15-03-2019, 05:23 PM
ఆ సంఘటన జరిగిన తరువాత కొద్దీ రోజులు మాములుగా గడచిపోయాయి, ఒక రోజు సాయంత్రం నా స్నేహితుడు చంద్రం మా ఇంటికి వచ్చాడు, వాడితో కబుర్లు చెపుతూ ఉన్నా, ఒక తీతువు పిట్ట కూత పెడుతూ మా ఊరి మీదుగా ఎగురుతోంది,
పక్కింట్లో ఉండే ఒక ముసలావిడ ఇలా అంది, తీతువు అదే పనిగా అరుస్తూ తిరుగుతోంది అంటే ఎదో అరిష్టం, యముడు ఏదో ప్రాణిని ఈ ఊరి నుండి తీసుకెళ్లడం ఖాయం అంది, ఇలాంటివి నమ్ముతావా మామా నువ్వు అన్నాడు చంద్రం, నేను అసలు నమ్మను అన్నాను,
ఆ రోజు అర్దరాత్రి సమయం లో మా ఇంటి తలుపు చప్పుడు అయి నిద్రలేచాను, విజయ్ తలుపు తీ అని ఆడ గొంతు పిలుస్తోంది, అది కచ్చితంగా లక్ష్మి గోంతే,* నేను కంగారుపడ్డాను తలుపు తీసి ఈ సమయం లో ఎందుకు వచ్చావు అన్నాను,
మా వాళ్లు నా కోసం వెతుకుతూ వస్తున్నారు, వివరంగా చెప్పడానికి సమయం లేదు, ముందు మనం ఇక్కడి నుండి పారిపోదాం రా అంది, నాకు కూడా ఆలోచించే టైం లేదు, ఇద్దరం కలసి ఊరి బయటకు పరిగెత్తినాము, అది పున్నమి రాత్రి, పున్నమి వెలుగులో సముద్రతీరం స్పష్టంగా కనిపిస్తోంది,
ఈదురు గాలులు మొదలయ్యాయి సముద్రం అల్లకల్లోలంగా ఉంది రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి, సరిగ్గా తాటి చెట్ల వీధిలోకి వచ్చేసరికి లక్ష్మి వాళ్ళ నాన్న, అన్నయ్య, ఇంకొ నలుగురు మనుషులు మాకు అడ్డుపడ్డారు, నా మీద కర్రలతో దాడి చేసారు, వాళ్ళను పక్కకు తోసేసి లక్ష్మి చెయ్యి పట్టుకోని పెరిగేడుతున్నాను
ఒంటి నిండా దెబ్బలు తగలటం వల్ల పరిగెత్తలేక పోతున్నాను, సరిగా ఊపిరి ఆడటంలేదు ఆయాసపడుతూ సముద్రతీరం వైపు పెరిగేదుతుంటే, వెనుక నుండి నా తల మీద ఎవరో బలంగా కర్రతో కొట్టారు, నాకు కళ్ళు బైర్లుకమ్మి పడిపోయాను అని కథ చెప్పడం ఆపాను,
ఇంత సేపు నేను చెప్పిన కథ మొత్తం మా అన్నయ్య మరియు డాక్టర్ శ్రద్ధగా విన్నారు, నేను చెప్పడం ఆపిన తరువాత డాక్టర్ అడిగాడు మిగిలిన కథ చెప్పు అని, నాకు అంత వరకే గుర్తుకు వచ్చింది డాక్టర్ తరువాత ఏమి జరిగిందో నాకు తెలిదు అన్నాను, డాక్టర్ వీడికి తరువాత జరిగింది ఎందుకు గుర్తు రావడం లేదు అని అడిగాడు విక్రమ్,
బహుశా ఆ దెబ్బ తోనే విజయ్ చనిపోయి ఉంటాడు, అందుకే తరువాత జరిగింది గుర్తుకు రాలేదు అన్నాడు, అన్నయ్య నా వైపు చూసి అదిరా నీ దురాశ నిన్ను చంపేసింది అన్నాడు, అందరం గట్టిగా నావ్వినాము, ఇక నీ తమ్ముడి సమస్య తీరినట్లే నిద్రలో కలకనడం ఉలిక్కిపడటం లాంటివి ఉండవు అన్నాడు డాక్టర్, విక్రమ్ డాక్టర్ కి థాంక్స్ చెప్పాడు,
