21-12-2020, 10:58 PM
(22-06-2020, 01:04 PM)LLuciferMorningstar Wrote: ముందుగా ఇది ఇక్కడ పోస్ట్ చేస్తున్నందుకు మన్నించాలి . కానీ మీ అందరికీ ఇది అందాలి అని ఇక్కడ పెడుతున్నాను .
మన సైట్ ఎందరో గొప్ప రచయితలకి ఆశ్రయం ఇచ్చింది . మన సైట్లో ఉన్న సభ్యులలో ఎందరో వాళ్ళకి వీలు ఉన్నప్పుడు తమ ప్రేమని తెలియజేస్తున్నారు . కొత్త రచయితలు కూడా ఇంకా వస్తున్నారు . మన సైట్ మరింతగా అభివృద్ధి చెందుతుంది .
కానీ కేవలం రచనలలోనే కాకుండా మిగితా వాటిల్లో కూడా మన సైట్ మరింతగా ముందుకి వెళ్ళాలి . ఆ ఉద్దేశంతోనే చాలా మంది ఆలోచిస్తారు , కానీ ఎలా చేయాలి ఏం చేయాలి అనే చోట ఆలస్యం ఔతుంది . నా వంతుగా ఈ ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి ఒక వీడియొని అప్లోడ్ చేశాను . అది తెలుగు subtitles తో ఉంటుంది . అది మన సైట్ లోనే మొదటిగా కనిపించాలి అని కోరుకున్నాను . అది చూసి ఇంకెవరైనా ఉత్సాహవంతులు ముందుకి వస్తారు అనేది నా అభిలాష .
అలాగే ఒకానొక సమయంలో తెలుగులో కామిక్స్ ఎక్కడ దొరుకుతాయి అని గూగుల్ మొత్తం వెతుకుతూ గడిపిన గంటలకి సమాధానంగా మన తెలుగులో కామిక్స్ ఇక్కడ ఉంటాయి ఏమో అని చూశాను . కానీ ఇక్కడ కూడా లేవు . ఐనా ఆ దిశగా మన ప్రయత్నం మనం చేద్దాము అనే ఉద్దేశంతో చాలా మంది ఇప్పటికీ పోస్ట్స్ పెడుతున్నారు వాళ్ళు చేసిన translated కామిక్స్ తో . ఆ దారిలోనే నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేశాను .
నిజానికి ఇది ఈ సైట్ కి ప్రేమతో నేను ఇప్పటికి ఇచ్చుకునే చిరుకానుక . కొంతకాలం ఇక్కడ ఉండను . కానీ తిరిగి వస్తాను , మరింత ఉత్సాహంతో , మరికొన్ని రచనలు, కామిక్స్ తో .
Photoshop CS6 - వాడిన సాఫ్ట్వేర్
ధన్యవాదాలు .
Please user garu.... Telugu comics stories akada dorukuthayo... Koncham chepandi ?????????? I begging you...