Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రేమ+పగ=జీవితం (కథ సమాప్తం.) & Closed
#91
Update-9:

వీరూ: స్వేచ్చ, ఈ విషయాలు ఏవీ మోహినికి తెలియనివ్వకు. తెలిస్తే tension పడుతుంది, కంగారులో ఏదన్న తప్పు చేయొచ్చు.


బార్గవ్ వీరూ చెప్పినదానికి సరే అని అక్కడనుండి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిన కాసేపటికి వీరూ స్వేచ్చతో
వీరూ: స్వేచ్చ, విరాని చూసి చాలా రోజులు అవుతుంది. ఎలా ఉంది? ఒకసారి చూడాలని ఉంది.
స్వేచ్చ: బావ, అక్క బాగానే ఉంది ఇప్పుడు. నువ్వు కంగారు పడకు, పెళ్ళిలో చూస్తావు కదా.
వీరూ: హా! అదీ నిజమే అనుకో కానీ పెళ్ళి సమయం దగ్గరపడేకొలదీ ఎందుకో చాలా nervousగా అలాగే చాలా tensionగా ఉంది.
స్వేచ్చ: (వీరూ చెయ్యిని తన చేతిలోకి తీసుకుని) బావ, ప్లీస్ మీరే మరీ అలా tension పడితే మేము ఏమి చెయ్యాలి? మీరు అంతా చూసుకుంటాను అన్నారు అనే కదా, మేము ఇద్దరం happyగా ఉంది.
వీరూ: అవును, నేను అన్నీ చూసుకుంటాను అని మీకు చెప్పాను. కానీ ఇప్పటివరకూ బానే ఉన్నాను, కానీ ఇప్పుదే ఎందుకో చాలా tensionగా ఉంది.
స్వేచ్చ: బావ, ఇప్పుడు ఏమన్నా మార్పులు ఉన్నాయా?
వీరూ: ఏమీ లేవు. నేను already చెప్పాను కదా. నేను అన్నీ set చేసేసా అని. So, దాని గురించి tension ఏమీ లేదు.
ఇలా వీళ్ళు మాట్లాడుకుని ఎవరు roomsకి వాళ్ళు వెళ్ళిపోతారు.

ఇది జరిగిన కొన్ని రోజులకి వీళ్ళిద్దరూ projectని clientsకి submit చేసేసి officeలో leave తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు.పెళ్ళికి ఒక రోజు ముందు అంటే వీరూ, స్వేచ్చ పెళ్ళిమడపానికి వెళ్ళే రోజుకు సరిగ్గా ఒక 20 గంటల ముందు
వీరూ: (స్వేచ్చకి ఫోన్ చేసి) స్వేచ్చ, ఇప్పుడు నువ్వు ఫ్రీనే కదా? మాట్లాడొచ్చు కదా?

స్వేచ్చ: హా బావా. ఎవరూ లేరు నా దగ్గరలో, ఇప్పుడు చెప్పు బావ.
వీరూ: స్వేచ్చ, నాకు ఇప్పుడు మీ అక్కని ఒకసారి చూడాలని ఉంది ఒకసారి చూపించవూ, ప్లీస్.
స్వేచ్చ: సరే బావ, ఒక్క నిమిషం లైన్లోనే ఉండు.
వీరూ: సరే.
ఇంతలో స్వేచ్చ తన రూం నుండి, విరా రూంకి వెళ్ళి అక్కడ ఉన్న తన అమ్మను వేరే రూంకి పంపి, రూం గడియ పెట్టి వీరూతో;
స్వేచ్చ: బావా, ఇప్పుడు వీడియో కాల్ చేయ్.