నాకు చాల అపాయింట్మెంట్స్ ఉన్నాయ్ నేను బెంగళూర్ వెళ్ళిపోతాను అని బయలుదేరాడు, అన్నయ్య డాక్టర్ ని పంపించి వచ్చాడు, రెడీ అవ్వరా మనం కూడా వెళ్దాం అన్నాడు, అన్నయ్య తరువాత ఏమి జరిగిందో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాను, అదెలా కుదురుతుంది రా ఆ రోజు జరిగింది ఎవరికి తెలుస్తుంది ఎవరు చెప్తారు అన్నాడు,
ప్రయత్నం చేద్దాం లేకపోతె మనసులో వెలితిగా ఉంటుంది రా అన్నాను, సరే ఎంక్వయిరీ చేద్దాం పదా అన్నాడు, ఇద్దరం భీమిలి చేరుకున్నాం, కాస్త వయసు పడిన వాళ్లు అందరిని విజయ్ గురించి అడిగాము ఎటువంటి క్లు దొరకలేదు, లక్ష్మి గురించి అడిగితె తెలుస్తుందేమో అన్నాను,
లక్ష్మి గురించి అడిగితె తన భర్తతో కలసి హైదరాబాద్ లో ఉంటోంది అని తెలిసింది కానీ విజయ్ గురించి తెలియలేదు, నిరాశగా వెనుతిరిగి వెళ్లిపోతుంటే అప్పుడు ఎదురయ్యడు చంద్రం చేతిలో ఊతకర్రతో, నేను అతడిని గుర్తు పెట్టి అన్నయ్య ఇతడే నా సన్నిహితుడు చంద్రం అన్నాను,
అన్నయ్య చంద్రాన్నీ ఆపి విజయ్ గురించి అడిగాడు, వాడు నలబై సంవత్సరాల క్రితం చనిపోయాడు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అన్నాడు, అతనికి నేనె విజయ్ ని మల్లి పుట్టాను అని చెప్పా, అతడు ఆశ్చర్యపోయాడు నమ్మలేని విధంగా మమ్మల్ని చూస్తున్నాడు,
నేను చంద్రంకి విజయ్ గురించిన అన్నీ విషయాలు చెప్పాను, విజయ్ చనిపోయే రోజు సాయంత్రం తీతువు అరుస్తూ మన ఊరి పైన తిరిగింది కదా అన్నాను, నేను చెప్పినవన్నీ విన్నాక చంద్రం కి నమ్మకం కుదిరింది, అతడు జరిగింది చెప్ప సాగాడు,
విజయ్ ని చంపింది జమీందారు గారి కొడుకు మనుమడు, ఆరోజు అర్థరాత్రి సమయంలో కర్రలతో దాడి చేసి చంపేశారు, ఎందుకు చంపారు అనేది కచ్చితంగా తెలియదు ఒక్కొక్కరు ఒక్కో విదంగా చెప్పుకున్నారు, విజయ్ జమీందారు గారి కోడలితో సంబంధం పెట్టుకున్నాడు అని కొందరు, కాదు జమీందారు మనవరాలితో అని ఇంకొందరు కాదు కాదు డబ్బు నగలు దొంగతనం చేసాడు అని ఇంకొందరు అనుకున్నారు,
ఎవరికి తోచినట్లు వాళ్లు ఊహించుకున్నారు కానీ అసలు విషయం కచ్చితంగా ఎవరికీ తెలియదు, పెద్దవాళ్ళ వ్యవహారం కదా అసలు విషయం బయటకు పొక్కలేదు అన్నాడు, విజయ్ కి ఎవరూ లేరు కాబట్టి వాడి చావు గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు అన్నాడు,
