Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రేమ+పగ=జీవితం (కథ సమాప్తం.) & Closed
#29
Update-3:
ఎప్పుడు విరా, వీరూ project work మీద ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో కలిసి వెళ్ళే మోహిని ఈసారి తనకు collegeలో final practical exam ఉండడంతో ఒక రోజు lateగా వెళుతుంది. మోహిని అక్కడకు వెళ్ళేప్పటికి, వీరూ అలాగే విరా ఇద్దరూ hospitalలో ఉంటారు. విరాని operation theaterలో చూసిన మోహిని విరా తల్లిదండ్రులకు ఫొన్ చేసి గోవాలో వాళ్ళు ఉన్న hospitalకు రమ్మని చెబుతుంది. విరా తల్లిదండ్రులతో పాటు విరా చెల్లెలు అయిన స్వేచ్చ కూడా వస్తుంది. విరాని చూసిన స్వేచ్చ మోహినిని పక్కకు తీసుకెళ్ళి

స్వేచ్చ: మోహిని, అసలు ఏమి జరిగింది? అక్కని operation theaterలో ఎందుకు ఉంచారు? బావ ఎక్కడ?
మోహిని: (స్వేచ్చను తీసుకేళ్ళి ICUలో ఉన్న వీరూని చూపిస్తోంది.)
మోహిని: నేను వచ్చేప్పటికి వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏమి జరిగిందో నాకు కూడా తెలీదు.
స్వేచ్చ: నువ్వు వీళ్ళు ఎప్పుడు project work మీద ఎక్కడికి వెళ్ళినా నువ్వు కూడా వెళతావు కదా, మరి నీకు తెలియకపోవటం ఏమిటి?
మోహిని: నిజం, నాకు collegeలో final practical exam ఉండడంతో నేను ఒక రోజు లేటుగా ఇక్కడికి వచ్చాను. నేను వీళ్ళు ఉండే hotelకి వేళ్ళేసరికి అన్నయ్య నాకు ఫొన్ చేసి ఇక్కడకు రమ్మని ఫొన్ పెట్టేసాడు. నాకు ఏమి చెయ్యాలో తెలీక వెంటనే ఇక్కడకు వచ్చేప్పటికి అన్నయ్యను అప్పుడే ICUకి shift చేసారంట. ఒక అర గంటలో అన్నయ్యకు స్ప్రుహ వస్తుంది, అప్పటివరకూ ఏమి జరిగింది అన్నది తెలియదు.
స్వేచ్చ: మరి అక్క?
మోహిని: విరాకి తలమీద గట్టిగా దెబ్బ తగలడంతో operation చేస్తున్నారంట. ఇంకొక రెండు గంటల్లో operation పూర్తవుతుంది అన్నారు doctorలు.


(వీరూకి స్ప్రుహ వచ్చేలోపు స్వేచ్చకు వీరూ ఎలా తెలుసో ఒకసారి చూసొద్దాం.)
స్వేచ్చ విరాకి సొంత చెల్లెలు. స్వేచ్చ తన చదువు పూర్తిచేసుకుని Campus selectionలో తన అక్క పనిచేసే companyలో job సంపాదిస్తుంది. స్వేచ్చ jobలో join అవడానికి ఇంకా ఒక నెల సమయం ఉండడంతో విరా దగ్గరకు వస్తుంది. విరా స్వేచ్చకు తను ఒకరిని ప్రేమిస్తున్నట్టు ముందే చెబుతుంది. అందుకే స్వేచ్చ విరా దగ్గర ఉండడానికి వస్తుంది, అతను ఎవరో, ఏమిటో తెలుసుకుందాం అని.


అలా వచ్చిన స్వేచ్చ మోహినితో కలిసి సిటీ మొత్తం చూసి సాయంత్రం విరా, వీరూల కామన్ మీటింగ్ పాయింట్‌కు చేరుకుంటారు. అప్పుడే స్వేచ్చ రోడ్‌మీద దెబ్బతగిలి పడిఉన్న కుక్కపిల్లను పక్కకు తీసుకురాడనికి అని కూర్చుని, కుక్కపిల్లను ఎత్తుకుని లెగిసే సమయంలో అటుగా వేగంగా వస్తున్న ఆటో స్వేచ్చను ఢీ కొట్టే సమయానికి అప్పుడే వచ్చిన వీరూ స్వేచ్చని ప్రక్కకులాగి;
వీరూ: నీకు కొంచెం అన్నా జ్ఞానం ఉందా, కొంచెం ఉంటే ఆ కుక్క ప్లేస్‌లో నువ్వు ఉండే దానివి. అని ఒక్కటి కొట్టబోతాడు; సరిగా అదే సమయానికి మోహినితో కలిసి రెస్టారెంట్ బయటకు వచ్చిన విరా వీరూని ఆపి.

