Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రేమ+పగ=జీవితం (కథ సమాప్తం.) & Closed
#56
Update-6:
వీరూ బార్గవ్‌కి మాట ఇచ్చిన కొన్ని రోజులకు వీరూ తల్లిదండ్రులు ఒక పెళ్ళి ప్రపోసల్ తెచ్చి అమ్మాయి ఫొటో పంపిస్తారు, అది చూసిన వీరూ వెంటనే ఒప్పుకుంటాడు. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి స్వేచ్చ.


వీరూ తన ఇంటికి ఫోన్ చేసి నాకు అమ్మాయి బాగా నచ్చింది అని చెప్పగానే, తన తల్లిదండ్రులు ఇన్ని రోజులు తమతో సరిగ్గా మాట్లాడని కొడుకు ఒక్కసారిగా ఫోటో పంపిన వెంటనే అమ్మాయి నచ్చింది అని చెప్పగానే ముందు కొంచెం అనుమానిస్తారు కానీ వెంటనే అమ్మాయి తరుపు అనగా విరా, స్వేచ్చ తండ్రికి ఫోన్ చేసి
వీరూ తండ్రి: అబ్బాయికి అమ్మాయి నచ్చింది అంట, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం బావగారు?
(వెంటనే ) విరా తండ్రి: వచ్చే నెలలో మంచి ముహుర్తం ఉంది అది కాయం చేసేద్దాం.
విరా తండ్రి: వచ్చే నెలలో మంచి ముహుర్తం ఉంది అది ఖాయం చేసేద్దాం. అసలే సమయం కూడా ఎక్కువ లేదు.
వీరూ తండ్రి: మరీ నెలలోపే అంటే?

విరా తండ్రి: మరి ఏమి చేస్తాం బావగారు? ఈ ముహూర్తం దాటితే వీళ్ళ జాతకం ప్రకారం ఇంకో సంవత్సరం వరకూ ముహూర్తం లేదంట.
వీరూ తండ్రి: మళ్ళీ సంవత్సరం అంటే మావాడు మళ్ళీ పెళ్ళికి ఒప్పుకోడు.
విరా తండ్రి: ఏమయింది బావగారు?
వీరూ తండ్రి: అసలు ఏమయిందో ఏమోగానీ రెండు సంవత్సరాలనుండి ఎఫ్ఫుడు అడిగినా ఈ సంవత్సరం వరకు పెళ్ళి మాట ఎత్తవద్దని చెప్పాడు. సరే కదా అని నిన్నటి నెలలో పెళ్ళిగురించి అడిగితే అసలు పెళ్ళిచేసుకోను అన్నవాడు మీ అమ్మాయి ఫొటో చూడగానే ఓకే చెప్పేసాడు.
విరా తండ్రి: ఎందుకు చెప్పడు, మా అమ్మాయీ అలాగే మీ అబ్బాయీ ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. నాకు తెలిసి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అనుకుంట అందుకే ఇద్దరూ ఫొటో చూడగానే ఒప్పుకున్నారు.

వీరూ తండ్రి: అదీ నిజమే అనుకుంట, ఫొటో ఇలా పంపి ఫోన్ చేసి చెప్పగానే ఓకే చెప్పేసాడు.

విరా తండ్రి: మా అమ్మాయి కూడా అంతే బావగారు.
వీరూ తండ్రి: హ్హ హ్హ హ్హ. మనకి ఒక పెద్ద పని తప్పింది వీళ్ళని పెళ్ళికి ఒప్పించడానికి.
విరా తండ్రి: అవును అదీ నిజమే బావగారు. సరే బావగారు, అయితే వచ్చే నెల ముహూర్తం ఖాయం చేసుకుందాం.
వీరూ తండ్రి: సరే బావగారు. సమయం తక్కువ ఉంది, చాలా పని ఉంది.
విరా తండ్రి: అవును బావగారు.
వీరూ తండ్రి: అన్నట్టు చెప్పటం మర్చిపోయా బావగారు! మావాడు మరీ మరీ చెప్పాడు, పెళ్ళి ఎంత సింపుల్‌గా జరిగితే అంత మంచిది, అలాగే తక్కువ మందిని పిలవమన్నాడు.
విరా తండ్రి: అదేమిటి బావగారు? మరీ తక్కువ మంది అంటే.
వీరూ తండ్రి: ఏమో బావగారు. వాడు అలాగే చెప్పాడు, కావాలంటే రిసెప్షన్‌కి ఎక్కువ మందిని పిలుచుకోమని మరీ మరీ చెప్పాడు.
విరా తండ్రి: పెళ్ళికి మరీ తక్కువ మంది అంటే?

వీరూ తండ్రి: అవును బావగారు, మరీ ముఖ్యం అనుకున్నవాళ్ళను ఒక 30 లేదా 40 మంది బంధువులను పిలవమని చెప్పాడు.