ఇప్పుడు జమీందారు కుటుంబం ఎలా ఉంది అని అడిగాను, అప్పటి జమీందారు గారు అయన కొడుకు కోడలు చనిపోయారు అని చెప్పాడు, జమీందారు గారి మనుమడు ఇప్పుడు mla అయ్యాడు అని చెప్పాడు, జమీందారు గారి మనుమరాలు లక్ష్మి పెళ్ళి చేసుకొని హైదరాబాద్ లో ఉంటోందని చెప్పాడు,
చాల థాంక్స్ చంద్రం అన్నాను, వాళ్లు నిన్ను ఎందుకు చంపారు అని అడిగాడు, జమీందారు కోడలు బట్టలు మార్చుకుంటంటే చూసాను అందుకే చంపేశారు అని అబద్దం చెప్పను, ఎందుకైనా మంచిది అని పదివేలు డబ్బులు ఇచ్చి చంద్రం ఈ విషయం ఎవరికీ చెప్పకు అన్నాను, చెప్పినా ఎవరూ నమ్మరు నన్ను పిచ్చివాడు అనుకుంటారు అని నవ్వాడు,
తరువాత నేను అన్నయ్య విశాఖపట్నం చేరుకున్నాం, లక్ష్మి సంతోషంగా ఉందని తెలిసి చాల సంతోషపడ్డాను, అన్నయ్య ఒకసారి లక్ష్మి ని చూసి మాట్లాడాలి అన్నాను, వద్దురా ఇప్పుడు లక్ష్మి విజయ్ ని మరచిపోయి సంతోషంగా ఉంది, ఇన్ని సంవత్సరాల తరువాత నువ్వేల్లి గుర్తు చేయడం ఎందుకు, అదీకాక తనకి భర్త, పిల్లలు, పిల్లలకి పిల్లలు మొత్తం ఫామిలీ ఉంటుంది, వాళ్లకు ఎవరికీ లక్ష్మి పెళ్ళికి ముందు ప్రేమ గురించి తెలియక పోవచ్చు, పొరపాటున వాళ్లకు తెలిస్తే* లక్ష్మికి గౌరవం తగ్గిపోతుంది ఒకసారి ఆలోచించు అన్నాడు,
అన్నయ్య చెప్పింది నిజం అనిపించింది, లక్ష్మిని కలవాలన్న నా నిర్ణయం మార్చుకున్న, తిరుపతికి వెళ్లిపోవాలని నిర్ణయించు కున్నాము, విక్రం మా నాన్నకు ఫోన్ చేసాడు, నాన్న ఆత్రంగా అడుగుతున్నాడు ఆ కల ఏంటో తెలిసిందా రాజు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు,
నాన్న మన రాజు గాడికి గతజన్మ గుర్తుకు వచ్చింది, వాడికి వచ్చిన కల కూడా అదే, గత జన్మలో సరిగ్గా పౌర్ణమి రోజు అర్థరాత్రి చనిపోయాడు, అందుకే అదే సమయంలో కల వస్తోంది అన్నాడు, గతజన్మ అనగానే నాన్న విస్తుపోయాడు, గతజన్మ గుర్తుకు రావడం ఏంటిరా మన బిడ్డ కాబట్టి వాడు చెప్పేది మనం నమ్ముతాము, చుట్టు పక్కల వాళ్లకు బంధువులకు అదే విషయం చెప్తే వీడికి పిచ్చి పట్టింది అనుకుంటారు అన్నాడు,
మరి ఇంకేం చెప్పాలి అని అడిగాడు విక్రమ్, ముందు ఈ విషయం మీ అమ్మకు చెప్తాను, ఇద్దరం అలోచించి తరువాత నీకు ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేసాడు, తరువాత నేను అన్నయ్య రైల్వేస్టేషన్ కి చేరుకున్నాం తిరుపతికి ట్రైన్ ఆరుగంటలకి అంటే ఇంకా రెండు గంటల సమయం ఉంది, తత్కాల్ లో రిజర్వేషన్ దొరుకుతుందేమో అని వెళ్లాడు విక్రమ్, నేను అక్కడ వున్న ఒక బెంచ్ మీద కూర్చున్నాను.