Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రేమ+పగ=జీవితం (కథ సమాప్తం.) & Closed
#18
Update-2:
గమనిక: ఇక నుండి వీరేంద్ర పేరు వీరు అని, విరాజిత పేరు విరా అని కథలో వ్రాయబడుతుంది. గమనించగలరని మనవి. ఆ పేర్లు టైప్ చెసేప్పుడు తప్పులు వచ్చేస్తున్నయి. అందుకే అలా మారుస్తున్నాను.

వీరు, విరా అలాగే మోహిని కలిసి ఎంతో ఆనందంగా ఉంటుండగా, అనుకోకుండా ఒకరోజు విరాజిత పిన్ని కూతురు అయిన పూజిత వీరు, విరా వాళ్ళ ఆఫీసులో కొత్తగా జాయిన్ అవుతుంది. వచ్చిన రోజే వీరుని చూసి ఇష్టపడుతుంది, అదే విషయం వీరుతో ఒక వారం తరువాత చెబుతుంది. అనుకోకుండా వీరు ఒక్కడే cafeteriaలో ఉంటే వెళ్ళి కలిసి చెబుతుంది.
పూజ: వీరేంద్ర, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడగానే ఎందుకో తెలియదుగాని నచ్చేసావు. ఇప్పటి వరకూ నాకు అందరూ ప్రపోస్ చేసేవాళ్ళు, కాని ఇప్పుడు నేను నా లైఫ్‌లో మొదటిసారిగా నీకే ప్రపోస్ చేస్తున్నాను.
వీరు: పూజిత, నేను 2 years నుండీ ఒకరిని ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తుంది. ఇద్దరం త్వరలో పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం.
పూజిత: నువ్వు ఒక అందగత్తెను మిస్‌చేసుకుంటున్నావు. (కొంచెం సీరియస్‌గా)
తను నా కంటే అందంగా ఉంటాదా? (కొంచెం బాధగా)
వీరు: తను నీ అంత అందంగా ఉండదు కాని అందంగా ఉంటాది.
పూజిత: అర్ధం కాలేదు (confusion lookతో )
వీరు: తను చూడడానికి అందంగా నీలాగ ఉండకపోవచ్చు, కానీ మనసు పరంగా మాత్రం నీ కంటే చాలా రెట్లు అందంగా ఉంటుంది.
పూజిత: సోరీ వీరేంద్ర. నాకు కొంచెం పొగరు అని అందరూ అంటే, నాకు పొగరు ఏమిటి అనుకునేదాన్ని కానీ ఇన్ని రోజులు ఎంత పొగరుగా అందరితో బిహేవ్‌చేసానో తలుచుకుంటే బాధగా ఉంది. 
(పూజిత స్వతహాగా మంచిదే, కాని తన తల్లి తనని అలా పెంచింది. తన తల్లిని కొంచెం డబ్బులు ఉన్న వ్యక్తిని పెళ్ళి చేసుకునే సరికి కొంచెం డబ్బులు ఉన్నాయన్న గర్వం పెరిగి తోడబుట్టినవాళ్ళను కూడా సరిగ దగ్గరకు రానిచ్చేది కాదు. పూజితకి పూర్తిగా గర్వం, పొగరు లేవు కానీ, అప్పుడప్పుడూ అలా గర్వం ప్రదర్సిస్తుంటుంది అంతే..  సోది ఎక్కువ అవుతున్నట్టుంది, ఇక కథలోకి వెళదాం.)
పూజిత అలా అనేసరికి, పూజితతో

వీరు: పూజిత, నువ్వు స్వతహాగ మంచిదానివే అది నేను నువ్వు జాయిన్ అయిన రోజే గమనించా. కానీ ఎవరన్నా నువ్వు చెప్పినదానికి 'నో' అనిగాని, 'కాదు' అనిగాని చెబితే సహించలేవు. అప్పుడే నీలో దాగి ఉన్న పొగరు, గర్వం బయటకు వచ్చేస్తాయి.
పూజిత: ...ఏదో చెబుదాం అనుకుంటుంటే మద్యలో వీరు ఆపి తను చెప్పాలనుకున్నది చెబుతాడు.
వీరు: పూజిత నేను నిన్ను ప్రేమించలేను, కానీ నీతో స్నేహం చేస్తా, ఒక friend లా ఉంటా. ఎందుకంటే అది ఇప్పుడు చెప్పలేను, తరువాత సమయం వచ్చినప్పుడు చెబుతా. అంతవరకూ నన్ను ఏమీ అడగకు, నీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఫీల్ అవ్వకుండా అడుగు.
"Please don't bring this incident in future. this will ruin our friendship. Be my best friend forever" అని చెప్పి