విరా తండ్రి: సర్లేండి అలాగే చేద్దాం.
వీరూ తండ్రి: మాతరపు వాళ్ళని ఒక 30 మందికి మించకూడదు అని కండిషన్ కూడా పెట్టి చచ్చాడు మావాడు.
విరా తండ్రి: అదేమిటి బావగారు అంత బాధ పడుతున్నారు?
వీరూ తండ్రి: నాతరుపు వాళ్ళు, మీ అక్కయ్య తరపువాళ్ళు కలిపి మొత్తం ఒక 120 మంది ఉంటారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళని కూడా కలుపుకుంటే ఎంత కాదన్నా ఒక 400 మంది దగ్గరగా ఉంటారు.
విరా తండ్రి: చాలా ఎక్కువ మందే ఉన్నారు అయితే.
వీరూ తండ్రి: ముఖ్యంగా రమ్మనాలి అంటే ఎంత కాదన్నా వచ్చే వాళ్ళు ఒక 100 మంది ఉంటారు, వీడేమో 30కి మించకూడదు అంటున్నాడు.
విరా తండ్రి: సర్లేండి బావగారు. వాళ్ళ ఆనందమే కద మనకి ముఖ్యం.
వీరూ తండ్రి: అందుకే కదా వాడు చెప్పినదానికి సరే అన్నది.
విరా తండ్రి: సరే బావగారు. పిలవవలసిన వాళ్ళకి, పిలవని వాళ్ళకి ఫోన్ చేసి అసలు విషయం చెప్పాలి, ఉంటాను.
వీరూ తండ్రి: సరే బావగారు.


ఇక్కడ ఇలా జరుగుతుంటే స్వేచ్చ వీరూకి ఫోన్ చేసి
స్వేచ్చ: బావా! నిన్న నాన్న నాకు ఒక సంబంధం చూసాను అని చెప్పి నీ ఫోటో చూపించారు, వెంటనే ఓకే చెప్పేసా.
వీరూ: నాకు ఈ వాళే నీ ఫోటో పంపారు అమ్మా వాళ్ళు. నేను కూడా ఓకే చెప్పేసా. ఇంతకూ ఈ విషయం బార్గవ్‌కు చెప్పావా?
స్వేచ్చ: లేదు బావ. తనకి ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు.
వీరూ: నువ్వు కంగారు పడకు. నేను తనకి ఫోన్ చేసి మాట్లాడి తనని నేను కన్విన్స్ చేస్తా.

స్వేచ్చ: లేదు బావ. తనకి ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు.

వీరూ: నువ్వు కంగారు పడకు. నేను తనకి ఫోన్ చేసి మాట్లాడి తనని నేను కన్విన్స్ చేస్తా.
స్వేచ్చ: నాకు ఎందుకో చాలా భయంగా ఉంది.
వీరూ: నువ్వు వేరే ఆలోచనలు పెట్టుకోకు. అన్ని మన మంచికే జరుగుతాయి. వచ్చే నెలలోనే మన పెళ్ళి ముహుర్తం. ఇందాకే మావయ్యగారు, నాన్న ఫోన్ చేసి చెప్పారు. ఆఫీస్‌లో కూడా మన పెళ్ళి అని చెప్పకుండా వచ్చే నెలలో పెళ్ళి ఉంది అని చెప్పి లీవ్ అడుగు. నేను రెండు రోజుల తరువాత చెప్తా.
స్వేచ్చ: సరే బావ. నేను రేపు ఉదయమే అఫీసులో లీవ్‌కి అప్లై చేస్తా.


ఇక్కడ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే, తనపైన అట్టాక్ చేసిన వాళ్ళని ఎలా పట్టుకుందాం అని అలోచిస్తుంటాడు బార్గవ్. అప్పుడే తనకి ఒక వీడియో వాట్సాప్‌కి వస్తుంది. ఆ వీడియోలో తనపైన విరాపైన అట్టాక్ చేసినవాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేస్తుంటారు. వెంటనే

బార్గవ్: నేను ఏసీపీ బార్గవ్. నాకు వాట్సాప్‌కి వచ్చిన వీడియో ఎవరు ఎక్కడ అప్లోడ్ చేసారు. అలాగే వాళ్ళ లోకేషన్ కూడా కావాలి.
అవతలి వ్యక్తి: సరే సర్. నాకు ఒక రెండు గంటల సమయం ఇస్తే, నేను మీకు అన్నీ ఇస్తాను.
బార్గవ్: సరే. కానీ నాకు వాళ్ళ లోకేషన్ ముఖ్యం, అలాగే అది ఎప్పుడు అప్లోడ్ చేసారో కూడా కావలి.
అని ఫోన్ పెట్టేసి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక ఫోన్ వస్తుంది.
బార్గవ్: నేను ఏసీపీ బార్గవ్‌ని మాట్లాడుతున్నాను. (అవతలి వ్యక్తి చెప్పిన విషయం విన్న బార్గవ్) ఏమిటీ? ఎప్పుడు? ఎక్కడ? సరే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నా.
అని ఫోన్ పెట్టేసి ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన ప్లేస్‌కి వెళ్తాడు.



ఇప్పటికి ఇంతే, తరువాతి భాగం మరొక రెండు రోజుల్లో ఇస్తాను. ఈ సారి చెప్పిన సమయానికి ఖచ్చితంగా ఇస్తాను.

నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, రెప్యుటేషన్ పాసిటివ్ ఇవ్వండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి, దాని ద్వారా నేను ఎక్కడ తప్పు చేసానో తెలుస్తుంది.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ+పగ=జీవితం - by Joncena - 09-11-2020, 08:04 PM



Users browsing this thread: 1 Guest(s)