Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్ (missing black shoes)
#15
ఈ 6 నెలల సమయం లో దేవరాజ్ కేసు తరువాత శేఖర్ కొన్ని కిడ్నాప్, ల్యాండ్ మాఫియా కేసులు కూడా solve చేశాడు దాంతో ఆ క్రెడిట్ మొత్తం కృష్ణ కీ ఇచ్చాడు అలా కృష్ణ టాస్క్ ఫోర్స్ సెక్యూరిటీ ఆఫీసర్లో సీనియర్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చి నెక్స్ట్ ACP పోస్టు కీ రెడీ గా ఉన్నాడు కాకపోతే శేఖర్ లేకపోతే ఇది సాధ్యం కాదని కృష్ణ కీ తెలిసి శేఖర్ క్రిమినల్ సైకాలజీ కన్సల్టేంట్ గా తనతో పాటు తిప్పుకుంటు ఉన్నాడు అలా ఇద్దరు కలిసి కాలేజ్ కీ వెళ్లారు అక్కడ అప్పుడే ఏరియా సెక్యూరిటీ అధికారి లు మీడియా హడావిడి బాగ ఉంది కృష్ణ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్లకు మొత్తం స్టాఫ్ అందరినీ ఎంక్వయిరీ చేయమని చెప్పాడు ఆ తర్వాత శేఖర్ కోసం చూస్తే, శేఖర్ కాలేజ్ గేట్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు దాంతో దగ్గరికి వెళ్లి "ఏమీ మామ ఏమైన క్లూ దొరికిందా" అని అడిగాడు దానికి శేఖర్ ఇంకా అటు వైపు చూస్తూ "ఈ గేట్ నీ ఎక్కడో చూసినట్లు ఉంది మామ ఈ ప్లేస్ కూడా బాగా టచ్ ఉన్నట్లు ఉంది" అని అన్నాడు దానికి కృష్ణ వింతగా చూస్తూ ఉంటే ఏమైంది అని సైగ చేశాడు శేఖర్ "రేయ్ పిచ్చి నా కొడుక ఇది మన కాలేజ్ రా " అన్నాడు దాంతో శేఖర్ "కదా నాకూ ఎందుకు గుర్తు లేదు మామ" అని అడిగాడు దాంతో కృష్ణ "నువ్వు ఏ రోజు అయిన ముందు గేట్ నుంచి వచ్చి ఉంటే తెలిసేది " అని అన్నాడు దాంతో శేఖర్ నవ్వుతూ "ఎంతైన కాలేజ్ లైఫ్ గ్రేట్ కదా మామ ఏమీ టెన్షన్ లు ఉండేవి కాదు అదే ఇప్పుడు నానా సంకలు నాకాల్సి వస్తుంది" అని అన్నాడు అప్పుడే ఆ కాలేజ్ వాచ్ మెన్ వచ్చి "సలాం సాబ్" అన్నాడు దాంతో ఇద్దరు అతని చూసి ఒకేసారి "బహదూర్ భాయ్ " అన్నారు.


