Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
చుట్టూ ఎటుచూసినా వొళ్ళంతా రక్తంతో పడిన రౌడీలను చూసి , చెబితే వినాలి మా పెద్దమ్మ - నా ప్రియమైన శ్రీమతిగారు ప్రసాదించిన శక్తి గురించి ముందేచెప్పినా వినలేదు .
నా ప్రక్కనే పెద్దమ్మ ముసిముసినవ్వులు మరియు , బుగ్గపై మృదువైన వెచ్చని పెదాలతో తియ్యని ముద్దు స్పృశించింది .
లవ్ యు పెద్దమ్మా ........... అని తలుచుకుని ఆనందించాను - నా బుజ్జితల్లీ బిస్వాస్ కొద్దిసేపట్లో వచ్చేస్తాను అంతవరకూ పెద్దమ్మ గుండెలపై హాయిగా నిద్రపోండి . 
రక్తంతో ముక్కు ముఖం ఏకం అయిన గోవర్ధన్ గాడి దగ్గరకువెళ్లి నువ్వు ఎంత దుర్మార్గుడివి అయినా మేడం ......... కాదు కాదు ఇక నుండీ నా దేవత అని మళ్ళీ ఒక దెబ్బవేశాను . నా దేవత జీవితంలో సంతోషం చిగురించడానికి నీవలన పోయిన ఆనందాన్ని నీద్వారానే పొందేలా చేస్తాను - ఆ తరువాత నిన్ను నా దేవతే శిక్షిస్తుంది - అంతవరకూ నువ్వు ఉండాలి లేకపోతే ఎప్పుడో చంపేసేవాన్ని అని ఎత్తి టేబుల్ పై బస్తా వేసినట్లు ఎత్తివేశాను . 

చివరి రూంలో నుండి అమ్మాయిల కేకలు ఏడుపులు వినిపించడంతో తాళం పగలగొట్టి తలుపు తెరిచాను - మొత్తం చీకటిగా ఉండటంతో మొబైల్ టార్చ్ వెలుగులో switches చూసి అన్నింటినీ on చేసాను . ముఖాలకు ముసుగు చేతికి కట్లు వేసినట్లు వందకు పైనే అమ్మాయిలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు . 
చెల్లెమ్మలూ చెల్లెమ్మలూ ............. భయపడకండి మీరు సేఫ్ , నేను చెప్పినట్లుగా చేస్తే కొద్దిసేపట్లో మీవాళ్ళతోపాటు ఇంటిలో ఉంటారు . 
కొంతమందిలో సంతోషం మరికొంతమందిలో భయం అలానే ఉన్నట్లు కేకల వలన అర్థమైపోతోంది .
చెల్లెమ్మలూ చెల్లెమ్మలూ ........... మీలో డ్రైవింగ్ ఎవరెవరికివచ్చో వాళ్ళు అడుగు ముందుకువెయ్యండి అన్నాను . వారందరి కట్లను విప్పి ముసుగులు తీసాను . చెల్లెమ్మలూ ........... ఇక్కడ జరిగినది చూసి మీ ఫ్రెండ్స్ భయపడకూడదు - వాళ్ళు చూడకపోవడమే మంచిది - బయట వెహికల్స్ ఉన్నాయి వాటిలో సిటీలోకి ఎంటర్ అవ్వగానే మీకోసం వెతుకుతున్న సెక్యూరిటీ ఆఫీసర్లు మిమ్మల్ని సేఫ్ గా మీ ఇంటికి చేరుస్తారు ముసుగుతోనే పిలుచుకొనిరండి అనిచెప్పాను .
థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ...........
చెల్లెమ్మలూ ............ ముందు మీరు ఇంటికి చేరుకోవాలి మీకోసం మీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు , రండి ఇటువైపు ఒకరొకరు చేతులుపట్టుకుని రండి - అయినా మిమ్మల్ని సేవ్ చేసినది నేను కాదు సెక్యూరిటీ అధికారి గోవర్ధన్ ......... అనిచెప్పాను .
గోడౌన్ మొత్తం రౌడీలు పడి ఉండటం చూసి భయంతో నడుస్తున్నారు . 
చెల్లెమ్మలూ ......... మిమ్మల్ని కిడ్నప్ చేసినది వాళ్లే , ఇప్పుడు ఏమిచేస్తారో మీ ఇష్టం అన్నాను .
అంతే ఫ్రెండ్స్ .......... కింద పడినవాళ్ళు మృగాలు పాదాలకు అడ్డువస్తే తొక్కుకుంటూ నడవండి అనిచెప్పారు డ్రైవింగ్ వచ్చిన అమ్మాయిలు - అందరూ వారిపై ఎక్కి తొక్కుతూ రావడం చూసి అదీ అదీ చెల్లెమ్మలూ ......... కాళ్ళ కింద తొక్కేయ్యండి ఆ నాకొడుకులని అని సంతోషంతో గట్టిగా విజిల్ వేసాను . 
బయటకు పిలుచుకునివచ్చి ఉన్న అన్నీ వెహికళ్లలో అందరినీ ఎక్కించి జాగ్రత్తగా వెళ్ళండి చెల్లెమ్మలూ - మీ మొబైల్స్ వస్తువులు రేపు సెక్యూరిటీ ఆఫీసర్లు మీదగ్గరకు చేరుస్తారు ఇక భయమేమీ లేదు నెమ్మదిగానే వెళ్ళండి అనిచెప్పి మెయిన్ గేట్ పూర్తిగా తెరిచాను.
థాంక్యూ థాంక్యూ ........... అన్నయ్యా అన్నయ్యా ......... అంటూ సంతోషంతో కేకలువేస్తూ వెళ్లారు . 

