Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
చేపలకు ఫుడ్ వేస్తున్న బుజ్జాయిలు నా అడుగుల చప్పుడుకే అన్నయ్యా - అన్నయ్యా .......... అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయి , అన్నయ్యా ......... ఘుమఘుమలాడే స్పెషల్ భోజనం తీసుకొచ్చాము రండి తిందాము అన్నారు .

గిఫ్ట్స్ గురించి ఏమీ మాట్లాడకపోవడంతో బుజ్జాయిలవైవు మార్చి మార్చి ఆశతో చూస్తున్నాను .
నా చూపుల అర్థం బుజ్జితల్లికి తెలిసిపోయినట్లు , అన్నయ్యా .......... మీరిచ్చిన గిఫ్ట్స్ తో లోపలికివెళ్లి అమ్మా ......... అంటూ చూయించాము . ఎవరిచ్చారో అమ్మకు అర్థమైపోయినట్లు , వెంటనే వంట గదిలోకివెళ్లి హాట్ బాక్స్ మరియు ప్లేట్ తీసుకొచ్చి మీ అన్నయ్యకు ఆకలివేస్తూ ఉంటుంది పాపం తీసుకెళ్లండి అని ఆత్రంగా మమ్మల్ని బయటకు పంపించేశారు .
పంపించేసారా ...........  
అన్నయ్యా .......... పూలు ఐస్ క్రీమ్ చాక్లెట్ అందుకుని పంపించేశారులే - నాకు తెలిసి అమ్మ పూలను గుండెలపై హత్తుకుని అంతులేని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు .

బుజ్జితల్లీ .......... మీరు చూడలేదు కదా - నా సంతోషం కోసం అలా చెబుతున్నారు అని ఫీల్ అయ్యాను .
బుజ్జితల్లి : అన్నయ్యా ......... మీరు ఇలా ఫీల్ అవుతారని ఎక్కడి నుండి ప్రత్యక్షము అయ్యారో పెద్దమ్మ కనిపించి , బుజ్జితల్లీ ........... మీ అమ్మ ఫీలింగ్స్ నేను మొబైల్లో రికార్డ్ చేస్తానులే - మీ అమ్మకు సిగ్గు - పాపం అలా లవ్లీ ఫ్లవర్స్ గిఫ్ట్ లా అందుకుని 7 సంవత్సరాలకు పైనే అయ్యిందికదా - ఒక్కసారిగా అందుకోగానే తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే చూయిస్తాను అన్నారు .
అవునా బుజ్జితల్లీ - బిస్వాస్ .........అంటూ ముద్దులవర్షం కురిపించి , సాయంత్రం వరకూ ఏంటి మరొక సంవత్సరం అయినా సంతోషంగా వేచిచూస్తాను అని ప్రాణంలా హత్తుకుని తిందాము అని సోఫాలో కూర్చున్నాము .
బుజ్జితల్లి హాట్ బాక్స్ నుండి వెజిటబుల్ రైస్ - కూర్మా వడ్డించుకుని తినిపించి ఎలా ఉంది అన్నయ్యా .............
దేవతే స్వయంగా అమృతం వండినట్లుగా ఉంది బుజ్జితల్లీ .......... అని ఇద్దరికీ బుజ్జి బుజ్జి ముద్దలు తినిపించాను . 
మ్మ్మ్మ్మ్.......... అమృతం ఇలానే ఉంటుందా అన్నయ్యా ............

రాత్రి స్వీకరించిన అమృతపు ఊహల్లోకి వెళ్ళిపోయి , రేయ్ రేయ్ ........... తప్పు తప్పు అని సిగ్గుపడ్డాను . 
అన్నయ్యా ........... డ్రై fruits అని రైస్ తోపాటు తినిపించింది . 
ముందు మా బుజ్జాయిలు తినాలి బలం కోసం అని ఏరి ఏరి తినిపించాను . 

