16-12-2020, 05:03 PM
(This post was last modified: 16-12-2020, 05:04 PM by Joncena. Edited 1 time in total. Edited 1 time in total.)
కథ ఇక కొనసాగదు అందుకే చిన్నగా కథని చెప్పి ముగించేస్తున్నా.
మూడో వాడిని వాడికి వాడే చచ్చేలా చేసి, ఆ వీడియో విరాకి చూపించటంతో చిన్నపిల్లలాగ సంతోషంతో చప్పట్లు కొడుతుంటే, అది చూసి వీరూ కన్నీళ్ళు ఆపుకోలేక అంతా తన వల్లే జరిగింది అని ఏడుస్తుంటే బార్గవ్, స్వేచ్చ లకు చాలా సేపు పట్టింది వీరూని ఓదార్చటం. మోనాను కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉంచి తరువాత రెండో వాడిని చంపే ముందు తనని Singapore పంపిచేసి వీళ్ళ వల్ల చనిపోయిన అమ్మాయిల్లో ఒక అమ్మాయికి ఒక అన్నయ్య ఉండడంతో అతని ద్వారా ఒక క్లబ్‌లో బెట్టింగ్ కట్టించి రెండో వాడు ఆ అమ్మాయి అన్న చేతిలో ఓడేట్టుగా చేసి ఒక నది దగ్గరలోకి వచ్చేట్టుగా చేసి అక్కడ వాడికి వాడే చచ్చేల చేసి అది కూడా వీడియో తీసి విరాకి చూపించారు.
అలా రెండో వాడి చావు కూడా చూసిన విరాలో కొంచెం కొంచెంగా మార్పు వస్తుండడం గమనించారు వీరూ, స్వేచ్చ అలాగే బార్గవ్. అసలు వాడిని చంపటానికి సమయం కోసం చూస్తూ ఉన్నారు. వాడు వాడి ఇద్దరు మిత్రులూ చనిపోవటంతో ఎవరో కావాలని చేస్తున్నారు అని వాడికి అనుమానం వచ్చి inquiry మొదలు పెట్టించాడు వాడి అనుచరులతో. అసలు విషయం ఏమిటో తెలిసేదాకా Indiaకు రాకుండా foreign countryలో ఉండిపోయాడు. అలా వాడి గురించి, అవకాసంకోసం ఎదురుచూస్తూ ఉంటాడు వీరూ.
వీరూ అందరికీ దూరంగా ఉండేలా ఒక బంగళా కొనుక్కుని అక్కడ విరాతో కలిసి ఉంటాడు. కంపెనీకి వెళ్ళకుండా వీరూ ఎప్పుడూ విరా దగ్గరే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. విరా కూడా మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఒక పక్క వాడి అనుచరులకు ఇద్దరు ఇది అంతా చేసారు అని తెలుస్తుంది కానీ, వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఎవరూ అన్న విషయం తెలియదు. అలా ఒక సంవత్సరం తిరిగేటప్పటికి విరా ఒక పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. ఈ విషయాలు ఏమీ తెలియని పూజా ఒకసారి వీరూ దగ్గరకు వస్తుంది ప్రాజెక్ట్ పని మీద. తనకు తెలియదు విరానే వీరూ పెళ్ళి చేసుకున్నాడు అని.
పూజా వచ్చే సమయానికి మోహిని గార్డెన్‌లో ఒక పిల్లాడిని ఆడిస్తూ ఉంటుంది. పూజ మోహిని దగ్గరకు వెళ్ళి ఎవరి బాబు అని అడగ్గా, మోహిని వీరూ అన్నయ్య పిల్లాడు అని చెప్తుంది. అదే సమయానికి వీరూ కూడా ఇంటినుంచి బయటకు వస్తాడు. వెంటనే పూజా వీరూతో ఏమిటి నువ్వు చేసింది? నేను ప్రేమిస్తున్నా అంటే నువ్వు విరాని ప్రేమిస్తున్నాను అని, తనను తప్ప వేరే ఎవరినీ పెళ్ళి చేసుకోను అని చెప్పి మరి ఇప్పుడు ఎవరినో పెళ్ళి చేసుకుంటావా అని అడగ్గానే, మోహిని పూజాతో "పూజా! అన్నయ్య పెళ్ళి చేసుకుంది విరాజితనే. పెళ్ళిలో నాకే పెద్ద ట్విస్టులు ఇచ్చారు అన్నయ్య. ఈ బాబు కూడా విరా, అన్నయ్యల బాబే" అని చెప్పేసరికి; వీరూ అవును అని చెప్పి పూజాని విరా దగ్గరకు తీసుకెళతాడు.
ఇది జరిగిన కొన్ని రోజులకు పూజా అనుకోకుండా ఆ మొదటివాడిని కలుస్తుంది కంపెనీ ప్రాజెక్ట్ పని మీద. అప్పటికి తనకు తెలియదు విరా అలా అవ్వడానికి వాడే కారణం అని. ఒక రోజు అనుకోకుండా బయట కలిసినప్పుడు కొంచెం తప్పుగా ప్రవర్తిస్తే కంపేనీలో చెప్పినా పెద్దగా పట్టించుకోకపోయే సరికీ, ఆ విషయం వీరూతో చెప్తుంది. అది తెలుసుకుని వీరూ, పూజాని అతని ఫొటో పంపమని అడుగ్గా, సరే అని పంపిస్తుంది ఆఫీసులో జరిగిన ఒక పార్టీకి వాడు గెస్టుగా వచ్చినప్పటి ఫొటో. అది చూసిన వెంటనే పూజాకి జరిగింది మొత్తం చెప్పేస్తాడు వీరూ.
ఈ విషయం జరిగిన రెండు రోజులకు వాడిని ఒక farm house కొనేట్టుగా ఒక చోటూకు రప్పించి వాడిని రాహుల్‌చేత చంపించడం లైవ్‌లో చూపిస్తాడు విరాకు. అది జరిగిన మరుసటి రోజు రాహుల్ వెళ్ళి సెక్యూరిటీ ఆఫీసర్లకు లొంగిపోతాడు తన చెల్లిని మానభంగం చేసి చంపేసినందుకు గానూ ఆ ముగ్గురు స్నేహితులని తనే చంపేసాను అని. వీరూ, బార్గవ్ ఎంత చెప్పినా వినకుండా అలా చేస్తాడు. అది TVలో చూసిన రెండో వాడిని చంపటానికి వచ్చిన చనిపోయిన అమ్మాయ్యిల్లో ఒకరి అన్నయ్య అయిన అతను కూడా వచ్చి తను రాహుల్‌కు సహయం చేసాను అని, తన చెల్లి కూడా వాళ్ళా వల్లే చనిపోవటంతో ఇలా చేయాల్సి వచ్చింది అని. వీళ్ళిద్దరూ వీరూ దగ్గర మాట తీసుకుంటారు ఎట్టి పరిస్తుల్లో మాకు బెయిల్ తేవద్దు అని, మిగిలిన జీవితం అంతా ఇలా జైలులో ఉండనివ్వండి అని.
కథ సమాప్తం.
కథని ఆదరించిన అందరికీ ధన్యవాదములు
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
My first story: ప్రేమ+పగ=జీవితం