Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రేమ+పగ=జీవితం (కథ సమాప్తం.) & Closed
#49
Update-5:
విరా నిన్ను కూడా పెళ్ళి చేసుకుని హాయిగా ఉండమంది, ఒకవేళ నువ్వు ఎమన్నా చేసుకుంటే ....... దూరం అయ్యేలా చెయ్యకండి. అని చెప్పి వాళ్ళదగ్గర మాట తీసుకుంటుంది.


ఇలా విరా తల్లి వీళ్ళతో చెప్పాక ఇక తప్పక తల్లి చెప్పినట్టుగానే వీరుకి ఫోనె చేసి చెబుతుంది స్వేచ్చ, మోహిని కూడా అదే చెబుతుంది తప్పనిసరి పరిస్తితుల్లో వీరూ ఫోన్ చేసినప్పుడు. ఇది జరిగిన ఒక నెలకు స్వేచ్చ ఆఫీసులో జాయిన్ అవ్వవలసిన రోజు దగ్గరపడడంతో హైదరాబాద్ వచ్చి ఆఫీస్‌లో జాయిన్ అవుతుంది. స్వేచ్చ జాయిన్ అయిన వారం రోజుల తరువాత వీరూ ఆఫీస్‌కు వస్తాడు. వీరూ చాలా మూడీగా, నీరసంగా ఉంటాడు, అది చూసిన స్వేచ్చ వెంటనే వీరూ దగ్గరకు వచ్చి

స్వేచ్చ: బావా ఎలా ఉన్నారు?
వీరూ: నన్ను ఎందుకు ఇంకా బావా అని పిలిచి బాధ పెడుతావు. విరా నన్ను వదిలి వేరే ఎవరినో పెళ్ళి చేసుకుంది కదా, నేను ఎలా బావని అవుతాను నీకు.
స్వేచ్చ: అక్క ఎవరిని పెళ్ళి చేసుకున్నా మీరు ఎప్పటికీ నాకు బావనే, అందుకే నేను ఎప్పటికీ మిమ్మల్ని బావా అని మాత్రమే పిలుస్తాను.
స్వేచ్చ: ఏమిటి ఇలా అయ్యిపోయారు? సరిగా తినడం లేదా?
వీరూ: ఏమి చెయ్యను, విరాకు పెళ్ళి అయ్యింది అన్న దగ్గరనుంచి ఏమి తినాలి అనిపించడంలేదు. ఎందుకో నాకు నేను నచ్చడంలేదు.


స్వేచ్చ: బావా మీరు అలా ఉండకండి ప్లీస్. మీరు అలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది. అక్క తప్పనిసరి పరిస్తితుల్లో పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. నాన్న మీ పెళ్ళికి ఒప్పుకోలేదు, మీకు ఇలా జరగకముందే ఒక సంబంధం చూసారు.
వీరూ: మరి నువ్వు చెప్పవచ్చుగా!
స్వేచ్చ: నేను ఎంత చెప్పినా వినలేదు నాన్న. పైగా అక్కని ఇంటికి తీసుకెళ్ళాక అక్కను బ్లాక్‌మెయిల్ చేసారు, ఆ పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతాను అని. అక్క ముందు ఒప్పుకోకపోయేసరికి విషంకూడా తాగేసారు నాన్న. ఇక తప్పక ఆ పెళ్ళి చేసుకోవలసి వచ్చింది.

వీరూ: సరిలే, మీ అక్క ఇప్పుడు ఎలా ఉంది?
స్వేచ్చ: ఏదో ఉంది అంటే ఉంది. అక్క మీ గురించే ఆలోచిస్తుంది, తన వల్ల మీరు ఏమన్న చేసుకుంటారేమో అని.
వీరూ: నాకు తెలుసు తన గురించి, నాకు ఎమన్నా అయితే తట్టుకోలేదు అని. కంగారు పడవొద్దని చెప్పు. నేనే చెప్పొచ్చు కాని ఇప్పుడు తను వేరెవరికో భార్య, నేను మాట్లాడకూడదు.

