Thread Rating:
  • 3 Vote(s) - 4.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రేమ+పగ=జీవితం (కథ సమాప్తం.) & Closed
Update-10:

వీరూ: మావయ్యా. మీరు కొంచేం శాంతిస్తే మీకు చెప్పవలసింది చాలా ఉంది. అది ఇక్కడ ఉన్న బందువులముందే నేను చెబుతా.


అని చెప్పి చెప్పటం మొదలుపుట్టాడు.


వీరూ: నేను, విరా ఒకే officeలో పని చేసే వాళ్ళాం. కలిసిన మొదటే ఒకరికి ఒకరం నచ్చేసాం. విరాకు ఇలా అవ్వనంతవరకూ అంటే ఇంచుమించుగా రెండున్నర సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. ఆ విషయం మీకు చెప్పి పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం.
ఈ విషయం మోహినికి, స్వేచ్చకు కూడా తెలుసు.  కానీ ఇంతలో ఇలా జరిగింది, కానీ నేను ఎప్పుడూ స్వేచ్చని వేరే ఉద్దేశంతో చూడలేదు. నాకు మోహిని ఎంతో స్వేచ్చ కూడా అంతే. మోహిని నాకు సొంత చెల్లి కాకపోయినా, నాకే ఒక చెల్లి ఉంటే ఎంత ప్రేమతో చూసుకుంటానో అంతా ప్రేమగా చూసుకుంటున్నా. అందుకే స్వేచ్చను అతనికి ఇచ్చి నేనే పెళ్ళి చేయించాను.
విరా తండ్రి: మరి విరాని నువ్వు ప్రేమించినప్పుడు, స్వేచ్చను ఎందుకు పెళ్ళి చేసుకుంటాను అని చెప్పావు?

వీరూ: మావయ్య, నాకు రెండు వారాల ముందు వరకూ కూడా నాకు విరాకి ఇలా అయ్యింది అని కూడా తెలియదు. అసలు ఆ రోజు నేను విరా అడిగింది కదా అని project అయ్యాక ఇష్క్ సినిమాలో వాళ్ళు వెళ్ళిన placeకి వెళదాం అంటే తీసుకెళ్లా. అప్పుడే ఎవరో ముగ్గురు మా దగ్గరకు వచ్చి (ఇలా చెప్పబోతుంటే, మోహినీ అలగే స్వేచ్చ వచ్చి)
స్వేచ్చ:బావా, ఇప్పుడు అవన్నీ ఎందుకు?
మోహిని: అవును అన్నయ్యా, ఇప్పుడు అవి చెప్పవద్దు.
వీరూ: తప్పదురా చెప్పితీరాలి. లేదంటే అది చాలా పెద్ద తప్పు. (అని వాళ్ళకు చెప్పి, తిరిగి విరా తండ్రికి చెప్పటం మొదలు పెడుతాడు. (మరీ వివరంగా ఇక్కడ చెప్పకుండా, చిన్నగా తేల్చేస్తున్నా))