వెంటనే మొబైల్ తీసి స్టేషన్ కు కాల్ చేసి గోవర్ధన్ సర్ ( సర్ అని పిలవక తప్పలేదు నా దేవత కోసం ) ప్రాణాలకు తెగించి అమ్మాయిలనందరినీ రక్షించి సిటీవైపు పంపించారు - ఆయన ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు అంబులెన్స్ తోపాటు రండి అని లొకేషన్ చెప్పాను . ఆ వెంటనే టోటల్ మీడియాకు మెసేజ్ పెట్టి లొకేషన్ షేర్ చేసాను . 20 నిమిషాలలో సెక్యూరిటీ అధికారి బెటాలియన్ మరియు మీడియా వెహికల్స్ వచ్చాయి .

నేను చెప్పకుండానే కమీషనర్ నాదగ్గరికివచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అమాంతం కౌగిలించుకుని అమ్మాయిలు విషయం అంతా చెప్పారు . గంటలో అందరూ సేఫ్ గా ఇంటికివెళ్లిపోతారు . 
అంతే మీడియా నాచుట్టుముట్టింది .
కమిషనర్ : నా చేతిని పట్టుకునే మీ పేరు ........ మహేష్ చెప్పండి మీరు ఏమి చెయ్యమంటే అది చేస్తాను - మన అమ్మాయిలకు ఏమైనా జరిగి ఉంటే వైజాగ్ సెక్యూరిటీ అధికారి పరువు నిజాయితీ నామరూపాల్లేకుండా పోయేది అన్నారు .
 సర్ ......... ముందు చావు బ్రతుకుల్లో ఉన్న గోవర్ధన్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లండి - రౌడీలందరినీ అరెస్ట్ చెయ్యండి - లోపల ఉన్న డ్రగ్స్ ను మాత్రం ఇక్కడ నుండి బయటకు వెళ్లనీకుండా చెయ్యండి - నేను ఎందుకు చెబుతున్నానో మీకు అర్థమైంది అనుకుంటాను .
కమిషనర్ : I know i know మహేష్ .......... మేము సీజ్ చేసినా , మా పైనున్న వారి వలన బయటకు వెళితే వైజాగ్ యూత్ కే ప్రమాదం అని మీడియా రికార్డ్ చూస్తుండగానే బయటకుతెచ్చి గంజాయితోపాటి తగలబెట్టేశారు .
వైజాగ్ ప్రజల తరపున థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ అని నేను - మీడియా సెల్యూట్ చేసాము . 
సర్ ......... మరొక ముఖ్యవిషయం - అదిగో సముద్రంలో ఉన్న పెద్ద షిప్ లో కూడా దేశం నలుమూలల నుండి కిడ్నప్ చేయబడిన అమాయకమైన అమ్మాయిలు ఉన్నారు సర్ అనిచెప్పాను . 