బుజ్జితల్లీ - బిస్వాస్ .......... వెళ్లి అమ్మకు చెప్పిరండి ఆఫీస్ కు వెళదాము అని ముద్దులుపెట్టాను .
బుజ్జితల్లి : అన్నయ్యా ........... అటు నుండి ఆటే వెళ్లిపోండి అని అమ్మ ఆర్డర్ ........ డోర్ తెరవను అని చెప్పేసారు .
నాకైతే నవ్వు ఆగలేదు . లవ్ యు లవ్ యు అని ముద్దులుపెట్టి ఎత్తుకుని ఆఫీస్ కు బయలుదేరాము .

దారిలో చాక్లెట్ heaven దగ్గర కారుని ఆపాను .
బుజ్జితల్లి : అన్నయ్యా అన్నయ్యా ......... ఇక ఈరోజు తినడం మావల్లకాదు please please .......... ఎక్కడా ఆగకుండా ఆఫీస్ కు వెళ్లిపోదాము వెళ్లిపోదాము అని నన్ను దిగనీకుండా చేతులను బుజ్జి చేతులతో పట్టేసుకుని బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించింది .
 బుజ్జితల్లీ నీకు వద్దులే బిస్వాస్ కు తీసుకుందాము .
బిస్వాస్ : అన్నయ్యా ........ ఇటుచూడండి అని ఉబ్బిన పొట్టన చూయించడంతో ,
నవ్వుకుని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆఫీస్ చేరుకున్నాము . 
వెంకట్ మొదలుకుని సర్ వరకూ లంచ్ గురించి అడిగి బుజ్జాయిలను నవ్వించారు . 

రూంలోకి వెళ్ళగానే నా బుగ్గలపై తియ్యని ముద్దులుపెట్టి వెళ్లి సోఫాలో కూర్చుని కలర్ పెన్స్ తో డ్రాయింగ్స్ వేస్తున్నారు .
వెళ్లి ఇద్దరిముందు మోకాళ్లపై కూర్చుని బుజ్జాయిలూ ......... ఇంట్లో మీ అమ్మకు ముద్దులుపెడుతున్న డ్రాయింగ్ ...........
బుజ్జితల్లి : నేనూ బుజ్జిఅన్నయ్య కలిసి వేశాము అన్నయ్యా .......... , బయటకువెళ్లి ఫోటోలు తీసుకునే వీలు లేదుకదా ...........
కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు soooo మచ్ బుజ్జాయిలూ ........... అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ముద్దులుపెట్టి , ఆకలివేసినా ఏమైనా కావాలన్నా ......... అడగండి .
లవ్ యు అన్నయ్యా - అన్నయ్యా .......... అంటూ చిరునవ్వులు చిందిస్తూ గట్టిగా ముద్దులుపెట్టారు .
పెదాలపై అంతులేని ఆనందంతో వెళ్లి వర్క్ లో మునిగిపోయాను . 

3 గంటల సమయంలో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే స్టేషన్ అని ఉంది . వెంటనే ఎత్తాను . 
అలర్ట్ అలర్ట్ .......... ఐదుగురు కాలేజ్ అమ్మాయిలు మిస్సింగ్ మిస్సింగ్ - ఉదయం కాలేజ్ కు వెళ్లిన అమ్మాయిలు లంచ్ కు ఇంటికి రాలేదని- కాల్స్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని కంప్లైంట్స్ అల్ సెక్యూరిటీ అధికారి అలర్ట్ అలర్ట్ .......... సిటీ నుండి బయటకు వెళ్లే వాహనాలన్నింటినీ పూర్తిగా చెక్ చెయ్యండి .
నాకు .......... స్టేషన్ నుండి కాల్ - yes yes ......... వాడికి వచ్చే కాల్స్ నాకు కూడా వినిపిస్తాయి అని పెద్దమ్మ చెప్పారుకదూ  ........... 
 మరొక కాల్ స్టేషన్ నుండే 10 మంది అమ్మాయిలు మిస్సింగ్ . మళ్లీ 10 నిమిషాలకు ******* కాలేజ్ నుండి అమ్మాయిలు మిస్సింగ్ - నిమిషానికి ఒక కంప్లైంట్ వస్తోంది - ఇప్పటివరకూ 25 మంది అమ్మాయిలు మిస్సింగ్ అలర్ట్ అలర్ట్ ........... సిటీ నుండి వెళుతున్న పెద్ద పెద్ద వెహికల్స్ అన్నింటినీ ఎక్కడికక్కడ ఆపేయ్యండి . సిటీ లోపల బయట ఉన్న బిల్డింగ్స్ అన్నింటినీ చెక్ చెయ్యండి .............అలా కాల్స్ మీద కాల్స్ గంటలో 50 మందికిపైనే సిటీలోని నలువైపులా ఉన్న కాలేజస్ నుండి మిస్సింగ్ అని నిమిషానికి ఒక కాల్ వస్తూనే ఉంది . సిటీలోని కాలేజస్ అన్నింటిదగ్గరా హై అలర్ట్ పెంచండి అని ఆర్డర్స్ .
ఇంతమంది అమ్మాయిలు మిస్సింగ్ ........... ఏమై ఉంటుంది - ఎలా జరిగి ఉంటుంది - కిడ్నప్ ........... ఎవరు చేసి ఉంటారు అని ముఖమంతా చెమటలు పట్టేసాయి .