వీరూ: సరే. (వీడియో కాల్ చేసాక). హా ఇప్పుడు చూపించు.
స్వేచ్చ: ఇదిగో బావ అక్క. అక్క ఒకసారి ఇటు చూడు (అని విరాని ఫోన్ కెమెరా వంక తిప్పగానే ఫోన్‌లో వీరూని చూసి తనకు ఏవో memories గుర్తుకువచ్చి ఏడుస్తుంది. వెంటనే)
వీరూ: విరా నువ్వు ఏడవకురా. నిన్ను ఏడిపించినవాళ్ళకి త్వరలో తగిన శాస్తి జరగబోతుంది, అది నువ్వు చూడబోతున్నావు.
(ఇంతలో)
స్వేచ్చ: ఏమిటి బావ నువ్వు అనేది?
వీరూ: అవును స్వేచ్చ, త్వరలో వాళ్ళు చావబోతున్నారు. ఆ విషయాలు నీకు తరువాత చెబుతా. ముందు విరాని ఏడవొద్దని చెప్పు. తను కుదుటపడ్డాక నాకు ఒక సారి కాల్ చేయ్.
స్వేచ్చ: సరే బావ. (అని ఫోన్ పెట్టేసి విరాని సముదాయించి, తిరిగి వీరూకి ఫోన్ చేస్తుంది విరా పక్కనే ఉండి) హా, బావ. ఇప్పుడు చెప్పు.
వీరూ: నువ్వు ఏమి చేస్తావో తెలియదు, సరిగ్గా ముహూర్తానికి 1 గంటా 30 నిమిషాల ముందు అంటే ఉదయం సరిగ్గా 9:30 కల్లా నువ్వు మండపం పక్కన ఉన్న ఇంటికి పక్కనే ఉండే బ్రౌన్ కలర్ కారులో ఎక్కు. అందులో బార్గవ్ ఉంటాడు, మిగతాది తను చూసుకుంటాడు. మళ్ళీ మీరు సరిగ్గా ముహూర్తానికి ఒక 05 నిమిషాల తరువాత అంటే 11:05కి మళ్ళీ మండపంలో ఉండాలి.
స్వేచ్చ: సరే బావా.
వీరూ: కార్ నెంబరు నోట్ చేసుకో. APxxxxxxx
స్వేచ్చ: Okay బావ.

వీరూ స్వేచ్చతో ఫోన్ మాట్లాడి, తరువాత బార్గవ్‌కి ఫోన్ చేసి

వీరూ: బార్గవ్, నువ్వు రేపు ఉదయం సరిగ్గా 9:20కల్లా మండపం పక్కనే ఉన్న ఇంటి పక్కన ఉన్న APxxxxxx number కల ఒక బ్రౌన్ కలర్ కార్ ఉంటుంది, దానిలో ఎక్కి ఉంటే సరిగ్గా 9:30 కల్లా స్వేచ్చ వస్తుంది.
బార్గవ్: సరే అన్నయ్య.
వీరూ: తను వచ్చి ఎక్కాక, మీరు xxxx registration ఆఫీసుకు వెళ్ళండి. అక్కడ మన రాహుల్ ఉంటాడు, తను మిగతా విషయాలు చూసుకుంటాడు. నేను రావటానికి కుదరదు, అందుకే తను ఉండి అన్నీ చూసుకుంటాడు. నేను already తనకి అంతా చెప్పాను. అక్కడ అంతా పూర్తి అయ్యాక సరిగ్గా 11:05కి తిరిగి మీరు ఇద్దరూ పెళ్ళి మండపంలో ఉండాలి.
బార్గవ్: సరే అన్నయ్య. మీరు కూడా మాతో ఉంటారు అనుకున్నాను. సరే మీరు చెప్పినట్టుగానే చేస్తా. మరి స్వేచ్చకు చెప్పారా?
వీరూ: నేను అంతా తనకి చెప్పేసా. తను రేపు చెప్పిన timeకి అక్కడ ఉంటుంది.

తరువాతి రోజు ఉదయం పెళ్ళి ముహూర్తానికి ముందు, వీరూ చెప్పినట్టుగానే స్వేచ్చ, బార్గవ్ registration officeకు వెళ్ళి పెళ్ళి చేసుకుంటారు. ఇక్కడ పెళ్ళి మండపంలో సరిగ్గా ముహూర్తానికి ఒక 30 నిమిషాల ముందు

