Thread Rating:
  • 3 Vote(s) - 4.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రేమ+పగ=జీవితం (కథ సమాప్తం.) & Closed
#1
Heart 
xossipy సైట్‌లోని మిత్రులందరికి నా అభివందనాలు. ఇది నేను రాస్తున్న మొట్టమొదటి కథ. నాకు కొన్ని రోజులకు ముందు వచ్చిన కలను ఆధారంగా చేసుకుని రాస్తున్న కథ.
అక్కడక్కడ ఏమన్నా లాజిక్‌లు మిస్ అయితే మన్నించగలరు.

Update-1:
ముందుగా కథలోని పాత్రల పేర్లు చూద్దాం.
వీరేంద్ర - మన హీరో (ముద్దుగా వీరు అని పిలుస్తారు)
విరాజిత - మన హీరోయిన్ 
మోహిని - విరాజిత మరదలు (విరాజితకంటే 4 సంవత్సరాలు చిన్నది)
పూజిత - విరాజిత సొంత పిన్ని కూతురు (విరాజిత కంటే కొంచెం అందంగా ఉంటుందని కొంచెం పొగరు ఎక్కువ)

మిగతా పేర్లు మరియూ పాత్రలు సందర్భాన్ని, సమయాన్ని బట్టి వస్తాయి.


ఇక కథలోకి వస్తే మన హీరో, హీరోయిన్ హైదరాబాద్‌లోని ఒక software companyలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇద్దరూ ఒక రెండు సంవత్సరాలుగా కొన్ని projects మీద ఒకే Teamలో కలిసి పని చేస్తూ ఉంటారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. మొదటిసారి కలిసి పనిచేసేప్పుడు teamలో ఒకడు చేసిన పనికి వీళ్ళిద్దర్ని team leader తిడతాడు , దాని గురించి ఇద్దరికి కొంచెం serious discussion జరిగి ఇద్దరూ resignation దాకా వెళ్తారు. Team leaderకు తరువాత తెలుస్తుంది, ఆ తప్పు చేసింది వీళ్ళిద్దరూ కాదని. వెంటనే వీళ్ళిద్దరిని పిలిపించి అసలు విషయం చెప్తాడు, కాని అప్పటికే వాళ్ళు HRలను కలిసి resign చేస్తున్నాం అని చెప్తారు. 

ఇద్దరూ ఎందుకు resign చెయ్యాలి అనుకుంటారంటే, మన వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు కాని చెడు జరగకూడదు అని ఎప్పుడూ అనుకుంటారు. అలాంటిది వాళ్ళవల్ల అవతలివారు జాబ్ పోతాదేమో అని ఒకరికి తెలియకుండా ఒకరు resign చెయ్యడానికి వెళ్తారు. వాళ్ళు ఎప్పుడైతే వేరు వేరు HRలను కలసి  విషయం చెప్తారో అదే సమయానికి వాళ్ళ team leader వీళ్ళని పిలుస్తాడు. వీళ్ళు తమ team lead దగ్గరకు వెళ్ళేప్పటికి HRలు తనకు జరిగిన విషయం చెప్తారు. వీళ్ళు వచ్చాకా ఇద్దరినీ  అడుగుతాడు, ఇద్దరూ ఎందుకు resign చెయ్యలని అనుకున్నారు అని. అప్పుడు ఇద్దరూ ఒకేసారి "నా వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు కాని చెడు జరకూడదు అని" అందుకే నేను resign చెయ్యాలి అనుకున్నాను అని. అది విని team lead ఎంతో సంతోషానికి లోనవుతాడు, ఎందుకంటే తను కూడా అలగే ఆలోచిస్తాడు కాబట్టి. తనని తన స్నేహితులందరూ తిట్టేవారు, ఇంకా పాతకాలంలోలాగ వాడికి మంచి జరగాలి అని అలోచిస్తుంటాడని. 

