Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
పేరులో ఏముంది

'పేరులో ఏముంది' అన్న ఈ కధ పేరు మీద చాలా మంది పాఠకులు కామెంట్స్ పెట్టారు. బాగుంది అని, వెరైటీ గా ఉంది అని, 'బావ బావ పన్నీరు'  అయితే అతికినట్టు ఉండేదని చివరకు పేరు ఏమైనా కధ బాగుంది అని చాలా కామెంట్స్ వచ్చాయి. పేరు పెట్టడం ఒక కళ. మనుషులకు జీవితాంతం అది ఒక ఐడెంటిటీ. అందుకే తల్లి తండ్రులు చాలా ఆలోచిస్తారు. పెద్దయిన తర్వాత నచ్చకపోతే మార్చుకొనే వారు ఉన్నారు. కాకపోతే సినిమా, వెబ్ సిరీస్, నవల, కధ ఇలా జీవంలేని వాటిని  సృష్టించే వాటికి పేరు పెట్టడానికి ప్రేరణ వేరేగా ఉంటుంది. పేరు చూడగానే చదవాలనో, చూడాలనే ఉత్సుకత కల్గించటం ఒక ఎత్తు. పేరులోనే కధ ప్రధానాంశం చెప్పి అది ఎలా వుండబోతుందో తెలుసుకోటానికి చదవమని లేదా చూడమని ఉత్సాహం కల్పించడం. ఒక్కోసారి పేరుతోనే ఏమి జరగబోతోందో చెప్పి పాఠకులకు చివరి వరకు ఎలా ముగుస్తుందో అని తెలియకుండా కధ నడిపించటం ఇంకొక రకం.

మత్తు వదలరా - పేరులోనే సినిమా కధాంశం మీద ప్రేక్షకులకు ఒక అవగాహన వస్తుంది.  అలాగే కన్యాశుల్కం - తెలుగు క్లాసిక్ పుస్తకం, తరువాత సినిమా గా కూడా వచ్చింది. పేరులోనే కధ దేనిగురించో తెలిసిపోతుంది. కానీ అది ఏమిటో చదివితేనే, చూస్తేనే ఆ సామాజిక సమస్య గురించి, అప్పటి కాల పరిస్థితులు విధవ వివాహం, ఆంగ్ల భాష మీద మక్కువ వాటి గురించి వివరంగా తెలుస్తుంది.

కొన్ని పేర్లు చదువరులను/ప్రేక్షకులను ఆలోచింప చేస్తాయి ఏమై ఉంటుందా అని. PSV గరుడ వేగ 126.18 - ఈ పేరు చూస్తేనే సినిమా దేనిగురించి అయివుంటుందా అని ఒక ఉత్సుకత కలిగిస్తుంది. నాకు ఉన్న జనరల్ నాలెడ్జి ప్రకారం PSV అన్నది ఒక యూరోపియాన్ ఫుట్బాల్ టీం పేరు. కధకు ఆటలకు సంభందం లేదని తెలుస్తోంది. అలాగే సస్పెన్స్/థ్రిల్లర్ లాంటి సినిమా అన్న అవగాహన కూడా కలుగుతుంది. ఏమై ఉంటుందా అని కనీసం గంట పైనే ఆలోచించి ఉంటాను, కానీ తట్టలేదు. ఆ పేరు ఎందుకు పెట్టాడో దాదాపు సినిమా చివర వరకు తెలియదు. కొంచెం పరీక్షగా చూస్తే తప్ప కొంత మందికి 126.18 అర్ధం ఏమిటో తెలియదు. తెలియక పోయినా ఫరవాలేదు, కానీ నా లాంటి ఉత్సుకత ఉన్నవాళ్లకు అంత చిన్న విషయాలు కూడా ముఖ్యమే. నేనైతే సినిమా చూడక ముందు అది ఒక టార్గెట్ దూరం అయివుంటుంది అని ఊహించాను. సినిమా చూసిన తరువాత కూడా  PSV అంటే ఏమిటో అర్ధం కాకపోవటంతో గూగుల్ చేసి తెలుసు కొన్నాను. ఆ  తరువాత ఎందుకో సినిమా పోస్టర్ చూస్తే మొత్తం క్లియర్ గా ఎదురుగానే పెట్టాడు దర్శకుడు, నా కళ్ళే మిస్ అయ్యాయి.

