Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నెరజాణల కథలు
#3
నెరజాణల కథలు 02

అరెజో నగరంలో తొఫానో అనే ధనికుడికి మోన్నా అనే అందమైన భార్య వుంది. భార్యంటే అమితమైన యిష్టం వున్నా అతన్ని అసూయ అనే జబ్బు ఆవహించింది. ఆమె ఎవరి కేసి చూసినా, ఎవరితో మాట్లాడినా, చిరునవ్వు నవ్వినా సందేహించేవాడు. వాడితో పడుక్కుంటున్నావంటూ అసహ్యంగా ఆరోపణలు చేసి గోల చేసేవాడు. నిజానికి ఆమె సౌశీల్యవతి. ఇతని వరస చూసిచూసి ఆమెకు చిర్రెత్తిపోయింది. ఆ అనుమానాలు నిజం చేయాలనే పట్టుదల పెరిగింది. అటూయిటూ చూపులు సారించింది.

నిజానికి ఆమె యిన్నాళ్లూ పట్టించుకోలేదు కానీ చుట్టుపట్ల యిళ్లలోనే అందమైన యువకులు, ఆమె అంటే పడిచచ్చేవాళ్లు చాలామందే వున్నారు. వారిలో ఒకతను ఆమె దృష్టి నాకర్షించాడు. కళ్లతోనే ప్రేమ సందేశాలు పంపడం, అందుకోవడం జరిగాయి. కోర్కెలు తీర్చుకునే ఉపాయం ఆలోచిస్తే చాలు, పని జరిగినట్లే!

తొఫానోకు మద్యం అలవాటుంది. హద్దు మీరి తాగితే సర్వం మర్చిపోయి, దుంగలా పడిపోతాడు. చుట్టూ ఏం జరుగుతోందో ఏమీ తెలియదు. ఇన్నాళ్లూ ఆ అలవాటును ఆమె నిరసిస్తూ వచ్చినా యిప్పుడు అది తనకు పనికి వస్తుందని గ్రహించి, అతని తాగుడు అలవాటును ప్రోత్సహించసాగింది.  రాత్రి యింటికి రాగానే దగ్గరుండి అనుపానాలు సైతం అందిస్తూ అతను మత్తెక్కి పడిపోయేట్లా చేసింది. అతను యింట్లో వున్నా లేనట్టే లెక్క కాబట్టి తన ప్రియుణ్ని తన పడకగదికే రప్పించుకుని సుఖించసాగింది. పోనుపోను ఆమె ధైర్యం ఎంత పెరిగిందంటే మొగుణ్ని యింట్లో పెట్టేసి తనే ప్రియుడి యింటికి వెళ్లి వచ్చేసేది.

కొన్నాళ్లకు తొఫానోకు ఒక విషయం తట్టింది - మద్యం విషయంలో భార్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనను విపరీతంగా తాగిస్తోంది కానీ తను మాత్రం చుక్క తీసుకోవడం లేదు. అసలే అనుమానస్వభావం, దానికి తోడు యిప్పుడే సందేహం కొత్తగా చేరింది. సంగతేమిటో కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఒక రోజు దుకాణం నుంచే తప్పతాగి వచ్చినట్లు నటిస్తూ యింటికి రాగానే కుప్పకూలిపోయాడు. ఇతనికి యింకా తాగిస్తే ప్రమాదం అనుకుని మోన్నా వూరుకుంది. అతనికి నిద్ర పట్టిన కాస్సేపటికి తన ప్రియుడి యింటికి బయలు దేరింది.

ఆమె వెళ్లిన తర్వాత యితనికి మెలకువ వచ్చింది. పక్కన చూస్తే భార్య లేదు. వీధి తలుపు దగ్గర వేసి వుంది. అంటే ఆమె ప్రియుడు యింటికి వెళ్లిందన్నమాట అనుకుని తలుపు లోపల్నుంచి గడియ వేసుకుని కాచుకున్నాడు. ఇంకో గంటకు ఆమె వచ్చి తలుపు నెట్టితే తెరుచుకోలేదు. పెరటి తలుపూ మూసేసి వుంది. మొగుడు కిటికీ తలుపు తెరిచి ''కాస్సేపటిలో తెల్లవారబోతోంది. ఇప్పటిదాకా ఎవడితో కులికావో వాడి దగ్గరకే పో. తెల్లవారగానే అందర్నీ పిలిచి పంచాయితీ పెట్టి నీ బండారం బయటపెడతాను.'' అన్నాడు.

ఆమె బతిమాలుతూ ''ఒక్కసారి తలుపు తీసి లోపలకి రానిస్తే విషయమంతా బోధపడేట్లు చెప్తాను. 'మా ఆయన వూళ్లో లేడు, ఒంటరిగా వుండడానికి భయంగా వుంది' అని పక్క వీధిలో ఆవిడ బతిమాలితే వెళ్లి కాసేపు కూర్చుని వస్తున్నాను. వెంటనే వచ్చేద్దామని తలుపు దగ్గరేసి వెళ్లాను. ఆవిడ బెదురు తీరేవరకు వుండడంతో కాస్త ఆలస్యమైంది. ఈ మాత్రానికే మీరు ఏదేదో వూహించేసుకుంటే ఎలా?'' అని వాపోయింది.