అన్నయ్యా - అన్నయ్యా .......... చెమట పట్టింది అని బుజ్జి కర్చీఫ్ లతో తుడిచి , నిద్రవస్తోంది అన్నారు . 
నా బంగారం అంటూ గుండెలపై హత్తుకుని సోఫాలో పడుకుంటారా లేక ఇంటికివెళదామా అని అడిగాను . 
ఇక్కడ పడుకుంటాము అని గుండెలపై ముద్దులుపెట్టి నన్ను చుట్టేసి కళ్ళుమూసుకున్నారు . 
లవ్ యు బుజ్జితల్లీ - లవ్ యు బిస్వాస్ ........ అంటూ లేచి నిలబడి అటూ ఇటూ తిరుగుతూ కురులపై ముద్దులుపెడుతూ జోకొట్టాను . క్షణాల్లో వెచ్చని బుజ్జిశ్వాసలను నా గుండెలపై వదులుతూ హాయిగా నిద్రపొయారు .

5 గంటల సమయంలో మొబైల్ రింగ్ అవ్వడంతో వెంటనే సైలెంట్ లో ఉంచేసాను . లేదు లేదు ............ తల్లీ - బిస్వాస్ అని ముద్దులుపెట్టాను , మొబైల్ అందుకొని సోఫాలో కూర్చున్నాను . చూస్తే స్టేషన్ నుండి కాకుండా పార్టనర్ నుండి కాల్ వస్తుండటం చూసి ఎత్తి చెవిదగ్గరపెట్టుకున్నాను .
గోవర్ధన్ .......... అమ్మాయిల మిస్సింగ్ గురించి మీవాళ్ళు .........
పార్టనర్ ......... నేనున్నానుకదా , అమ్మాయిలను గోడౌన్ లో బంధించండి - వైజాగ్ లో ఉన్న మొత్తం గూండాలూ రౌడీలను కాపలా ఉంచండి . రేపు ఉదయానికల్లా మొత్తం క్లియర్ అయిపోతుంది . దానికోసం నైట్ అన్నీ ఏర్పాట్లూ చేసాను . నేను మన గోడౌన్ కు వచ్చేన్తవరకూ కాల్స్ చెయ్యొద్దు అని కట్ చేసాడు .