అంతే వెంటనే వైర్ లెస్ లో తీర రక్షకదళానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నిమిషాల్లో సెక్యూరిటీ అధికారి సైరెన్స్ తో బోట్స్ షిప్ ను చుట్టుముట్టాయి . 
కమిషనర్ : మహేష్ .......... ఎంతో మంది కుటుంబాల బాధను తీర్చారు అని అభినందించారు .
సర్ ......... మన్నించండి , ఈ ఆపరేషన్ అంతా సెక్యూరిటీ అధికారి గోవర్ధన్ చేశారు - నేను ఆయనకు సహాయం మాత్రమే చేసాను అని మీడియా వైపు చెప్పాను . వైజాగ్ ప్రజలారా గోవర్ధన్ పూర్తిగా మారిపోయారు - ఈరోజు అమ్మాయిలను రక్షించడం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టారు మీరే చూడండి అని అంబులెన్స్ లో రక్తపు మడుగులో ఉన్న గోవర్ధన్ వైపు చూయించాను . సర్ చెప్పండి సర్ ......... మధ్యాహ్నం నుండీ ఏమిచేసారో .........
కమిషనర్ : మహేష్ ........ వాడి గురించి మాకు తెలుసు . నన్ను అపద్దo చెప్పమంటావా .......... , అమ్మాయిలు ఇక్కడ జరిగినది మొత్తం చెప్పారు . వాళ్ళ కళ్ళకు మాత్రమే ముసుగు వేశారు చెవులకు కాదు .
Sorry sorry సర్ .......... మీరు ఎంత నిజాయితీ గల ఆఫీసరో వైజాగ్ మొత్తం తెలుసు - కొంతమంది మంచికోసం please please సర్ ..........
కమిషనర్ : కావ్య మరియు పిల్లల గురించేకదా ..........
సర్ ..........
కమిషనర్ : వాడి ప్రతీ కదలికపై నిఘా ఉంది . వాడి వలన ఆ తల్లి - పిల్లలు ఎన్ని బాధలను అనుభవించారో నాకు తెలుసు . వాళ్లకోసం - నువ్వు ఈరోజు మాకు చేసిన సహాయం వల్ల మా వైజాగ్ సెక్యూరిటీ అధికారి నమ్మకం పెరుగుతుంది - నువ్వు చెప్పినట్లుగానే చెబుతాను అని మీడియా వైపు తిరిగి , yes yes ......... అమ్మాయిల మిస్సింగ్ అని తెలియగానే కాలేజ్ ల దగ్గర ఉన్న ఆకతాయిలను అందరినీ పట్టుకుని లాకప్ లో వేశారు ఇప్పుడు వందల మంది మన చెల్లెళ్లను కాపాడారు .

మీడియా మొత్తం ఆశ్చర్యపోయి ఇంతవరకూ కరప్టెడ్ , అవినీతి , చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అక్రమ సంపాదన చేసిన గోవర్ధన్ గురించే అందరికీ తెలుసు కానీ ఈరోజుతో వాటిని పూర్తిగా చేరిపివేసి హీరో అయ్యారు అని రిపోర్టర్స్ లైవ్ ప్లే చేశారు . 

