08-09-2020, 09:39 AM
(This post was last modified: 08-09-2020, 09:48 AM by rajniraj. Edited 1 time in total. Edited 1 time in total.)
సమయం అదే రోజు రాత్రి
రెండు గంటలు
మధ్య రాత్రి రెండు గంటలు పూజ ఫోన్ రింగ్ అవుతోంది సాధారణం ఈ టైం లో ఫోన్ ఎవరు చేయరు అనుకుంటునే పూజ ఫోన్ తీసి చూసింది
అది పూజా అమ్మా దగ్గర నుంచి ఈ టైం లో ఫోన్ రావడం అది అమ్మా దగ్గర నుండి ఎందుకో పూజ మనసులో కీడు శంకిచింది
వెంటనే ఫోన్ తీసింది పూజ అమ్మా ఏడుస్తూ పూజ డాడీ కారు యాక్సిడెంట్ అయింది అంటూ ఏడుస్తూనే చెప్పింది
అంతలో అక్క హారతి ఫోన్ తీసుకుని పూజ చిన్న యాక్సిడెంట్ నువ్వు ఏమి భయపడకు అంటూ ధైర్యం చెప్పింది
కానీ పూజ మాత్రం ఎప్పుడూ ఏడవటం లేని అమ్మా ఏడుస్తూ మాట్లాడటం అది ఎదో పెద్ద యాక్సిడెంట్ అని నిర్ణయించుకుంది పూజ
వెంటనే బయలుదేరి బైక్ లో రాత్రికి ప్రయాణం చేసి తన ఊరు చేరుకుంది
ఉదయం పదింటికంత పూజ నాన్నను అడ్మిట్ చేసిన హాస్పిటల్ చేరుకుంది
ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్ పైన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కోమా స్టేజి లో ఉన్న నాన్నను చూసి పూజ కోపంతో రగిలిపోతోంది
ఎలా జరిగింది అసలు ఏం జరిగిందని అక్కడ నిలబడిన సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ వ్యక్తులను అడుగుతోంది
రాత్రి ఫ్యాక్టరీ నుండి పని చూసుకుని పదకొండు గంటల ఆ సమయంలో ఇంటికి తిరిగి వచ్చే దారిలో ఎదో గుర్తు తెలియని లారీ గుద్ది వెళ్లింది అని ప్రాపర్ ఇన్విటేషన్ లో తెలింది
అని మోటు ఎంటో తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పాడు ఒక ఎస్సై
అంతలో సుదర్శనరావు హాస్పిటల్ చేరుకున్నాడు
సుదర్శన్ రావు పూజ నాన్నగారు ముకుంద రావు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అంతకు మించి మంచి స్నేహితులు అన్ని వ్యాపారులు నీతిగా నిజాయితీగా పద్ధతిగా కలిసే చేస్తారు
ఆ నీతి నిజాయితీలే అంచెలంచెలుగా వారి వ్యాపారాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాయి
సుదర్శన రావు ఇద్దరు కుమారులు పెద్దవాడు విజయ్ రెండో వాడు అజయ్ విజయ్ ఇక్కడే ఉంటూ తండ్రికి సహాయం ఉంటాడు చిన్న వాడు అజయ్ చిన్న వయసులోనే ఫారిన్ వెళ్లి అక్కడే చదువుకోని సుదర్శన్ రావు ముకుందరావు బిజినెస్ విదేశాల్లో కూడా మొదలుపెట్టి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు
అజయ్ ఎప్పుడో కానీ ఇండియాకి రాడు ఎప్పుడు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు
సుదర్శన రావు రాగానే ముకుంద రావు ఆరోగ్య పరిస్థితిని విచారించి అప్పటికే అక్కడ ఉన్న తన పెద్ద కొడుకు విజయ్ ముకుంద రావు మేనల్లుడు
పెద్ద అల్లుడు అయిన సురేష్ (పూజ అక్కా హారతి మొగుడు) పరిస్థితి దగ్గరుండి చూసుకోవాలని
అవసరమైతే ఒక విమానాన్ని సిద్ధంగా ఉంచామని ముకుందరావు ఆరోగ్య పరిస్థితి విషమింస్తే ఫారిన్ తీసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరించాడు
హాస్పిటల్ డిన్ ను ఎప్పటికప్పుడు ముకుంద రావు ఆరోగ్య పరిస్థితి తనకి ఇన్ఫామ్ చేయాలని గట్టిగా హెచ్చరించాడు
సుదర్శన్ రావు అతని భార్య గౌరి ఇద్దరు కలిసి
ముకుంద రావు భార్య లక్ష్మి దగ్గరికి చేరి ఓదారుస్తున్నారు
అప్పటికే తల్లి పక్కన చేరిన హారతి పూజ స్వాతి
గౌరీ లక్ష్మీ పక్కకు చేరి ఓదార్పు మాటలు మాట్లాడుతూ లక్ష్మీ అలా ఉంటే ఎలా చూడు పిల్లలు ఎలా అయ్యారో
మీ అన్నయ్య వచ్చాడుగా ఇక అంతా ఆయన చూసుకుంటాడు అంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ముకుందరావు భార్య లక్ష్మి ఓదార్చడానికి ప్రయత్నించింది కానీ సొంత అన్నయ్యల చూసుకునే ముకుంద రావు అలా యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద పడి ఉంటే లక్ష్మీ కంటే ఎక్కువగా బాధ పడుతున్నది
సుదర్శన్ రావు గౌరీనే తమ బాధను లోలోనే దాచుకుని ముకుందరావు కుటుంబాన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు
అలా ఓదారుస్తూ రాత్రికి వాళ్లను కాస్త స్థిమిత పడేలా చేసారు అప్పటికి డాక్టర్ అందరూ వచ్చి ముకుంద రావు ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు
ఆ తరువాత గౌరీ అతికష్టం మీద లక్ష్మిని వాళ్ల అమ్మాయిలు హారతి పూజ స్వాతి కాస్తా ఎదేనా తినడానికి ఒప్పించగలిగింది
ఎంత బ్రతిమిలాడినా ముకుంద రావు భార్య పిల్లలు ఇంటికి వెళ్లడానికి ఒప్పుకోలేదు
గౌరీ కూడా వారి మనస్థితిని అర్దం చేసుకోని ఈ రాత్రికి వాళ్ళతో ఉంటానని చెప్పి భర్త
సుదర్శన్ రావు ఇంటికి పంపింది
ముకుంద రావు ప్రాణానికి ప్రమాదం అయితే లేదు కానీ ఆల్మోస్ట్ కోమా స్టేజ్ లో ఉన్నందున ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో డాక్టర్ చెప్పలేక పోతున్నారు
అలా ఒక మూడు రోజులు గడిచాయి.
గౌరీ ఉదయం ఇంటికి వెళ్ళి వంట చేయించి హాస్పిటల్కు తీసుకు వచ్చేది మూడు రోజులు గడిచినా తరువాత ఎలాగో బ్రతిమాలి లక్ష్మీ పిల్లలను ఇంటికి పంపి కాస్తా స్నానాలు అవి ఇంటిని చూసుకోని రమ్మని ఒప్పించింది
వారుకూడా ఒక్కోకరుగా ఇంటికి వెళ్ళి వచ్చారు
[b]చివరిగా పూజ ఇంటికి వెళ్లింది[/b]