విరా: స్వేచ్చ నీకు ఏమి కాలేదు కదా! ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది, కొంచెమ్‌లో ఎంత ప్రమాదం తప్పింది.
అని చెప్పి వీరూని కౌగిలించుకుని;
విరా: వీరూ, తిను నా చెల్లి స్వేచ్చ. స్వేచ్చను పరిచయం చేయడానికే నిన్ను ఇక్కడకు రమ్మన్నది.
వీరూ: Sorry స్వేచ్చ! మూగజీవి ప్రాణం గురించి ఆలోచించి, నీ ప్రాణం గురించి ఆలోచించకపోయేప్పటికి కొంచెం serious అయ్యాను.
స్వేచ్చ: అయితే మీరేనా మా అక్కను మాయ చేసింది (అని నవ్వుతూ అడుగుతుంది).
విరా: వీరూ, స్వేచ్చకు కూడా మన companyలోనే job వచ్చింది. త్వరలో మన officeలో work చెయ్యడానికి ఇక్కడికి రాబోతుంది.

వీరూ: ముందుగా congratulations స్వేచ్చ. నేను కాదు మీ అక్కను మాయ చేసింది, మీ అక్కే నన్ను మాయ చేసింది.

ఇలా కలుసుకున్న తరువాత, కొన్ని రోజులు వీరూని పూర్తిగా observe చేసి విరాతో, అక్కా బావ నాకు బాగా నచ్చాడు. అమ్మ, నాన్నల గురించి ఆలోచించకు, వాళ్ళతో నేను మాట్లాడి ఒప్పిస్తా. అలా చెప్పి స్వేచ్చ ఇంటికి వెళ్ళిన కొన్నిరోజులకే ఇలా జరుగుతుంది.


(ప్రస్తుతం, ఇక్కడ అంటే గోవాలో లో ఉన్న వీరూకి స్ప్రుహ వస్తుంది)
వీరూకి స్ప్రుహ వచ్చింది అని ఒక నర్సు వచ్చి మోహినికి చెబితే; మోహిని, స్వేచ్చ వెళ్ళి చూస్తారు. అప్పటికే వీరూ అక్కడ ఉన్న డాక్టర్‌తో గొడవ పడుతుంటాడు, విరాను చూడడానికి వెళ్ళనివ్వమని.
అది చూసిన మోహిని వెంటనే వెళ్ళి వీరూని కౌగిలించుకుని, అన్నయ్యా అంటూ!

మోహిని: (ఏడుస్తూ) అసలు ఏమయ్యింది అన్నయ్యా? అక్కకు తలకు ఎందుకు దెబ్బ తగిలింది?
వీరూ: (tensionతో) ఇప్పుడు విరాకు ఎలా ఉంది? నేను చూడాలి.
మోహిని,స్వేచ్చ: (ఇద్దరూ ఒకేసారి) అన్నయ్యా, బావా; అక్కకు operation జరుగుతుంది, మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఒక గంటన్నరలో operation పూర్తవతుంది, ఈ లోపు మీరు కొంచెం rest తీసుకోండి. operation అవ్వగానే మేమే అక్కదగ్గరకు తీసుకునివెళ్తాము.
అని చెప్పి కొంచె స్తిమితపరుస్తారు వీరూని. వీరూ కొంచెం స్తిమిత పడ్డాక అసలు ఏమి జరిగిందో చెప్పటం మొదలుపెడుతాడు.


వీరూ: మేము ఇక్కడికి వచ్చిన రెండో రోజు మధ్యాహ్నానికే project okay అవ్వడంతో విరా బీచ్‌కు వెళదాం అంటే, సరే అని బయలుదేరాం. దారిలో ఉండగా ఇష్క్ సినిమాలో చూపించిన ప్లేస్‌కి వెళదాం అని విరా అడగ్గానే cab driverని అక్కడకు తీస్కెళ్ళమని చెప్పి అక్కడకు వెళ్ళాం.
వీరూ: అలా వెళ్ళిన మేము బీచ్ ఒడ్డున ఒకరి చేతిలో ఒకరి చెయ్యి వేసుకుని కూర్చుని పెళ్ళిగురించి ఎలా ఇంటిలో ఒప్పించాలి అని అలోచిస్తున్నాం.

 [Image: couple-lovers-sitting-together-beach_149066-2092.jpg]

ఇలా ఆలోచిస్తుండగా మా దగ్గరకు ఒక ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు. ముగ్గురూ కూడా తాగి ఉన్నారు, అలాగే వాళ్ళ చేతిలో బీర్ బాటిళ్ళు ఉన్నాయి...




గమనిక:
ఇక అప్డేట్ ఇక్కడితో ముగిస్తున్నా. తరువాత ఏమి జరిగిందో ఇక్కడ చెబితే ఈ అప్డేట్ బాగా పెద్దగా ఉంటాది, తరువాతి అప్డేట్ బాగా చిన్నది అయిపోతుంది అందుకే ఇక్కడితో ఆపేస్తున్నాను. గమనించగలరని మనవి.



నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, రెప్యుటేషన్ పాసిటివ్ ఇవ్వండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి, దాని ద్వారా నేను ఎక్కడ తప్పు చేసానో తెలుస్తుంది.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ+పగ=జీవితం - by Joncena - 02-11-2020, 03:40 PM



Users browsing this thread: 2 Guest(s)