కమిషనర్ : హలో హలో రిసీవింగ్ రిసీవింగ్ ....... వాట్ , మహేష్ ......... షిప్ నుండి మొత్తం 300 మందికి పైగా అమ్మాయిలను రక్షించారు . ఆక్షన్ జరుపుతున్న వారిని మరియు ప్రపంచంలో ఉన్న బిలియనీర్స్ ను అరెస్ట్ చెయ్యడం జరిగింది అని నన్ను అమాంతం కౌగిలించుకుని అభినందించారు . మహేష్ ......... నీవలన రేపు సూర్యోదయానికి వైజాగ్ సెక్యూరిటీ అధికారి పవర్ అంటూ దేశం మొత్తం కొనియాడుతుంది కానీ వాడి పేరు ...........
సర్ .......... వన్స్ కావ్య మేడం సంతోషంగా బయటకు అడుగుపెట్టిన తరువాత ....... నేను చెప్పడం బాగోదు - సర్ నాకు కొద్దిగా అతిముఖ్యమైన పని ఉంది వెళ్ళాలి - సర్ .......ఈ క్షణం నుండీ రేపు అంతా న్యూస్ లో ఇదే టెలి క్యాస్ట్ అవ్వాలి అనిచెప్పాను . 
కమిషనర్ : మహేష్ ......... నేను చూసుకుంటాను - మహేష్ మహేష్ ........ నా పేరు 
.........
విశ్వ సర్ .......... మీరు తెలియని వైజాగ్ అని నవ్వుకున్నాము .
కమిషనర్ : మహేష్ ........ ఎటువంటి సహాయం కావాలన్నా ఒక్క కాల్ చెయ్యి నేనే స్వయంగా వచ్చేస్తాను . 
థాంక్స్ విశ్వ సర్ అనిచెప్పి క్యార వ్యాన్ దగ్గరికి పరుగుపెట్టాను .

నారాక కోసమే వెయ్యికళ్ళతో కిందకువచ్చి ఎదురుచూస్తున్నట్లు ప్రియమైన శ్రీవారూ ..........  అంటూ తియ్యని నవ్వుతో లోపలికి చేతిని చూయించారు .
అంతులేని ఆనందంతో పెద్దమ్మా .......... అంటూ అమాంతం పైకెత్తి చుట్టూ తిప్పి కిందకు దించాను . నిజమా పెద్దమ్మా ........... నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను . 
పెద్దమ్మ : పాదాలను పైకెత్తి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , శ్రీవారూ .......... మీదగ్గర అపద్దo చెప్పగలనా .
లవ్ యు లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా .......... అంటూ ఆనందబాస్పాలతో ముఖం మొత్తం ముద్దులవర్షం కురిపించి , ఉద్వేగానికి లోనయ్యి లవ్ యు అంటూ పెదాలపై ముద్దులుపెట్టాను . 
పెద్దమ్మ : పరవశించిపోయి , సంతోషంతో ముద్దులన్నీ నాకే ఇచ్చేస్తే మరి నీ బుజ్జాయిలకు ....... కాదు కాదు నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలకు అని ఆపారు . 
అయితే రండి శ్రీమతి గారూ .......... అని చేతిని ఎందుకున్నాను .
పెద్దమ్మ : మీ తండ్రీ బిడ్డల మధ్య నేనెందుకులే , మీరు వెళ్ళండి శ్రీవారూ ......... అని ముసిముసినవ్వులతో చెప్పారు .

మా దేవత లేకుండానా అంటూ రెండుచేతులతో ఎత్తుకున్నాను .
పెద్దమ్మ : లవ్ యు ......... ష్ ష్ ష్ ........ అంటూ పెద్దమ్మ తన రెండు చేతుల వేళ్ళతో మా ఇద్దరి పెదవులకు తాళం వేశారు . 
వేలిపై ముద్దుపెట్టి చప్పుడు చెయ్యకుండా నేరుగా బెడ్రూంలోకి వెళ్లి హాయిగా నిద్రపోతున్న బుజ్జాయిలను చూస్తూ కిందకుదించాను . 