వీరు:  " వెళదాం పద, ఇప్పటికే చాలా సమయం అయ్యింది మన work break time అయ్యి". తొందరగా వెళ్ళాలీ, లేదంటే టీంలీడ్, మేనేజర్, HR jobs పోతాయి.
పూజిత: వాళ్ళ jobs ఎందుకు పోతాయి? ( confusion lookతో)
వీరు: కొత్తగా వచ్చిన నీతో నేను project work చేయించకుండా cafeteriaలో ఉంటే CCTVలో చూసిన CEO HRని అడుగుతారు, HR మేనేజర్‌ని అడుగుతారు, మేనేజర్ టీంలీడ్‌ని అడుగుతారు, టీంలీడ్‌కి చెప్పటానికి సమాధానం లేదు. సో ముగ్గురి jobs పోతాయి. నా వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు, ఒకరికి నష్టం జరగకూడదు.
ఫూజిత: నిజంగా పోతాయా? (చిన్నపిల్లలా అడుగుతుంది)
వీరు: జోక్ చేసా. పద అసలే చాలా సమయం అయింది వచ్చి. ఒక కప్పు కాఫీ తాగి గంట కూర్చున్నాడు అనుకుంటాడు బిల్లింగ్ కౌంటర్లో ఉన్న అతను (అని నవ్వుతూ చెబుతాడు.)


పూజిత  విరాకి చెల్లెలు అవుతుంది అని వీరుకి విరా కొన్నిరోజుల ముందే చెబుతుంది, అలాగే పూజిత ఆఫీస్‌లో జాయిన్ అయిన రోజు విరా వీరూతో
విరా: వీరూ పూజితతో మన విషయం చెప్పకు, తనకు తెలిస్తే ఇంటిలో వాళ్ళ అమ్మ గోల గోల చేస్తాది అలాగే మన పెళ్ళి కూడా సజావుగా జరగనివ్వదు.
వీరు: నాకు అర్ధం అయ్యింది, నువ్వు ఏ మాత్రం కంగారు పడకు.
విరా: ఇంకొక విషయం, మనం ఆఫీస్‌లో తక్కువగా మాట్లాడుకుందాం, దానికి తెలిస్తే అదొక తలకాయనొప్పి. అంతగా ఎమన్నా ఉంటే మన casual spotకి వచ్చేయ్.
వీరు: సరే.
పూజిత వీరూకి ప్రపోస్ చేసే కొన్ని నిమిషాల ముందు

విరా: వీరూ పూజిత నిన్ను చూసే చూపులో ఏదో తేడా ఉంది. నాకు ఎందుకో అది నిన్ను ఇష్ట పడుతుంది అని నా ఫీలింగ్.
వీరు: (జోవియల్‌గా) తను ప్రపోస్ చేస్తే ఓకే చెప్పేస్తా, ఎలాగోలా తనని ఒప్పించి ముగ్గురం పెళ్ళి చేసుకుందాం. ఒకేనా?
విరా: అలా అయితే నీ కోసం తనని నీకు ఇచ్చేసి నేను నీ కౌగిలిలో నా శ్వాస వదిలేస్తా. (unconditional love వల్ల అలా అంటూ ఏడుస్తుంది)
వీరు: పిచ్చిదానా, నువ్వు లేక పోతే నేను ఉంటానా. నువ్వు లేవన్న మరుక్షణం నా శ్వాస అగిపోతాది గుర్తుంచుకో. నేను ఏదో సరదాకి అంటే ఇలా అంటావా. నా గురించి నీకు తెలియదా?
విరా: తెలుసు, కానీ ఎందుకో నువ్వు తనని ఇష్టపడతున్నావేమో అని అనిపించి అలా అన్నా. నీకు నచ్చింది నేను ఎప్పుడన్నా వద్దనలేదు కదా.

పూజిత మంచిగా మారడం జరిగిన కొన్ని నెలలకు వీరూ, విరా ఒక project పని మీద గోవా వెళతారు. ఎప్పుడు వీళ్ళు ఇద్దరూ వేరే placeకి project పని మీద వెళ్ళినా మోహిని కూడా వాళ్ళతో వెళుతుంది. కానీ, ఈ సారి ఒకరోజు తరువాత వేళుతుంది. తను అక్కడకు చేరే సరికి జరగరానిది ఒక సంఘటన జరుగుతుంది.
ఆ సంఘటన వీళ్ళ జీవితాన్ని ఎలా మార్చింది అన్నది తరువాతి ఎపిసోడ్‌లో చూద్దాం.


నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, రెప్యుటేషన్ పాసిటివ్ ఇవ్వండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి, దాని ద్వారా నేను ఎక్కడ తప్పు చేసానో తెలుస్తుంది.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ+పగ=జీవితం - by Joncena - 30-10-2020, 08:29 PM



Users browsing this thread: 1 Guest(s)