్దాము అని మురిసిపోయారు .

అక్కయ్య - బుజ్జిఅమ్మ సంతోషాలకు ఆనందబాస్పాలతో పులకించిపోయాము ఇద్దరమూ ......... , ఫ్రెష్ అయ్యి కిందకువచ్చిన మేము చెల్లి - ఏంజెల్స్ చెప్పిన పనులను చేస్తున్నాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-01-2021, 11:28 AM



Users browsing this thread: 59 Guest(s)