అలాగే Sixth Sense. ఈ పేరుతోనే దర్శకుడు విషయం ఏమిటో చెప్పీచెప్పకనే చెప్పేస్తాడు. సినిమా మొదటి షాట్ నుంచి చివరి వరకు కధ దేని గురించో చెబుతున్న చాలా మంది ప్రేక్షకులకు అది చాలా సేపటి వరకు అర్ధం కాదు. నాకు తెలిసి కొంతమంది చివరివరకు కూడా అర్ధం చేసుకోలేదు, అదే థ్రిల్. రెండో సారి చూస్తే సినిమాలో ప్రేక్షకులకు దర్శకుడు ఎన్ని ఆధారాలు ఇచ్చాడో అర్ధం అవుతుంది. In a lonely place.ఇది ఒక హాలీవుడ్ క్లాసిక్. పేరు చూడగానే ఒక విషాదమైన ముగింపు అని కొంచెం లోకజ్ఞానంతో ఆలోచిస్తే తెలిసిపోతుంది. దాదాపు సినిమా మధ్యలో హీరో హీరయిన్ ల మధ్య సమభాషణలో ఒక డైలాగ్ ఉంటుంది. "I was born when she kissed me. I died when she left me. I lived a few weeks while she loved me." సినిమా ఎలా ముగియ బోతోందో ఆ సంభాషణ ద్వారా చాలా ముందే దర్శకుడు చెప్పినా, చివరి వరకు చాలామంది ప్రేక్షకులు పట్టుకోలేరు.

ఆ ఒక్కటి అడక్కు - పేరుతోనే కధ మీద ఒక ఇంటరెస్ట్ కలుగ చేసి, ముగింపు ఎలా ఉంటుందో రచయిత చెప్పినా, పూర్తిగా చదివిన తరువాత కూడా దాని గురించి ఆలోచించకుండా ఉండలేము.

ఇలా పేర్ల గురించి ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు. ఈ కధకు మొదట నేను అనుకొన్న పేరు "శ్రీరామచంద్రా!". చాలా పేర్లు పరిశీలించిన తర్వాత నాకు అది సరియైన పేరు అనిపించి పెట్టాను. కధ ముగింపు చదివిన తర్వాత అది సరి అయిందో కాదో అన్న విషయం పాఠకులకే వదిలేస్తున్నాను. ఆ పేరుతొ దారం తెరిచి ఉపోద్ఘాతం రాసాను. ఉపోద్ఘాతం పోస్ట్ చేసిన మరుసటి రోజే మీ రంకు కధకి శ్రీరామచంద్ర అన్నపేరు హిందువులని కించ పరిచేదిగా ఉంది మార్చండి అని ఒకరు పీఎం పెట్టారు. వారు రాసిన పద్దతి కూడా మర్యాద పూర్వకంగా కూడా లేదు. మొదట పట్టించుకోకూడదు అని అనుకున్నా నాకా ఉద్దేశ్యం లేకపోవడంతో, నేను హిందువునే, నన్ను నేను కించపరచుకునే పని ఎప్పుడు చేయను అని మర్యాదగానే సమాధానం రాసాను. లేదు సుబ్బారావు అనో ఎదో పేరు పెట్టి రాయండి అని మళ్ళా రిప్లై. అంత సున్నిత మనస్కులైతే ఈ సైట్ కి రావటమే వ్యర్థం, వచ్చినా మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దటం సరికాదు అని రాద్దామనుకున్నాను. కానీ "తివురు ఇసుమైన తైలంబు తీయవచ్చు" పద్యం గుర్తుకు వచ్చి వ్యర్థమనిపించింది. సమాధానం రాయలేదు. 