వీళ్ళు ఇద్దరూ ఇలా కలిసి మాట్లాడుకొన్న కొన్ని రోజులకు ఏదో ఎంక్వయిరీ పనిమీద వీరూ, స్వేచ్చ పనిచేస్తున్న ఆఫీస్‌కు వచ్చిన బార్గవ్ అన్న ఒక సెక్యూరిటీ అధికారి స్వేచ్చని చూసి వెళ్ళి పలకరించి నెంబర్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ సంఘటన్ జరిగిన కొన్ని రోజులకు బార్గవ్ స్వేచ్చకు ప్రపోస్ చేస్తాడు, స్వేచ్చకూడా ఓకే చెప్పేస్తుంది. అదే రోజు స్వేచ్చ వీరూకి ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి విరా, వీరూల కామన్ పాయింట్‌కు రమ్మని. ఇద్దరు అక్కడ కలిసాక.

స్వేచ్చ: బావా, ఇవాళ నాకు ఒకరు ప్రపోస్ చేసారు, నేను ఓకే కూడా చెప్పేసాను. అతనిని మీకు పరిచయం చేస్తాను. అతనిని ఇక్కడకు రమ్మన్నాను.
వీరూ: ఎలా పరిచయం, ఎప్పుడు కలిసారు?
స్వేచ్చ: అతను నా చిన్నప్పటి స్నేహితుడు. ఈ మధ్యనే మన ఆఫీసుకు ఏదో పనిమీద వచ్చినప్పుడు కలిసాడు. అప్పటినుండి రోజూ మాట్లాడుకుంటున్నాం. ఈ రోజూ ప్రపోస్ చేస్తే ఓకే చెప్పేసాను.

(ఇంతలో బార్గవ్ వస్తాడు.)
స్వేచ్చ: బావ ఇతను బార్గవ్, ఇతని గురించే నీకు చెప్పింది. బార్గవ్, ఇతని పేరు వీరేంద్ర, నాకు బావ.
బార్గవ్: స్వేచ్చ, నాకు తెలిసినంత వరకు నీకు బావలెవరూ లేరు కదా!
స్వేచ్చ: బావ, మా అక్క ప్రేమించుకున్నారు. అందుకే నేను బావ అని పిలుస్తాను. మిగిలిన విషయాలు నీకు తరువాత చెప్తాను. ఇప్పుడు ఆ విషయాలు చెప్పి బావను బాధ పెట్టదలుచుకోలేదు.
(వీళ్ళు ముగ్గురూ మాట్లాడుకున్నతరువాత బార్గవ్ వెళ్ళిపోతు వీరూ నంబర్ తీసుకుని వెళతాడు. బార్గవ్‌కు వీరూని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపించినా స్వేచ్చ ముందు అడుగడు, అలాగే వీరూ కూడా బార్గవ్‌ని గుర్తుపట్టినా గుర్తుపట్టనట్టే ఉంటాడు.)

స్వేచ్చ అక్కడినుండి వెళ్ళిపోయాక; బార్గవ్ వీరూకి ఫోన్ చేస్తాడు. వీరూ ఫోన్ లిఫ్ట్ చేసి

వీరూ: ఇందాక ఎక్కడ మీట్ అయ్యామో అక్కడే ఉన్నాను, మీరు రావచ్చు.
బార్గవ్: సరే వస్తున్నా.
(బార్గవ్ ఆ రెస్టారెంట్‌కి వెళ్ళి వీరూని కలిసి)
బార్గవ్: నేను ఏమీ అడగకుండా మీరు ఎక్కడ ఉన్నది నాకు ఎందుకు చెప్పారు?
వీరూ: మీరు అదే అడుగుతారు అని తెలుసు అందుకే ముందే చెప్పాను, అలాగే మీతో మాట్లాడాలి.
బార్గవ్: సరే. మీరు నన్ను ఏకవచనంతో పిలవవచ్చు. అలాగే మీకు అబ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని అన్నయ్యా అని పిలుస్తా.
వీరూ: సరే, నీ ఇష్టం. ఇక అడగదలుచుకున్నది అడగవచ్చు.
బార్గవ్: అంటే ఆ రోజు హాస్పిటల్‌లో చెప్పినది స్వేచ్చ అక్క విరాజిత గురించా?
వీరూ: అవును. నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసిన విషయం స్వేచ్చకు చెప్పకు. తెలిస్తే తను బాధ పడుతుంది.

ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఇందాకే అడిగేద్దాం అనుకున్నాను, కానీ స్వేచ్చ ఉందని ఆగాను.

