17-11-2020, 01:21 PM
ఋగ్వేద సంహితం - పదవ సూక్తము - యముడు యమి
ఋషి - వివస్వతపుత్ర యమి, యముడు. దేవత - యముడు - యమి. చంధస్సు - త్రిష్టుప్
1. యమి, యమునితో అనుచున్నది:-
ఇది విశాల సముద్రము. సముద్ర మధ్యమున ద్వీపము. ఈ ద్వీపము నిర్జనము. ఇచట నీ కొరకు వేచి యున్నాను. ఏలననగా నీవు గర్భావస్థనుండియే సహచరుడవు - నీవలన నా గర్భమున కలుగు పుత్రుడు శ్రేష్ఠుడగునని విధాత తలచినాడు.
2. యముడు యమితో అనుచున్నాడు :-
యమీ! యముడు నీ సహచరుడు అగును. కాని నీవు కోరినవంటి సంపర్కము చేయజాలడు. ఏలనన నీవు నా సహోదరివి. భగినివి . నీవన్నట్లు ఇది నిర్జర ప్రదేశముకాదు. ప్రజాపతి పుత్రులగు దేవతలందరు చూచు చున్నారు.
3. యమి అనుచున్నది :-
మానవులకు అట్టి సంపర్కము నిషేధమైయున్నది. అయినను దేవతలు ఇష్ట పూర్వకముగా అట్టి సంపర్కము చేయుట నిషేధించ బడలేదు. అందువలననే నాకు అట్టి కోరిక కలిగినది. నీవు సహితము నతో సంభోగించుము. పుత్రుని ప్రసాదించు తండ్రి వలె నా దేహమున వసించుము. నాతో సంభోగింపుము.
4. యముడు అనుచున్నాడు :-
నేను ఇట్టి కార్యము ఎన్నడును చేయలేదు. నేను సత్యవక్తను. అబద్ధములాడలేదు అంతరిక్షమున ఉన్న గంధర్వ జలధర్త ఆదిత్యుడు మనకు తండ్రి. అంతరిక్షముననే ఉండు సూర్యపత్నిమనకు సహోదర బంధువులము. కావున సంపర్కము ఉచితముకాదు.
5. యమి అనుచున్నది :-
రూపకర్త, శుభాశుభప్రేరకుడు, సర్వాత్మ, దివ్యుడు జనకుడగు ప్రజాపతి మనసు ఈ దశలోనే దంపతులను చేసినాడు. ప్రజాపతి కార్యమున లోపములు ఉండవు. మన ఈ సంబంధము ద్యావా పృథ్వులకు కూడ తెలియును.
6. తొలినాటి సంగతి ఎవడు ఎరుగును? ఎవడు చూచినాడు? ఎవడు వెల్లడించినాడు? మిత్రావరుణుల మహాధామమగు రాత్రింబవళ్లను గురించి నీ అభిప్రాయమేమి?
7. భార్య భర్తలు ఏక శయ్యాగతులై రమింతురు. అట్లే యమా! నీముందు నాదేహము వెల్లడింతును నీవు నన్ను వలచుము. రమ్ము ! ఒకే చోట ఇద్దరము శయనింతము. రథ చక్రములవలె ఏక కార్యరతుల మగుదుము.
8. యముడు అనుచున్నాడు :-
దేవతలకు చారులున్నారు. వారు రాత్రింబవళ్లు తిరుగుచుందురు. వారి కంటి రెప్పవాలదు. యమీ! త్వరగా మరొకని వద్దకు వెళ్లుము. అతనితో రథ చక్రముల వంటి సంభోగ ఏకకార్యము చేయుము.
9. రాత్రింబవళ్లలో యమునకు భాగమున్నది ఆ భాగమును యజమానులు అందించవలెను సూర్యుని తేజము యముని కొరకు ఉదయించ వలెను. పరస్పర సంబంధముగల ద్యావాపృథ్విలు యమునికి బంధువులు. యమీ యములు సహోదరులు కావున ఇతరులను వరించవలెను -
"యమీర్యమస్య బిభృయాదజామి."
10. రానున్న కాలమున భగినులు బంధుత్వహీన భ్రాతలను భర్తలుగా పరిగ్రహింతురు. రాబోయే కాలం లో సోదరి సోదరుడుని ప్రీయుడు గా స్వీకరించెదరు. ఇది ఆకాలముకాదు. సుందరీ! నన్ను విడువుము. మరొకరిని పతిగా పరిగ్రహించుము. అతడు నీయందు వీర్యము విడిచిన బాహువులచే ఆలింగనము చేసికొనుము.
11. యమి అనుచున్నది:-
సోదరుడు ఉండగా సోదరిని అనాధను చేయు సోదరుడేమి సోదరుడు! సోదరి దుఃఖమును దూరము చేయని వాడు సోదరుడెట్లు? నేను కామమూర్చితనై పలు పలుకులు పలుకుచున్నాను. నన్నుకౌగిలించు కొనుము -"మేతన్వం సంపిపృగ్ధి"
12. యముడు అనుచున్నాడు:-
యమీ! నేను నీ దేహముతో నా దేహమును సంగమింప నిచ్చగించను. సోదరితో సంభోగించిన సోదరుని జనులు పాపిగా చీత్కరింతురు. సుందరీ! నన్ను విడువుము. ఇతర పురుషునితో ఆమోద, ఆహ్లాదముగా సంభోగించుము, అనుభవింపుము. నీ సోదరుడు నీతో మైధునము ఇచ్చగించడు -
"నతేభ్రాతా సుభగేవష్ఠ్యేతత్"
3. యమి అనుచున్నది :-
యమా! మీ మనసు, హృదయము నాకు ఏమాత్రము అర్ధము కాకున్నవి. పగ్గము గుఱ్ఱమును కట్టినట్లు, తీగ చెట్టును అల్లుకున్నట్లు అన్యస్త్రీ, నిన్ను స్వేచ్ఛగా ఆలింగనము చేసికొనును. కాని నీకు నన్ను ఇష్టపడవు!
14. యముడు అనుచున్నాడు :-
యమీ! నీవు సహితము అన్యపురుషుని సుఖముగా ఆలింగనము చేసికొనుము. తీవ చెట్టును చుట్టుకున్నట్లు అన్యపురుషుడు నిన్ను ఆలింగనము చేసికొనుగాత. అతని మనసును నీవు దొంగిలింపుము. నీమనసును అతడు దొంగిలించును -
"తస్యవాత్వంమన ఇచ్ఛాసవాతవ". నీవు అతని సాహచర్యము చేయుము.
Pictures are not my creation, downloaded from the net