కానీ మొగుడు ఆమె మాటలు నమ్మలేదు. నువ్వు రంకులాడివి, బొంకులాడివి అన్నాడు. ఇక ఆమెకు విసుగెత్తి పోయింది. ''నీ అనుమాన ప్రవృత్తితో నా ప్రాణాలు తోడేస్తున్నావు. ఇలా బతకడం వృథా. పెరట్లోని బావిలో పడి ఛస్తాను. పొద్దున్న నా శవం బయటకు తేలాక తాగిన మత్తులో నువ్వే నన్ను తోసేశారని జనమంతా అనుకుంటారు. ఊళ్లో వుంటే ఉరి ఖాయం. అందువలన ఉన్నదంతా వదిలేసి శంకరగిరి మాన్యాలు పట్టి పోవాలి. ఆలోచించుకో.'' అంది.

ఇలాటి బెదిరింపులకు లొంగితే మరీ లోకువై పోతాననుకున్న భర్త ఏం చేసుకుంటావో చేసుకో పో అన్నాడు. ఇక ఆమె కాస్సేపాగి, పెరట్లోకి వెళ్లి  చీకట్లోనే ఒక పెద్ద బండరాయి వెతికి, ఎత్తి నూతిలో దభాలున పడేసింది. ఆ శబ్దం వింటూనే భర్త భయపడిపోయాడు. ఆవేశంలో అన్నంత పనీ చేసిందేమో, తనకు ఉరి తప్పదేమోనన్న కంగారులో తలుపు తీసి పెరట్లోకి పరిగెట్టాడు. గుమ్మం పక్కనే దాక్కున్న భార్య వెంఠనే యింట్లోకి చొరబడిపోయి వీధి తలుపు మూసేసింది.

జరిగిన మోసం గ్రహించిన భర్త నూతి దగ్గర్నుంచి గుమ్మం దగ్గరకు పరిగెట్టుకుని వచ్చి తలుపు తట్టి ''తెరు'' అని అరిచాడు.

అప్పటిదాకా భర్తతో గుసగుసలాడుతూ మాట్లాడిన మోన్నా హఠాత్తుగా బిగ్గరగా అరవసాగింది - ''తాగి యింటికి వచ్చే వేళ యిదా? సంసారం చేసే లక్షణమేనా యిది? చూసిచూసి విసుగెత్తిపోయాను. నీ సంగతి వూళ్లో అందరికీ తెలిసి రావాలి. ఇంటి దగ్గర నీ కోసం ఎదురుచూస్తూ నేను కూర్చోవడం, నువ్వు స్నేహితులతో కలిసి తాగితందనాలాడి తెల్లవారేవేళకి కొంప చేరడం? చూస్తాను ఎవరు వచ్చి నీ పక్షాన మాట్లాడతారో..'' అంటూ.

ఆమె కేకలకు యిరుగుపొరుగు లేచి వచ్చారు. మొగుడు బయట నిలబడి వుండడం చూసి అందరూ భార్య మాటల్నే నమ్మారు. 'అబ్బే, ఆమె చెప్పేది తప్పు, యిప్పటిదాకా ఎక్కడో తిరిగి వచ్చి గట్టిగా నిలదీస్తే బావిలో దూకుతానంటూ నాటకం ఆడింది' అంటూ అతను చెప్పబోయాడు. 'నేను ఎటువంటిదాన్నో మీ అందరికీ తెలుసు, బహుశా యిప్పటిదాకా తనే ఎవత్తెతోనో మజా ఉడాయించి వచ్చి వుంటాడు. చిత్తుగా తాగే అలవాటున్నవాడికి వ్యభిచారం అలవాటు కావడం ఎంత సేపు! నేను అదెక్కడ బయటపెడతానో అని భయపడి నేనే ఆ పని చేసినట్లు బనాయిస్తున్నాడు..' అంటూ ఆమె మరింత అల్లరి చేసింది.

వచ్చినవాళ్లల్లో స్త్రీలందరూ ఆమె మాటను బలపరచారు. తొఫానో తాగుబోతని అందరూ ధ్రువీకరించారు. తాగుబోతు, తిరుగుబోతు కావడంలో ఆశ్చర్యం లేదన్నారు. మగవాళ్లకు కూడా ఆ మాట నమ్మవచ్చనిపించింది. ఈ గొడవ పెరిగి పెద్దదై మోన్నా అన్నదమ్ముల దాకా వార్త చేరింది. వాళ్లు అక్కడకు చేరి తొఫానోను ఉతికిఉతికి వదిలిపెట్టారు. ''నా భార్యంటే నాకు చాలా యిష్టం. ఏదో కాస్త అనుమానపు బుద్ధి వున్నమాట నిజమే.'' అంటూ అతను మొత్తుకున్నాడు. అప్పుడు ఆమె ఉదారంగా ''ఆ మాట నిజమే, పోనీ వదిలేయండి.'' అని అన్నలకు సిఫార్సు చేసింది.
ఆమె చూపిన ఔదార్యానికి బదులుగా తొఫానో అప్పణ్నుంచి ఆమెను అనుమానించడం మానేశాడు. ఎవరితో ఏం మాట్లాడినా ఏమీ అనుకునేవాడు కాదు. ఆ అలుసు చూసుకుని ఆమె మరింత రెచ్చిపోయింది.
[+] 2 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: నెరజాణల కథలు - by అన్నెపు - 26-10-2020, 10:10 PM
RE: నెరజాణల కథలు - by ram - 27-10-2020, 12:44 PM
RE: నెరజాణల కథలు - by Vakra - 29-10-2020, 12:02 AM
RE: నెరజాణల కథలు - by will - 29-10-2020, 09:06 PM



Users browsing this thread: 3 Guest(s)