బార్గవ్: ఆ దెబ్బ కొన్ని రోజులకే తగ్గిపోయింది. ఆ రోజు నా మీద జరిగిన ఫైరింగ్ మీకు విరాజితకు సహాయపడడానికి బాగా ఉపయోగపడినట్టుంది.
వీరూ: అవును, నాకు దొరికిన గాజుముక్కతో కట్లు తెంపుకుంటుంటే నా దగ్గరనుండి ఆ ముక్క తీసుకుని దూరంగా విసిరేసారు. సరైన సమయానికి ఆ బుల్లేట్ వచ్చి సరిగ్గా నా చేతికి వేసిన కట్లకు తగలడంతో అవి తెగిపోయాయి, నేను వాళ్ళను కొట్టి సరైన సమయానికి హాస్పిటల్‌కి తీసుకురాగలిగాను.
బార్గవ్: చెప్పడం మర్చిపోయా! ఆ రోజు మీరు కొట్టిన వాళ్ళే నా పైన ఫైరింగ్ చేయించింది. నా మీద ఫైరింగ్ చేసిన గ్యాంగ్ మొత్తాన్నీ లేపేసేముందు చెప్పారు, ఎవరు నాపై ఫైరింగ్ చేయించింది.

వీరూ: మరి నీకు ఎలా తెలుసు నేను కొట్టిన వాళ్ళే నీ పైన అట్టాక్ చేయించింది అని?

బార్గవ్: నాపై అట్టాక్ చేసినప్పుడు వాళ్ళనుండి తప్పించుకుని రివర్స్ అట్టాక్ చేసినప్పుడు అందరూ చచ్చారు, ఒక్కడు తప్ప. వాడే చెప్పాడు, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు బీచ్ దగ్గరకు తాగుతూ వెళ్ళారని. వాళ్ళని లేపేసే ప్రాసస్‌లో నేను ఫైర్ చేసిన ఒక బుల్లెట్ వచ్చి మీ కట్లు తెంపింది.
నేను చివరి వాడిని లేపేసి అటుగా వస్తుంటే చూసాను మీరు వాళ్ళని కొట్టి ఎవరినో తీసుకుని వెళ్ళడం. నేను పరుగున అక్కడికి వచ్చేసరికి మీరు ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. అప్పుడే నేను ఆటో నెంబరు నోట్ చేసుకుని వాడి ద్వారా మిమ్మల్ని హాస్పిటల్‌లో కలిసాను.
వీరూ: మరి నేను కొట్టిన వాళ్ళు?
బార్గవ్: వాళ్ళను వేరే హస్పిటల్‌లో చేర్చి మీ దగ్గరకు వచ్చి తిరిగి ఆ హస్పిటల్‌కు వెళ్ళేసరికీ, వాళ్ళను ఎవరో తీసుకువెళ్ళారు అని తెలిసింది.

వీరూ: మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలిసిందా?

బార్గవ్: తెలిసింది, వాళ్ళు ముగ్గురూ బాబులు కలిసి ఒక కంపెనీ రన్ చేస్తున్నారు. వీళ్ళ లాగే వాళ్ళుకూడా మంచి దోస్తులు.
వీరూ: వాళ్ళ వల్ల విరా, నా జీవితాలు నాశనం అయ్యాయి. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే వాళ్ళవల్ల ఇంకొకరి జీవితం నాశనం అవుతుంది.
బార్గవ్: నేను తప్పకుండా మీకు సహాయం చేస్తా. మీరే నా పెళ్ళి దగ్గరుండి చెయ్యాలి.
వీరూ: నేను మాట ఇస్తున్నాను, మీ ఇద్దరి పెళ్ళి నేను జరిపిస్తాను.

ఇది జరిగిన కొన్ని రోజులకు వీరూ తల్లిదండ్రులు ఒక పెళ్ళి ప్రపోసల్ తెచ్చి అమ్మాయి ఫొటో పంపిస్తారు, అది చూసిన వీరూ వెంటనే ఒప్పుకుంటాడు. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి స్వేచ్చ.

ఇప్పటికి ఇంతే, రేపు సాయంత్రంలోపు ఇంకొక అప్డేట్ ఉంటుంది. ఈ సారి చెప్పిన సమయానికి ఖచ్చితంగా ఇస్తాను.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 11 users Like Joncena's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ+పగ=జీవితం - by Joncena - 08-11-2020, 02:46 PM



Users browsing this thread: 2 Guest(s)