05-11-2018, 02:06 PM
నేను అప్పుడప్పుడు ఇక్కడ కొన్ని తెలుగు సామెతలు వాటి అర్ధాలను పోస్ట్ చేస్తుంటాను. వీటిని నేను నేర్చుకుంటున్నాను, అందరికి ఉపయోగపడుతుందని పోస్ట్ చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటె చెప్పండి
అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
నిష్ఠురం అంటే వంకలు పెట్టటం లేదా కఠినంగా మాట్లాడటం. పనికి ముందే కఠినంగా వ్యవహరించి, సూచనలు చేసి పని చేయించుకోవటం మంచిది. పని అయిపోయిన తర్వాత, చేసిన వాళ్ళను నొప్పించేటట్లు మాట్లాడటం మంచిది కాదు.
అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
అంబలి అంటే గంజి ఆహరం. అంబలి సామాన్యంగా పేదవారే తాగుతారు. అంబలి తాగుతున్న పేదవాడు తన మీసాలకు గంజి అంటుకోకుండా మీసాలు ఎత్తి పట్టుకోవడానికి ఒక సేవకుడిని నియమించుకున్నాడు. అంబరాలు ప్రదర్శించే వారికీ ఏ సామెత వాడతారు.
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
అడిగేవాడు ఎన్నైనా అడుగుతాడు. అన్ని ప్రశ్నలకు అడిగినవారు తృప్తి పడేటట్లుగా చెప్పేవాడు చెప్పటం కష్టం. అందువల్లే చెప్పవాడిని తనకంటే తక్కువగా చూస్తాడు.
అభ్యాసం కూసు విద్య
కూసు అంటే కూన, బిడ్డ అనే అర్ధాలున్నాయి. అభ్యాసము యొక్క బిడ్డే విద్య. అభ్యాసము విద్య కు తల్లి లేదా మూలం. ఏ విద్య అయినా స్వాధీనం కావాలంటే అభ్యాసము తప్పనిసరి. అని అభ్యాసము యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేసే సామెత ఇది.
అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
అడవిని కొంటానికి (పూర్వం) ఎవరు ముందుకి వచ్చేవారు కాదు. దాని రక్షణ కష్టము. దాని పై హక్కు ఒకరిది కాదు. కొరివి అంటే మండుతున్న కట్టే. అది దేన్నైనా తగలబెట్టి నాశనం చేస్తుంది. ఒక వస్తువును మనం అమ్మితే చాల తక్కువ ధర వస్తుంది. దాన్నే మనం కొనాలనుకుంటే ఎక్కువ ధర చెల్లించాలి. అమ్మిన, కొన్న మనకు నష్టం తప్పదు అని ఏ సామెత.

Images/gifs are from internet & any objection, will remove them.