వీరూ: వాళ్ళు తాగి వచ్చి ఏదో వాగుతుంటే, విరా వాళ్ళల్లో ఒకడిని కొడితే వెంటనే మిగిలిన ఇద్దరూ నామీద పడబోతే నేనూ తిరిగబడ్డాను, కాకపోతే ఒకడు విరాను కొట్టి, నన్ను ముగ్గురూ కలిపి ఒక చెట్టుకు కట్టేసి, ఒకడు విరాని రేప్ చేస్తున్నాడు. నేను కట్లను విప్పుకోడానికి నా సాయశక్తులా ప్రయత్నించగా ఒక గాజు ముక్కతో కట్లు తెంపుకుంటుంటే అది దూరంగా విసిరేసారు మిగిలిన ఇద్దరూ.
అప్పుడే దూరంగా బార్గవ్ మీద ఎవరో దాడి చేస్తుంటే వాళ్ళని చంపే processలో కాల్చిన bullet నా కట్లకు తగలడంతో, నాకు కట్టిన కట్లు తెగిపోయాయి. వెంటనే నేను విరాని కాపాడుతుంటే బార్గవ్ వచ్చి నాకు సాయం చేయటంతో నేను విరాని hospitalకి తీసుకువెళ్ళి కాపాడుకోగలిగాను. లేదంటే అదే రోజు విరాతోపాటుగా నా ప్రాణాలని కూడా వదిలేసేవాడను.
hospitalలో నేను operation జరిగిన తరువాత రోజు విరా కోసం తన బెడ్ దగ్గరకు వస్తే, తను లేదు. ఏమి చెయ్యాలో తెలీదు. మోహిని కూడా నా phone answer చేయటంలేదు. పిచ్చిపట్టిన వాడిలా road మీద తిరుగుతుంటే మోహిని phone చేసి విరాకు పెళ్ళి అయ్యిపోయింది, నిన్నుకూడా వేరే పెళ్ళిచేసుకోమంది. తనగురించే ఆలోచిస్తూ జీవితం పాడుచేసుకోవద్దని చెప్పమంది అని చెప్పింది. ఒక రెండు రోజులు అసలు నేను మనిషిని మనిషిలా లేను.
ఇక తప్పక ఆఫీసుకి వెళితే స్వేచ్చ కలిసి చాలా బాధపడడంతో, ఇక తప్పక normalగా ఉండడం మొదలుపెట్టా. అది జరిగిన కొన్ని రోజులకు స్వేచ్చ బార్గవ్‌ని ప్రేమిస్తున్నట్టుగా చెప్పగానే, ముందు ఇంటిలో చెప్పమని చెప్పాను. ఆ విషయం చెప్పేలోపే మీరు మా ఫోటోలు మాకు పంపేసరికి ఇక తప్పక ఇలా పెళ్ళి నాటకం ఆడి వీళ్ళ పెళ్ళి చేసేసి; విరా నేనూ విడిపోవడానికి కారణం అయ్యిన వాళ్ళను చంపేసి నేను చచ్చిపోదాం అని fix అయ్యా. కానీ రెండు వారాల క్రితమే నాకు తెలిసింది విరాకి ఇంకా పెళ్ళి కాలేదు అని, అలాగే తను గతం మర్చిపోయింది అని. అందుకే మళ్ళీ వేసిన plan మళ్ళీ మార్చి ఇలా చేయాల్సి వచ్చింది.

(ఇలా వీరూ చెప్పగానే, విరా తల్లి)
విరా తల్లి: అవునండి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టు నాకు ఆరోజు hospitalలో తెలిసింది. కానీ operation అయ్యాక doctor చెప్పింది విన్నాక, ఇక తప్పనిసరి పరిస్తితుల్లో విరాని ఇక్కడకు తీసుకువచ్చేసాను. అక్కడే ఉంటే ఈ విషయంతెలిసి తనకు ఏమి అవుతుందో అని. కానీ వచ్చిన రోజు దగ్గరనుండి, విరాకి వీరూ పేరు తప్పితే ఇంకేమీ గుర్తులేదు. ఎప్పుడు తన పేరే కలవరిస్తుంది. అప్పుడప్పుడూ తనలో తనే కుమిలిపోతుంది.
పెళ్ళికి ఇద్దరూ ఒప్పుకున్నారు అని తెలిసి ముందు సంతోషపడ్డాను, కానీ పెళ్ళి అయ్యాక తెలిస్తే ఏమి జరుగుతుందో అని చాలా బయపడ్డా. ఒక వారం రోజుల ముందు నాతో ఒకసారి మాట్లాడాలని పిలిస్తే వెళ్ళాను, అప్పుడే చెప్పాడు తను స్వేచ్చని పెళ్ళి చేసుకోవటం లేదు అని. స్వేచ్చ, బార్గవ్ ప్రేమించుకుంటున్నారు, తను వాళ్ళకి పెళ్ళి చేస్తున్నాను అని.
వాళ్ళ పెళ్ళి చేసాక విరాకి ఆరోజు అలా జరగడానికి కారణం అయ్యిన వాళ్ళని తను చంపేస్తాను అని, వాళ్ళను చంపే processలో తను చనిపోవచ్చు అని. ఒకవేళ తను చనిపోతే ఆ విషయం విరాకు చెప్పవద్దని నా దగ్గరనుండి మాట తీసుకోబోతుంటే, ఇక తప్పక తనకు చెప్పేసాను; విరాకు పెళ్ళి కాలేదు అని, అలాగే తనకు గతం గుర్తులేదు అని. అలాగే తనకు నీ పేరు ఒకటే గుర్తు ఉంది అని, నీ పేరు మాత్రమే కలవరిస్తుంది అని. కానీ నేను అసలు ఊహించలేదు, విరా తనని గుర్తుపట్టి పెళ్ళికి ఒప్పుకుంటుంది అని.