కళ్ళల్లో చెమ్మతో - ఉద్వేగపు కన్నీళ్ళతో - ఆనందబాస్పాలతో .......... నా బుజ్జితల్లి ప్రక్కనే వాలిపోయి లవ్ యు తల్లీ .......... మొత్తం పూర్తిచేసి వచ్చేసాను అని ఇద్దరి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాను . 
నా ముద్దు స్పర్శకే , అన్నయ్యా - అన్నయ్యా .......... వచ్చేసారా అని నిద్రమత్తులోనే లేచి నా గుండెలపై చేరిపోయారు . ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు అని ప్రాణంలా కొట్టారు.
కొట్టండి కొట్టండి నా బుజ్జితల్లీ - నాన్నా .......... ఇప్పుడే వస్తాను అనిచెప్పి ఇంత ఆలస్యంగా వచ్చాను - నాకు శిక్ష పడాల్సిందే అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో పరవశించిపోతూ చెప్పాను .
లవ్ యు లవ్ యు అన్నయ్యా అన్నయ్యా ......... దెబ్బలు తగిలాయా ఇంకెప్పుడూ కొట్టములే - మందు రాస్తాము అని ముద్దుల వర్షం కురిపించి బుజ్జిబుజ్జినవ్వులతో నా గుండెలపై వాలిపోయి హాయిగా నిద్రపొయారు . 
బుజ్జాయిలను ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపించాను . పెద్దమ్మా .......... ఈ ఫీల్ ఏంటో మాటల్లో చెప్పలేను అంత మధురంగా ఉంది - ప్రపంచాన్ని జయించినంతగా ఉంది . మన బుజ్జాయిలు వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనంత జీవితాంతం ఇలా గుండెలపై ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని పులకించిపోవాలని బుజ్జాయిలకు ముద్దులుపెడుతూనే ఉండిపోవాలని ఉంది .
పెద్దమ్మ : నీ బిడ్డలు నీ ఇష్టం శ్రీవారూ .......... , మిమ్మల్ని విడదీసే శక్తి ఈ విశ్వంలోనే లేదు . 
శ్రీమతిగారూ ........... please please ........... ముద్దుపెట్టుకోవాలి మా ప్రక్కనే వచ్చి పడుకోవచ్చుకదా ...........
పెద్దమ్మ చిలిపిదనంతో నవ్వుకుని అంతకంటే అదృష్టమా శ్రీవారూ ......... ఆర్డర్ వెయ్యండి అని మాప్రక్కనే వాలిపోయి నా బుగ్గను ప్రేమతో కొరికేశారు .
లవ్ యు sooooooo మచ్ శ్రీమతి గారూ అని పెదాలపై ముద్దుపెట్టాను . 
ఉమ్మా ........ అంటూ పెద్దమ్మ నా పెదాలను కసితో జుర్రేసి చివరన ప్రేమగాటు పెట్టి తియ్యదనంతో నవ్వుతున్నారు . 
ముచ్చటేసి లవ్ యు పెద్దమ్మా .......... అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . పెద్దమ్మా ..........ఈ సంతోషం మొత్తం మీ వల్లనే అని పెద్దమ్మ చేతిని మాపై వేసుకుని , బుజ్జాయిల నా బిడ్డల కురులపై ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........... అంటూ ముద్దులుపెట్టి మురిసిపోతున్నాను . 
పెద్దమ్మ ......... కీర్తి తల్లి వీపుపై ప్రాణంలా స్పృశిస్తూ నా బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ ........ అంటూ ముద్దులుపెట్టి , ఇప్పటివరకూ నీ దేవత - నీ బిడ్డలు - నా శ్రీవారు అనుభవించిన కష్టాలకు మన అమ్మవారి హృదయం చలించిపోయినట్లుంది - ఇక ఇప్పటినుండి సూర్యోదయాలన్నీ మీ చిరునవ్వులతో చిగురిస్తాయి అని సంతోషంతో చెప్పారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 09-12-2020, 10:42 AM



Users browsing this thread: 17 Guest(s)