పంతులుగారు: అమ్మా, పెళ్ళికూతురుని తీసుకురండి.
(cinematic effectలో పెళ్ళి కూతురు కనిపించటంలేదు అని ఇద్దరు ఆడవాళ్ళు పరిగెత్తుకుని వచ్చి చెబుతారు. ఆ వెంటనే వీరూ తండ్రి విరా, స్వేచ్చ తండ్రితో గొడవకు దిగబోతే)
వీరూ: నాన్న మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి, నేను చూసుకుంటాను.
వీరూ తండ్రి: ఎలా ప్రశాంతంగా ఉండమంటావురా! పెళ్ళి ఇలా అర్ధాంతరంగా ఆగిపోతే?
వీరూ: మీకు ఇందాకే చెప్పా ప్రశాంతంగా ఉండండి నేను చూసుకుంటాను అని. (కొంచెం base voiceలో చెప్పేసరికి వీరూ తండ్రి ఆగుతాడు.)

(వీరూ విరా తండ్రితో మాట్లాడడానికి వెళ్ళగానే)

విరా తండ్రి: బాబూ, నన్ను మన్నించు. నా కూతురు ఇలా చేస్తుంది అని అనుకోలేదు.
వీరూ: (వెంటనే విరా తండ్రితో) మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ పెద్ద అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను.
విరా తండ్రి: బాబూ! నీకు తన గురించి తెలియదు. తనకు ప్రస్తుతం గతం గుర్తులేదు, ఆ రోజు జరిగిన ప్రమాదంలో గతం మర్చిపోయింది. నేను తనదగ్గరకు వెళితేనే నన్ను రక్కేస్తుంది, తను తన చెల్లిని లేదా తన అమ్మను మాత్రమే తన దగ్గరకు రానిస్తుంది. అటువంటిది తను నిన్ను ఎలా పెళ్ళి చేసుకుంటుంది? తనతో నువ్వు ఉండలేవు బాబు.

వీరూ: (వెంటనే) మావయ్యా! నాకు అన్నీ తెలుసు. తను నన్ను తనదగ్గరకు వెళ్ళనిస్తే మీకు ఈ పెళ్ళికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా?

విరా తండ్రి: తను ఒప్పుకుంటే అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుంది బాబు.
వీరూ: అత్తయ్యా, మీ పెద్ద అమ్మాయిని తీసుకురండి.
(విరా తల్లి వెళ్ళి విరాని మండపంలోకి తీసుకురాగానే వీరూ వెళ్ళి అడుగుతాడు విరాని)
వీరూ: నన్ను పెళ్ళి చేసుకుంటావా?
విరా: (తనకు ఇష్టం అన్నందుకు సూచనగా వీరూని కౌగిలించుకుని నోటితో గట్టిగా) ఊ.(అని తల ఊపుతూ చెబుతుంది)


(వెంటనే విరా తండ్రి వీరూ కాళ్ళమీదపడబోతే వీరూ ఆపి)

వీరూ: మావయ్యా, ఏమిటిది? మీరు పెద్దవారు, ఎందుకు నా కాళ్ళమీద పడుతున్నారు?
విరా తండ్రి: బాబూ, నా కూతురుకి ఇలా అయ్యినందుకు ప్రతీ రోజూ ఎంతో కుమిలిపోతున్నాను. కానీ, ఈ రోజు మీరూ నా కుతురికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. (అని మళ్ళీ కాళ్ళమీద పడబోతే మళ్ళీ వీరూ ఆపుతాడు.)

అప్పుడే వీరూ తండ్రి: నువ్వు ఈ పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టంలేదు.
వీరూ: ఇప్పుడు మీరు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇక జీవితంలో ఎప్పటికీ నా పెళ్ళి మీరు చూడలేరు.
వీరూ తండ్రి: అంటే నీ ఉద్దేసం ఏమిటి?
వీరూ: జరిగితే నా పెళ్ళి ఈమెతోనే, లేదంటే ఇక పెళ్ళి అనే మాట ఉండదు నా జీవితంలో.
వీరూ తండ్రి: తనని పెళ్ళి చేసుకుని నువ్వేమి సుఖపడతావురా?

వీరూ: సుఖం... సుఖం... ఏమిటి మీ ఉద్దేశంలో సుఖం అంటే?