ఈ సంఘటన జరిగిన రోజు సాయంత్రం ఇద్దరూ లో కలుసుకుని మాట్లాడుకుంటు ఉంటారు. అప్పుడే ఇద్దరి అలోచనలు ఒకలాగే ఉన్నయని, ఇద్దరూ friends అవుతారు. అలా వాళ్ళ స్నేహం కాస్త కొన్ని నెలల్లోనే ప్రేమగా మారుతుంది. కానీ ఒకరికి ఒకరు చెప్పుకోలేరు. ఇలా ఒక రెండు సంవ్త్సరాలు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నట్టు చెప్పుకోకుండా అలా కాలం వెళ్ళదీస్తారు. అప్పుడే మోహిని విరాజిత దగ్గర ఉండడానికి వస్తుంది, తను అక్కడే ఉండి తన మాస్టర్ డిగ్రీ పూర్తి చెయ్యాలని అనుకుంటుంది. చిన్నప్పటినుండి ఏ చిన్న విషయమైనా చెప్పే విరాజిత కొన్ని నెలలుగా తనతో సరిగా మాట్లాడడంలేదు అలాగే ఏ విషయం చెప్పటంలేదు, పైగా కొంచెం తను వచ్చినందుకు ఇబ్బందిపడుతున్నట్టుగా అనిపిస్తుంది మోహినికి.

అదే విషయం గట్టిగా అడగ్గా విరాజిత ఆఫీస్‌లో మొదటి నెలలో జరిగిన incident నుంచి ఇప్పటివరకూ జరిగినందా చెబుతుంది. అలాగే తని వీరేంద్రని ప్రేమిస్తున్నానని, ఆ విషయం తనకి ఎలా చెప్పాలో తెలియటంలేదు అని, చెబితే ఇప్పటివరకు ఉన్న స్నేహం కూడా పోతుంది అని ఫీల్ అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెబుతుంది, తను ఎందుకు వీరేంద్రని అంతగా ప్రెమిస్తోందో. ఎందుకంటే విరాజిత తండ్రి తను ఇంటర్ చదువుతున్నప్పుడు చనిపోయారు, తన తల్లి ఆ లోటు లేకుండా పెంచింది. కానీ తనకి తండ్రి చూపించే ప్రేమ వీరేంద్ర తన దగ్గర ఉన్నప్పుడు కలుగుతుంది అని చెబుతుంది. 



విరాజిత ఈ విషయాలన్నీ తన దగ్గర దాచినందుకు ముందు బాధ పడినా, తరువాత చాలా సంతోషిస్తుంది. అలగే ముందు వీరేంద్రని చూడాలని మోహిని చెబుతుంది. విరాజిత సరే అని మోహినితో కలసి దగ్గరలో ఉన్న ఒక restaurantకు తీసుకెళ్తుంది, అది వాళ్ళ ఇద్దరికి కామన్ మీటింగ్ పాయింట్ అలాగే వాళ్ళు ఇద్దరూ ఆఫీస్లో కాకుండా ఒక చోట కలవాలంటే ఇదే వాళ్ళు ఇద్దరూ ఉండే ఏరియాలకు మద్యలో ఉంటుంది అందుకని అక్కడ కలుస్తారు. విరాజిత, మోహిని అక్కడకు వెళ్ళాక విరాజిత వీరెంద్రకు ఫోన్ చేసి వాళ్ళ కామన్ పాయింట్ ప్లేస్‌కు రమ్మటే  వస్తాడు. అక్కడ వీరెంద్ర వచ్చేలోపు మోహిని విరాజితని మొహాన్ని మొత్తం తో కవర్ చేసుకోమని తన వెనుక టేబుల్‌లో కూర్చోమని చెప్పి, వీరెంద్ర వచ్చినప్పుడు తనకు చూపించి అవతలవైపుకు తిరిగిపొమ్మని చెబుతుంది.

