Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*Important* ❤️★❤️★❤️ మిత్రులందరికి మన ఫోరం 2వ జన్మదిన శుభాకాంక్షలు. ❤️★❤️★❤️
#3
ముందుగా ఈ సైట్ నిర్వాహకులైన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సరిత్ గారు. ఇలాగే మరెన్నో వార్షికోత్సవాలు మన సైట్ జరుపుకోవాలి అని కోరుకుంటున్నాను.

ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో కొంత సాధించిన వారే. కొందరు చదువు పూర్తి చేసిన గ్రాడుయాట్లు, ఇంకొందరు ఉద్యోగాలు చేస్తున్న విద్యావేత్తలు, మరి కొందరు సంసార సాగరాన్ని ఈదుతున్న వైవాహికులు. ఇలా అందరూ ఎంతో కొంత తమ వంతుగా సమాజానికి ఏదో ఒకటి అందిస్తున్న వారే. అలాగే తమ కుటుంబానికి కష్టం రాకుండా చూసుకుంటూ మంచి కుటుంబ సభ్యులుగా మెలుగుతున్న వారే. సమాజం దృష్టిలో అయితే ఇంతకన్నా ఇంకేం కావాలి అని అనిపిస్తుంది.

నిజమే మరి
మనిషిగా పుట్టాక చదువుకోవాలి అన్నారు కాబట్టి చదువు పూర్తి అయింది
మగాడిగా/ఆడదానిగా పుట్టాక పెళ్లి చేసుకోవాలి అన్నారు కాబట్టి అది కూడా అయిపోయింది
ఇక తరువాత తమలోని ఆడతానాన్ని/ మగతనాన్ని నిరూపించుకోవాలి కాబట్టి పిల్లలని కనడం కూడా ప్రమేయం లేనంత వేగంగా అయిపోతుంది
సమాజం కోసం లేదా కుటుంబం కోసం ఏదో ఒక ఉద్యోగం వెలగబెట్టాలి కాబట్టి ఆ పని కూడా నెత్తిన వేసుకోవడం అయింది
మరి ఇంతకన్నా ఇంకేం కావాలి ?
ఇంతేనా మనిషి అస్థిత్వం ?
ఇంకేం లేదా ?

అటువంటి ప్రశ్నలని వేసుకొని తాము గడుపుతున్న జీవితానికి ఒక కొత్త రంగు అద్దాలని ఆరాటపడే జాతి మనుషులని నేను గౌరవిస్తాను.
మిగిలిన వాళ్ళంటే గౌరవం లేదు అని కాదు, కానీ మనిషి పుట్టాక తన సామర్ధ్యానికి తన ఆలోచనా శక్తికి తగ్గట్టు జీవనం సాగించాలి అని నా ఉద్దేశం.
అందువల్లే కొంత మంది పెళ్లి అయ్యి కూడా చదువు లేని స్త్రీలు తమ విషయ పరిజ్ఞానాన్ని వాడి వజ్రాల్లాంటి యువతని తయారు చేయగలిగారు.
అలాగే చెప్పుకోవడానికి ఆస్తులు లేని తండ్రులు తమ కష్టాన్ని పణంగా పెట్టి భావి తరానికి బాసటగా నిలిచారు.
అలాగే ఈరోజు మనం అందరం మూస ధోరణిలో జీవితాన్ని గడపడమే కాకుండా మరెంతో చేయగలం అని అర్ధం చేసుకున్నాక ఎలాగో అలా మన విద్యని , మన ఆలోచనలని వాడటం అనేది ఆవశ్యకం.
ఈ దారిలో కొందరు లలిత కళలని ఎంచుకుంటారు , మరి కొందరు ఇంకేదో ఎంచుకుంటారు ...
కానీ ఇక్కడ ఉన్న సభ్యులు ఇంకా గొప్పగా ఆలోచించి తమ విలువైన సమయాన్ని తరతరాలుగా మన మానవ జాతిని అలరింపజేస్తున్న శృంగార సామ్రాజ్యం వైపు మలుపు తిప్పారు.

ఇక్కడ కేవలం పాఠకులుగా తమ ఆనందాన్ని వెతుక్కునే వారు ఉన్నారు
ఒక అడుగు ముందుకి వేసి తమ భావాలని పంచుకునే వారు ఉన్నారు
మరొక అడుగు ముందుకి వేసి రచనలు చేసేవారు కూడా ఉన్నారు
వీరితో పాటుగా ఎంతో గొప్ప ఉన్నతిని సాధించి ఈ ప్రపంచాన్ని సరికొత్త దృష్టి కోణంలో చూసేవారు కూడా ఉన్నారు.

అటువంటి మా అందరి అస్థిత్వం మనగలుగుతుంది అంటే అది మీ గొప్పతనం సరిత్ గారు
అందుకే అంటున్నాను మేము అందరం ఒకే గూటి పక్షులం అయ్యినా అవకపోయినా , మా గూళ్ళు వేరు ఐనా ...
మేమందరం గూళ్ళు కట్టుకున్న మహావృక్షం మన సైట్
ఆ సైట్ కి బలం మీరే
మా నమ్మకం మీరే

ధన్యవాదాలు
devil2 - Lucifer Morningstarsex
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

[+] 8 users Like LLuciferMorningstar's post
Like Reply


Messages In This Thread
RE: ❤️★❤️★❤️ మిత్రులందరికి మన ఫోరం 2వ జన్మదిన శుభాకాంక్షలు. ❤️★❤️★❤️ - by LLuciferMorningstar - 04-11-2020, 08:47 AM



Users browsing this thread: 1 Guest(s)