17-11-2020, 12:50 PM
(16-11-2020, 09:08 AM)stories1968 Wrote: భగిని హస్త భోజనం గురుంచి తెలపగలరు
నా ప్రియాతి ప్రియమైన సోదరీమణులకు భగినీ హస్త భోజన శుభాకాంక్షలు
భగిని హస్త భోజనం 1 నవంబరు
భగము = యోని , భగిని = సోదరి, సహోదరి, తోడబుట్టినది, అక్క, చెల్లెలు
భగిని’ అంటే...చెల్లెలైనా కావచ్చు., అక్క అయినా కావచ్చు.‘హస్తభోజనం’ అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతివంట సోదరుడు తినడం అన్నమాట.
ఆ కథ ఏమిటంటే.... సూర్యభగవానునకు సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో యముడు, యమున ఒకరు. ‘యమునకు’ అన్నయ్య ‘యముడు’ అంటే ఎంతో ఇష్టం. యమునకు కూడా అంతే. యముడు తన చెల్లెలును ప్రేమగా ‘యమీ’ అని పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్లింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునకు మాట ఇచ్చాడు. అ రోజు అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు పని వత్తిడి వల్ల రాలేకపోతున్నానని, ‘కార్తీక శుద్ధ విదియ’ నాడు తప్పకుండా విందుకు వస్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు.
యమున సంతోషించి ఆ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది.అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూలమాల వేసి తను చేసిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది.
చెల్లెలు అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు. ‘ప్రతి యేడు ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకురావాలనీ., అలాగే ప్రతి సోదరుడు ఈ రోజున తన సోదరి చేతి భోజనం భుజించాలనీ’ వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని యమునకు అనుగ్రహించాడు.
అలాగే ఎవరైతే ఈనాడు సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వారికి నరలోక ప్రాప్తి కాని , అపమృత్యు భయం కానీ ఉండకుండా చూడమని వరం అడగగా యముడు వరం ప్రసాదించాడు
అందుకే ఈ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్రంనియమం విధించింది. ఆ నియమం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతోంది.- మహారాష్ట్రలో ఈ పండుగను ‘భయ్యా-దుజ్’ అని పిలుస్తారు.- నేపాల్ ప్రాంతంలో ఈ పండుగను ‘భాయి-టికా’ అని పిలుస్తారు.- పంజాబ్ ప్రాతంలో ఈ పండుగను ‘టిక్కా’ అని పిలుస్తారు.
మరుసటిరోజున అన్న చెల్లెలిని భోజనానికి పిలవాలి. దీనిని 'సోదరి తృతీయ' అంటారు.
భాతృ విదియ ఒక హిందువుల పండుగ. దీనిని కార్తీకమాసము నందు కార్తీక శుద్ధ ద్వితీయ రోజున జరుపుకుంటారు. స్మృతి కౌస్తుభము దీనిని యమ ద్వితీయ అని పేర్కొన్నది. ఈనాడు యమ, చిత్రగుప్తాది పూజ, భగినీ (భగినీ అనగా సోదరి) గృహ భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి.
సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమతమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి, వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు.
రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష(రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది. "భయ్యా ధూజీ'' అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.
Pictures are not my creation, downloaded from the net