వీరూ: (అప్పుడు) నేను మొన్న చెప్పాను స్వేచ్చకు నాకు విరా గురించి తెలిసింది, నువ్వు ఫీల్ అవ్వకు అని, నిన్న స్వేచ్చకు ఫోన్ చేసి విరాను చూడాలని ఉంది అంటే video callలో చూపించింది. అప్పుడే విరా నన్ను గుర్తుపట్టి ఏడుస్తుంటే అర్ధం అయ్యింది, తను నన్ను మర్చిపోలేదు అని. అందుకే ఇందాక నన్ను చూడగానే నన్ను కౌగిలించుకుని బాధపడింది. తనకు కొంచెం కొంచెం గతం గుర్తుకువస్తుంది.
నాకు విరాకు పెళ్ళి కాలేదు ఇలా అయ్యింది అని అత్తయ్య చెప్పకముందే తెలుసింది. కానీ అత్తయ్యతో వివరంగా తెలుసుకుందాం అని ముందే plan చేసుకుంది చెప్పగానే, వెంటనే అత్తయ్య తన నోటితో తనే చెప్పింది విరా గూరించి.
మోహిని: నీకు ఎలా తెలిసింది అన్నయ్యా విరా గురించి?
వీరూ: నాకు పూజిత చెప్పింది, last month Bangalore వెళ్ళిపోతూ. తను అనుకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసిందంట, తను వెళ్ళిపోతూ అడిగింది నేను ఎవరిని ప్రేమించాను అని. విరాని అని చెప్పాను, కానీ ఇప్పుడు తను ఎక్కడ ఉన్నది తెలియటంలేదు అని చెప్పగానే, తను చెప్పింది విరా గురించి.

అసలు విరా గురించి తెలియకుండా ఉండి ఉంటే, నేను పిచ్చిగా ఆలోచించి ఒకవేళ చనిపోతే విరా పరిస్తితి ఏమి అయ్యి ఉండేదా అని అలోచిస్తుంటేనే నాకు ఒక విధమైన భయం కలుగుతుంది.

ఇలా అంతా చెప్పిన తరువాత విరా తండ్రి ముందు కొద్దిగా కోప్పడ్డా, తరువాత రెండు జంటలనీ ఆశీర్వదించాడు, అలాగే వీరూ తండ్రి కూడా. ఆ తరువాత వారంలో రెండు జంటలూ కలిసి ఊటీకి హనీమూనకి వెళ్ళారు. అక్కడ వీరూకీ, బార్గవ్‌కీ ఒకేసారి mobile phones ring అయ్యాయి. తీరా చూస్తే....



ఇప్పటికి ఇంతే, మరొక రెండు రోజుల్లో మరొక update ఉంటుంది.

నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, రెప్యుటేషన్ పాసిటివ్ ఇవ్వండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి, దాని ద్వారా నేను ఎక్కడ తప్పు చేసానో తెలుస్తుంది.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 11 users Like Joncena's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ+పగ=జీవితం - by Joncena - 19-11-2020, 11:44 AM



Users browsing this thread: 9 Guest(s)