ఇంతకు ముందు  సైట్ లో ఇలాంటి అనుభవం ఉందేమో, అదే సమయంలో సైట్ అడ్మినిస్ట్రేటర్ గారు కూడా మర్యాదపూర్వకంగా ఒక సలహా ఇచ్చారు. మాములుగా అయితే కధ రాయడం అయినా ఆపేవాడిని కానీ పేరు మార్చే ఆలోచన చేసేవాడిని కాను. మనదాంట్లో తప్పులేనప్పుడు ఎందుకు మార్చాలి అన్నది నా ఆలోచన. కానీ వారితో ఉన్న కొద్దిపాటి స్నేహం, ఈ సైట్ నిర్వహణకు వారు పడుతున్న శ్రమ, గౌరవం కొద్దీ పేరు మారుద్దమని నిర్ణయించుకొని, ఏ పేరు పెట్టాలా అని ఆలోచించాను. అప్పుడు స్ఫురించింది. పేరులో ఏముంది, కధలో విషయం ఉంటె పాఠకులు చదువుతారు లేకపోతె లేదు అని. అలా ఆలోచించి రెండు పేర్లు 'పేరు లేని కధ', 'పేరులో ఏముంది' పరిశీలించి 'పేరులో ఏముంది' నిశ్చయం చేసాను. అదండీ పేరులో ఏముంది అసలు కధ.

ఈ సందర్భంలో ఇటువంటి సెన్సిటివ్ గా ఫీల్ అయ్యే విషయాల మీద నా అభిప్రాయం పంచుకొంటాను. జిహ్వకో రుచి, పుర్రెకో బుధ్ధి అన్నారు. వ్యక్తిగతంగా నాకు ఇన్సెస్ట్ (రక్త సంభందీకుల మధ్య తల్లి, కొడుకు అక్క, తమ్ముడు...) అస్సలు పడదు. పాత సైట్ లో చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా కధలు తెలిసేవు కావు. మొదట మామూలుగానే మొదలయి హఠాత్తుగా ఇన్సెస్ట్ వచ్చేసేది. "తోకలేని పిట్ట" అనుకుంటా కధ పేరు. చాలా బాగా రాసేవారు రచయిత, ఒకసారి సడన్ గా గే రాసేసరికి ఆపేసాను అంతటితో. అలా అని చెప్పి అసలు గే రాయకూడదని చెప్పటం సరైంది కాదు. నాకు అవి నాకు నచ్చకపోయినా, వాటిని ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. అలాగే మతాంతరం చదవడం నాకు ఇబ్బంది లేదు కానీ కొంతమందికి ఉండవచ్చు. నా అభిప్రాయం ఏమిటంటే ఒకరికి నచ్చిందే, మెచ్చిందే అందరికి వేదం కాదు. మన సొంత అభిప్రాయాన్ని అందరి మీద రుద్దటం కూడా సరికాదు. కొన్నివాటి గురించి (LGBT,ఇన్సెస్ట్,) ముందే హెచ్చరిస్తున్నారు రచయితలు. అలాగే సైట్ లో దారాలను విభజిస్తున్నారు. ఇది మంచి పని. ఎవరికేది ఇష్టమో దాన్నిబట్టి వారు చదువుకుంటారు.

నా మట్టుకు తప్పొప్పులు అన్నవి ఒకరికి సంబందించినవి. చట్ట పరంగా చైల్డ్ పోర్నోగ్రఫీ నేరం. అది, అలాగే రేప్, కులదూషణ ఉండకూడదని కొన్ని గైడ్ లైన్స్ పెట్టారు, బాగుంది.  ఆ నిబంధనలకు లోబడి ఎవరైనా ఏదైనా రాస్తే ఇతరులకు సమస్య ఉండకూడదు. నచ్చిన వాళ్ళు చదువుతారు. నచ్చకపోతే దూరం పెడతారు. దీని మీద చర్చ పెట్టడం నా ఉద్దేశం కాదు (ఇంతకుముందు చాలా జరిగాయి). సందర్భం కొద్దీ నా అభిప్రాయం పంచుకున్నాను.
[+] 10 users Like prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 16-09-2020, 10:16 AM



Users browsing this thread: 18 Guest(s)