ఇది వీడిపనా .......... , 50 మందికిపైగా అమ్మాయిలను ఏమిచెయ్యబోతున్నాడు - ఎలాగైనా ఏదో ఒకటి చేసి అందరినీ రక్షించాలి కానీ ఎలా ........... ఇలాంటి వాడి నుండి అమ్మాయిలనూ - నా బుజ్జాయిలనూ - నా దేవ .......... మేడం ను ఎలా కాపాడుకోవడం . ఆ గోడౌన్ ఎక్కడ ఉందో తెలిస్తే నా ప్రాణాలిచ్చయినా కాపాడి నేను చేసిన అతిపెద్ద తప్పుకు పాయశ్చిత్తం చేసుకుంటాను అని అమ్మవారిని ప్రార్థించాను .
వెంటనే పెద్దమ్మ నుండి లొకేషన్ రావడంతో , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ పెద్దమ్మా .......... అని లేచి సైన్ ఔట్ చేసి సోఫాపై ఉన్న బ్యాగ్స్ తీసుకోబోయి బ్యాగ్స్ పై ఉన్న రెండు ఛార్ట్స్ చూసాను . ఏమి డ్రాయింగ్ వేశారు అని రోల్ చేసి చూసాను . మొదటి చార్ట్ లో బుజ్జాయిలిద్దరూ...... నా బుగ్గలపై ముద్దులు - రెండవ చార్ట్ లో బుజ్జాయిలిద్దరూ...... పెద్దమ్మ బుగ్గలపై ముద్దులు పెడుతున్న డ్రాయింగ్ చూసి ఆనందబాస్పాలు వాటంతట అవే కారసాగాయి . 

లవ్ యు బుజ్జితల్లీ - లవ్ యు బిస్వాస్ అంటూ ముద్దులవర్షం కురిపించాను . బ్యాగ్స్ - ఛార్ట్స్ అందుకుని బయటకువచ్చి కారులో కూర్చున్నాను .
హాయిగా నిద్రపోతున్న బుజ్జాయిల కురులపై ముద్దులుపెట్టి ముగ్గురికీ కలిపి సీట్ బెల్ట్ పెట్టుకున్నాను . బుజ్జితల్లీ - బిస్వాస్ ............ వాడి పాపాలకు అంతులేకుండా పోతోంది . ఈరోజుతో వాడి నుండి మీకు మరియు వైజాగ్ కు ఇక ఎటువంటి ఆపద లేకుండా చేస్తాను - ఎలానో తెలియదు , ఒంటరినే అయినా ప్రాణాలకు తెగించాను - మీ ముగ్గురి సంతోషం చూడటమే నా చివరికోరిక అనిచెప్పి బుజ్జాయిలకు ముద్దులుపెడుతూనే అపార్ట్మెంట్ చేరుకున్నాను .

ఇంకా నిద్రపోతున్న బుజ్జాయిలను లేపడం ఇష్టం లేక రేపు మళ్లీ చూస్తానో లేనోనని కళ్ళల్లో చెమ్మతో ఉద్వేగానికి లోనౌతూ ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకుని ముద్దులుపెడుతూ కిందకు దిగాను . 
అపార్ట్మెంట్ వాసులు గుమికూడి ఉండటం చూసి సెక్యూరిటీ అన్నను విషయం అడిగాను .
సెక్యూరిటీ : న్యూస్ తెలిసే ఉంటుంది సర్ , మన అపార్ట్మెంట్స్ నుండే 8 మంది అమ్మాయిలు మిస్సింగ్ . ఉదయం కాలేజ్ కు వెళ్లినవాళ్ళు లంచ్ కు రాకపోవడం - న్యూస్ లో మిస్సింగ్ న్యూస్ చూసి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ నో నెట్వర్క్ అని రావడంతో స్టేషన్ లో కంప్లైంట్ చెయ్యడంతో వివరాలు సేకరించడానికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు .
బుజ్జాయిలను ఎత్తుకునే అక్కడికి వెళ్ళాను . మిస్సింగ్ అయిన అమ్మాయిల పేరెంట్స్ బాధను చూసి హృదయం తరుక్కుపోయింది.

నా బుజ్జాయిలు - మేడం మరియు మీరు రేపు ఉదయం స్వేచ్ఛ - సంతోషపు సూర్యోదయం చూడాలి అని కన్నీళ్లను తుడుచుకుని paiki వెళ్లి దేవ ........ మేడం ఇంటి కాలింగ్ బెల్ నొక్కాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 09-12-2020, 10:28 AM



Users browsing this thread: 40 Guest(s)