Thread Rating:
  • 12 Vote(s) - 2.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery రాజధానిలో రంభ
#33
పశుపతి బయటకు రావాలి.....
సస్పెండ్ ఉత్తర్వుల్ని తక్షణం రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తున్న ఉద్యోగుల్ని ఓదార్చి సర్దిచెప్పటానికి ప్రయత్నాలు ప్రారంభించారు అధికారపార్టీకి చెందిన జిల్లా నాయకులు.అయినా కూడా వాళ్ళమాటల్ని  లెక్కచేయలేదు ఉద్యోగులు.తమ  ధోరణిని ఇంకాస్త అధికం చేశారు.
తమతో చర్చించటానికి మంత్రి పశుపతి సిద్ధం కావాలని..
విషయాన్ని చర్చించటానికి తమకి టైముని కేటాయించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
పరిస్థితులు అదేవిధంగా కొనసాగితే వాతావరణం కలుషితమవుతుందన్న నగ్నసత్యాన్ని గ్రహించి వెంటనే స్పందించాడు అధికారపార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు.అతనితోపాటుగా పార్టీ జిల్లా సెక్రటరీ కూడా మంత్రిగారి రూములోకి వెళ్ళాడు.
వాళ్ళు వెళ్లిన పదినిమిషాలకే వెనక్కు తిరిగి వచ్చారు.
ఓ గంటలో మంత్రిగారు అపాయింట్మెంట్ ని  కేటాయించినట్లుగా ఉద్యోగసంఘాల నాయకులకు చెప్పారు.
అప్పటివరకు ఎలాంటి గొడవలు చేయకుండా ఉండవలసిందిగా మంత్రిగారు కోరినట్లుగా ఉద్యోగసంఘాల నాయకులకు చెప్పారు.వాళ్ళ మాటలకి చల్లబడ్డారు ఉద్యోగులు.అందుకు అంగీకార సూచకంగా వెళ్ళి చెట్లక్రింద కూర్చున్నారు.
వారి పరిస్థితి ఆ విధంగావుంటే.....
అనేక మండలాలకి చెందిన పలువురు నాయకులు మంత్రిగారితో తమ తమ సమస్యల గురించి,ఉద్యోగుల వేధింపుల గురించి చెప్పుకొని సమస్యల పరిష్కారానికి మంత్రిగారి వద్దనుండి హామీని తీసుకున్నారు. విజయగర్వంతో ఎవరికివారే బయటకు రాసాగారు.ప్రతిపక్ష పార్టీలకి చెందిన నాయకులు కూడా వెళ్ళి తమకు కావలసిన పనులకి పర్మిషన్ ని తీసుకుని బయటకు వస్తున్నారు.ఉద్యోగుల సస్పెన్స్ విషయంలో ఎలాంటి వత్తిడికి లొంగకూడదని, గవర్నమెంట్ ఉప్పు తింటూ విధులకు న్యాయం చేకూర్చకుండా కాలయాపన చేస్తున్న ఉద్యోగుల పొగరు అణచటానికైనా ఇలాంటి సంఘటనలు జరిగి తీరవలసిందేనంటూ మంత్రిగార్కి కొన్ని సూచనలు చేసి తిరిగి బయటకి రావడమే కాకుండా బయటకి వస్తూనే ఉద్యోగసంఘాల నాయకుల్ని పక్కకు పిలిచి తాము మంత్రిగారి చర్యని ఖండించామని, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యని ఎండగట్టామని,తక్షణ సస్ పెన్షన్ ఉత్తర్వుల్ని రద్దుచేసుకోకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించినట్లుగా చెప్పుకున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు.
వాళ్ళ సానుభూతికి సంతోషించిన ఉద్యోగ సంఘనాయకులు - అసలు జరిగింది వేరని గ్రహించలేకపోయారు.అల్పులుగానే సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఓ గంటలో అపాయింట్మెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన మంత్రిగారు రెండుగంటలు గడిచిపోయినా తమని ఇంకా పిలవకుండా కూర్చున్నందుకు భయం చోటుచేసుకుంది ఉద్యోగుల గుండెల్లో.ఆవేశం పొంగుకొచ్చింది.తిరిగి కలకలం మొదలైందక్కడ.
అయినా కూడా ఇంకా ప్రజల్ని , నాయకుల్ని కలుసుకుని చర్చిస్తూనే ఉన్నారు మంత్రిగారు.
ఉద్యోగుల కదలికని గమనించి విషయాన్ని మంత్రి చెవిలో వేసాడు డి.ఎస్.పి.
మంత్రిగారికి ఇంకాస్త పట్టుదల పెరిగింది.కోపంతో ఉద్యోగ సంఘాల నాయకులకి కేటాయించిన టైంని పత్రికా ప్రతినిధులకు కేటాయించాడు.ఆ చర్య ఇరకాటంలో పడేసింది ఉద్యోగుల్ని. తిరిగి రెచ్చిపోతూ ఆవేశంతో నినాదాలు చేయటం ప్రారంభించారు.
వాళ్ళ నినాదాల్ని గురించి అంతగా పట్టించుకోకుండానే పత్రికా సమావేశాన్ని కొనసాగించాడు మంత్రి పశుపతి.
