01-11-2020, 06:00 AM
(05-08-2019, 04:42 PM)dippadu Wrote: అద్భుతముగా ఉంది మిత్రమ.
రెండు విషయములు నాకు వింతగా అనిపిస్తాయి కృష్ణావతారములో.
1) కృష్ణుడినే నమ్ముకున్న రాధకి అతడు మథురకని బయల్దేరాక మరలా కనపడలేదు.
2) యుద్ధం మొదట్లో కృష్ణుడు అంత సేపు భగవద్గీత చెప్పినా అన్నీ మర్చిపోయిన అర్జునుడు, అభిమన్యుడు చనిపోగానే తన కొడుకుని చంపిన జయద్రథుడిని మర్నాడు సూర్యాస్తమయం లోపు చంపడమో లేక తాను ఆత్మహత్య చేసుకోవడమో తథ్యం అని ఆవేశపడ్డాడు. నేరుగా విన్న అర్జునుడి మీదే భగవద్గీత ప్రభావం అంత తక్కువ సేపు ఉంటే ఇంక జనసామాన్యం సంగతి వేరే చెప్పాలా అనిపిస్తుంటుంది మిత్రమ.
ఇక్కడ నేను అర్థo చేసుకున్న విషయం : (1) కృష్ణుడు రాధతో ఉన్న సంబంధం ఒక బాల చేష్ట. అందుకే
తరువాత కొనసాగించ లేదు
ఎదిగిన తరువాత ఆ పని చేస్తే సమాజానికి ఒక బాడ్ ఎక్సాంపుల్ గా మిగిలిపోయేది
(2) ఎవరైనా ఎక్కువ ఎమోషనుకు లోనైతే , అది కోపమైనా దుఃఖమైనా, మన వివేకాన్ని, జ్ఞానాన్ని కప్పి వేస్తుంది - అది కృష్నుడైనా , అర్జునుడైనా లేక మనమైనా అంతే