వీరెంద్ర ఆ ప్లేసుకు రాగానే సంతోషం సినిమాలో శ్రియలాగ వీరెంద్రకు ప్రపోస్ చేస్తాది. అప్పుడు వీరెంద్ర తను ఒకరిని ఇష్టపడుతున్నట్టు చెబితే పేరు అడుగుతుంది మోహిని. వీరెంద్ర పేరు చెప్పేలోపు ఇదంతా వింటున్న విరాజిత చాలా కుమిలిపోతుంది, కానీ ఎప్పుడు అయితే తన పేరు చెబుతాడో అప్పుడు విరాజిత ఆనందానికి అవదులు లేకుండా పోతాయి.
అప్పుడే మోహిని మీరు చెప్పిన మనిషి ఈమేనా అని విరజితని వీళ్ళ టేబుల్ దగ్గరకు లాగుతుంది. వీరెంద్ర, విరాజిత ఇద్దరూ ఒక్కసారిగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ లోకాన్ని మర్చిపోయి వాళ్ళ ప్రేమలో మునిగిపోతారు. అప్పుడు, మోహిని వాళ్ళని కదిపి మీ ప్రేమ కాసేపు ఆపితే ఏమన్నా తిందాం అంటాది. అప్పుడు అందరూ నవ్వుకుంటూ ఉండగా,

వీరెంద్ర: విరాజిత, ఈమె ఎవరు ఇంతకీ? నీకు ముందే తెలుసా అని అడుగుతాడు.
విరాజిత: ఈమే పేరు మోహిని, నా కసిన్ వరసకు మరదలు అవుతుంది. నా కంటే 4 సంవత్స్రాలు చిన్నది. ఇక్కడ నాతో ఉండి తన మాస్టర్స్ పూర్తి చేస్తానని వచ్చింది.
వీరేంద్ర: అయితే నాకు చెల్లెలు అవుతుంది. మోహిని నేను నిన్ను చెల్లెమ్మా అని పిలవచ్చా?
మోహిని: చెల్లెమ్మా! ఎంత బాగుంది పిలుపు. అలగే అన్నయ్యా. (మోహినికి అన్నయ్యలు ఎవరూ ఉండరు. తనకు కూడా ఒక అన్నయ్య ఉంటే ఎంత బాగుండును అని ఎప్పుడూ బాధ పడుతుంది.)
మోహిని రాక ముందు ఎప్పుడోగాని ఒకసారి (2 లెద 4 నెలలకు ఒకసారి) ఇద్దరూ కలసి సరదగా గడపడానికి వెళ్ళేవారు కాదు. వెళ్ళినా తప్పనిసరిగా వీళ్ళ కూడా వీళ్ళతోపాటు వెళ్ళేవాడు. ఇప్పుడు మొహిని వచ్చాక ముగ్గురూ(వీరెంద్ర, విరాజిత అలగే మోహిని) నెలకు ఒకటి లేదా రెండీ సార్లు సిటీ అవుట్ స్కట్స్‌కి వెళ్ళడం మొదలెట్టారు.

ఇలా సంతోషంగా ఉంటుండగా ఒక వ్యక్తి ఎంటర్ అయ్యారు. వాళ్ళు వచ్చాక ఏమి జరిగిందో తరువాత updateలో తెలుసుకుందాం.


గమనిక: కథ మొదటి అప్డేట్‌లో వేరే పార్ట్ ఇద్దాం అనుకున్నా కాని అది ఇచ్చెముందు కొంచెం హీరో హీరోయిన్ introduction ఇద్దామని ఇది ఇచ్చా.
కథ బోర్ కొడితే మన్నించండి. ఇది నాకు వచ్చిన కలను ఒక కథగా మార్చాలని కొన్ని రోజులుగా ప్రయత్నిస్తూ ఈ రోజు మొదలుపెట్టాను.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ప్రేమ+పగ=జీవితం (కథ సమాప్తం.) & Closed - by Joncena - 29-10-2020, 01:44 PM



Users browsing this thread: 2 Guest(s)