వీరూ తండ్రి: అంటే ఇద్దరూ కలిసి ఎలా రా?
వీరూ: ఓహో! మీ ఉద్దేశం సెక్స్ గురించా? తనకి గతం గుర్తులేదు పైగా mentalగా కూడా సరిగా లేదు అనే కదా మీ ఉద్దేశం?
వీరూ తండ్రి: అంటే అది..(అని నానుస్తూ) ఇప్పుడు తను ఉన్న పరిస్థితిలో పిల్లల్ని కంటే పుట్టబోయే వాళ్ళ పరిస్థితి అదీ..
వీరూ: నాన్న. నాకు తనని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురాగలను అని నమ్మకం ఉంది. తను మామూలు స్థితికి వచ్చాకే మేము పిల్లల గురించి ఆలోచించి ముందుకు వెళతాం. ఇంతకు మించి మీకు ఏమన్నా సందేహాలు ఉన్నాయా?
వీరూ తండ్రి: అదీ...
వీరూ: ఇప్పుడు ఇంకా ఏమీ మాట్లాడకండి ప్లీస్.
వీరూ తండ్రి: సరే నీ ఇష్టం ఇక, నేను చెప్పాల్సిందంతా చెప్పాను.

వీరూ: (వెంటనే విరా తండ్రివైపుకు తిరిగి) మవయ్యా, ముహూర్తానికి సమయం ఎంతో లేదు. త్వరగా తనని తయారు చేసి తీసుకువస్తే పెళ్ళి చేసుకుంటాను.

విరా తండ్రి: (కళ్ళల్లో ఆనందభాష్పాలతో) సరే బాబు. (విరా తల్లితో) త్వరగా అమ్మాయిని తయారు చేసి తీసుకురండి.
విరా తల్లి: అలాగే అని (విరాని తీసుకువెళ్ళి ముహూర్తం చీరలో తీసుకువచ్చి వీరూ పక్కన కూర్చోబెట్టగానే )
పంతులుగారు: బాబూ, ముహూర్త సమయం దాటిపోతుంది, కనుక ఆ తాళి తీసుకుని అమ్మాయి మెడలో కట్టుబాబు. భజంత్రీలు వాయించండి.
(వీరూ విరాకి తాళి కట్టగానే, విరాకి వీరూ చెప్పిన మాటలు గుర్తుకువచ్చి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెడుతుంది.)
వీరూ: (విరాని దగ్గరకు తీసుకుని, తనని సముదాయిస్తూ కన్నీళ్ళు తుడిచి నుదుటిపై ముద్దు పెట్టి అందరినీ ఆశీర్వదించమని అడుగుతున్నట్టుగా దణ్ణంపెట్టమని చెప్పగానే అలాగే చేస్తుంది విరా. అది చూసిన బందువులందరూ ఎంతో సంతోషించి ఆనందంతో వీళ్ళని ఆశీర్వదిస్తారు.)
వీళ్ళని అందరూ ఆశీర్వదించడం మొదలు పెట్టగానే స్వేచ్చ, బార్గవ్ మెడలో దండలతో ఒకరిచేతులు మరొకరు పట్టుకుని వీరూ, విరాల దగ్గరకు రాగానే;

విరా తండ్రి: నమ్మక ద్రోహి. ఎందుకు వచ్చావే ఇప్పుడు? నువ్వు ఎప్పుడు అయితే పెళ్ళిలోంచి పారిపోయావో అప్పుడే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు, పో ఇక్కడినుండి.
వీరూ: మావయ్యా. మీరు కొంచేం శాంతిస్తే మీకు చెప్పవలసింది చాలా ఉంది. అది ఇక్కడ ఉన్న బందువులముందే నేను చెబుతా.




ఇప్పటికి ఇంతే, రేపు మరొక చిన్న అప్డేట్ వస్తుంది, అది దీనికి continuation. దానిలో విరాకు అసలు ఏమయింది, ఆ తరువాత ఏమి జరిగింది అన్నది ఉంటుంది.

నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, రెప్యుటేషన్ పాసిటివ్ ఇవ్వండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి, దాని ద్వారా నేను ఎక్కడ తప్పు చేసానో తెలుస్తుంది.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 13 users Like Joncena's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ+పగ=జీవితం - by Joncena - 17-11-2020, 02:39 PM



Users browsing this thread: 4 Guest(s)