పలువురు ఉద్యోగులు విధులకి హాజరైనట్లుగా అటెండెన్సు రిజిస్టర్లో సంతకాలు చేసి ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి స్వంతపనులతో, కాలక్షేపకబుర్లతో, రాజకీయ చర్చలతో, వ్యాపారాల్ని కొనసాగిస్తుండడం వలన వారి మీద చర్య తీసుకోవటం జరిగిందని చెప్పాడు మంత్రిగారు.ప్రభుత్వ  ఉద్యోగులై వుండి ప్రజలకి అందుబాటులో లేకుండా విధినిర్వహణకి న్యాయం చేకూర్చకుండా అక్రమంగా జీతాల్ని పొందుతున్న ఉద్యోగులకు ఈ చర్య కనువిప్పు కల్గిస్తుందన్న విశ్వాసాన్ని ప్రకటించాడు.
ఇక మున్ముందైనా తమతమ విధులకి సక్రమంగా హాజరై ప్రజలకి ఆందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి సహాయం అందించగల్గుతారని ఆశిస్తున్నాను.ప్రభుత్వానికి, ప్రజలకి నడుమ వారధులుగా నిలుస్తారని ఆశిస్తున్నాను.విధులకు హాజరు కాకుండా నిధుల్ని దుర్వినియోగం చేయాలని ఎవరు చూసినా సహించేదిలేదని,అటెండర్లయినా ఆఫీసర్లయినా ఎవరైనా సరే ఇలాంటి చర్యలకి పాల్పడితే ఎలాంటి పరిస్థితిలోనూ ప్రభుత్వం వారిని క్షమించదు, ఈ రోజు సస్పెండైన వారినుండి సరైన సంజాయిషీ వస్తే ఆ సంజాయిషిని పరిశీలించి, నిజానిజాల్ని నిగ్గుతేల్చుకున్న తరువాతనే క్షమాబిక్ష పెట్టడం జరుగుతుందని అప్పటివరకు సస్పెన్షన్ కొనసాగుతుందని మంత్రి పశుపతి వెల్లడించారు.
ఉద్యోగ సంఘనాయకులు మౌనంగా ఉండి ప్రశాంత వాతావరణంలో చర్చలకు సిద్దపడి వుంటే తను తప్పకుండ వాళ్ళతో చర్చలు జరిపి వుండేవాడినని అలా ప్రవర్తించినందుకు విచారిస్తున్నామని,ప్రజాప్రతినిధినని కూడా గౌరవించకుండా అవమానపరిచే విధంగా నినాదాలుచేస్తూ అల్లర్లను సృష్టించే ప్రయత్నంలో ఉన్న ఆయా ఉద్యోగసంఘాల గుర్తింపుని రద్దు చేయటానికి కూడా ప్రభుత్వం వెనుకాడదని ఒక ప్రశ్నకి సమాధానంగా శ్రీ పశుపతి తెలియచేసారు.
అయితే ఉద్యోగ సంఘనాయకులతో సంప్రదింపులు జరపరా "ఈ రోజు సస్పెండు కి గురైన ఉద్యోగులకి క్షమాభిక్ష పెట్టరా" అంటూ ఒక విలేఖరి ప్రశ్నించగా అందుకు స్పందిస్తూ.....
వాళ్ళతో సంప్రదింపులకు దిగి టైంని వేస్ట్ చేసుకోవటం ఇష్టంలేదు నాకు.ఇక సస్పెండు కి గురయిన ఉద్యోగులు తమ తప్పుని గుర్తించగల్గిననాడు ఆలోచిస్తుంది ప్రభుత్వం" అన్నాడు పశుపతి.
"వాళ్ళు కోర్టుని ఆశ్రయిస్తే?"
"ఆశ్రయించనివ్వండి.విధులకి న్యాయాన్ని చేకూర్చకుండా అటెండెన్సు రిజిస్టర్లో విధులకి హాజరైనట్లుగా సంతకాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టుతున్న ఉద్యోగులని కూడా తన పరిగణలోకి తీసుకుంటుంది న్యాయస్థానం."
"అయితే... ఇలా ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగులు విధులకి హాజరు కాకుండా ప్రభుత్వ నిధుల్ని కాజేస్తూ సస్పెండుకి గురయ్యారో వివరిస్తారా?"
"వైనాట్....తప్పకుండా వివరిస్తాను.రాయలసీమలో 120 మంది.ఆంధ్రాలో 280 మంది.తెలంగాణ జిల్లాల్లో ఈరోజు వరకు 380 మంది.విధులకి హాజరు కాకుండ  ప్రభుత్వ నిధుల్ని దుర్వినియాగం చేసినందుకుగాను సస్పెండు అయ్యారు."
[+] 1 user Likes Vihari's post
Like Reply


Messages In This Thread
రాజధానిలో రంభ - by Vihari - 08-11-2018, 10:17 AM
RE: రాజధానిలో రంభ - by Vihari - 04-12-2018, 07:03 PM



Users browsing this thread: 4 Guest(s)