"పర్లేదు రా నేను ఇంకా గుర్తు ఉన్నాన " అని నవ్వుతూ అడిగాడు బహదూర్ దానికి శేఖర్ నవ్వుతూ "నిను ఎలా మర్చి పోతా భాయ్ ఎన్ని సార్లు గోడ దూకి బంక్ కొట్టడానికి సహాయం చేశావు మా నాన్న కీ కాలేజ్ నుంచి కంప్లయింట్ పోస్టు వెళ్లకుండా చూశావు నీ సహాయం ఎలా మర్చి పోతాం భాయ్" అని అన్నాడు దానికి బహదూర్ "నా చెల్లి కాలేజ్ ఫీజు కోసం నీ కాలేజ్ ఫీజు ఇచ్చావు ఆ సహాయం తో పోలిస్తే ఇది ఎంత అయిన మీ బ్యాచ్ లో మీ గ్యాంగ్ ఎంజాయ్ చేసినట్లు ఈ కాలం పిల్లలు ఎప్పుడు చేయాలి అయిన మీ అంత ఎద్దవ బ్యాచ్ నా కెరీర్ లోనే చూడల " అని అన్నాడు అతను ఎద్దవలు అనే సరికి ఎవరూ వినలేదు కదా అని చుట్టూ చూసుకున్నారు, ఆ తర్వాత ముగ్గురు అక్కడే ఒక బెంచ్ దెగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు "ఇంక భాయ్ మా బ్యాచ్ టీచర్లు ఎవరూ ఉన్నారు ఇక్కడ " అని అడిగారు దాంతో బహదూర్ "దేవ్ సార్ ఉన్నాడు, మీరు చదివే అప్పుడు ఉన్న ప్రిన్సిపల్ మేడమ్ ఇప్పుడు కాలేజ్ కీ డైరెక్టర్ అయ్యింది" అని అన్నాడు దానికి కృష్ణ "అది ఏంటి డైరెక్టర్ రత్నం సార్ కదా మేడమ్ మొగుడు" అని అన్నాడు, "మీ బ్యాచ్ అయిపోయిన సంవత్సరం కీ సార్ చనిపోయాడు మేడమ్ డైరెక్టర్ అయ్యింది " అని బదులు ఇచ్చాడు బహదూర్, ఆ తర్వాత శేఖర్ నవ్వుతూ "అవును ఆ భాస్కర్ సార్ ఉన్నాడా" అని అడిగాడు దాంతో ఆ పేరు విని కృష్ణ కూడా పగలబడి నవ్వడం మొదలు పెట్టాడు "ఆ సార్ మీ 10th ఎగ్జామ్స్ ముందు రోజు ఆక్సిడేంట్ అయ్యి తరువాత ఈ కాలేజ్ మానేసి వెళ్లిపోయాడు అవును ఎందుకు నవ్వుతున్నారు" అని అడిగాడు దానికి శేఖర్ ఇంకా గట్టిగా నవ్వుతూ "అది ఆక్సిడేంట్ కాదు మేమే ముసుగు వేసి కోటాం" అని చెప్పి నవ్వుతూ ఉంటే వెనుక నుంచి ఒక గొంతు "హలో cheetah " అని పిలిస్తే శేఖర్ నవ్వు నవ్వి వెనకు తిరిగి "ఎలా ఉన్నారు మేడమ్ " అని అడిగాడు దానికి ఆవిడ "మేడమ్ ఏంట్రా అక్క అని పిలుచు అప్పుడు కాలేజ్ అయిపోగానే సుజాత అక్క అని నా వెంట ఇంటి వరకు వచ్చే వాడివి" అని చెప్పి శేఖర్ నీ హాగ్ చేసుకుంది.

సుజాత శేఖర్ వాళ్ల 10th క్లాస్ టీచర్ పైగా ఆమెకి శేఖర్ అంటే చాలా ఇష్టం అందరి లాంటి కుర్రాడు కాదు కొంచెం విభిన్నమైన కారెక్టర్ క్లాస్ కు రాకపోయిన చదువులో కనీసం పాస్ మార్కులు తెచ్చుకునే వాడు ఆట లో 1st ఎప్పుడు అందరి సంతోషం కోసం ముందు ఉండేవాడు అలా వాడి స్పీడ్ కీ గుర్తుగా వాడిని cheetah అని పిలిచేది సుజాత తన అమ్మ చనిపోయాక తనను అంత ఆప్యాయంగా చూసుకున్నది సుజాత అందుకే ఆమెకు శేఖర్ పెట్ స్టూడెంట్ అయ్యాడు ఆ తర్వాత అందరూ ఆమె వైస్ ప్రిన్సిపాల్ కావడంతో ఆమె రూమ్ కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆమె శేఖర్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఆమెకి ఉన్న జ్ఞాపకాలు ఫొటోలు చూపిస్తూ ముగ్గురు సందడిగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆమె ఒక ఫోటో చూపించి "4 మంకీస్ గ్యాంగ్ ఫోటో" అని చూపింది అందులో శేఖర్, కృష్ణ, ఇంకో ఫ్రెండ్ ప్రసాద్, జునైద్ ఫోటో కూడా ఉంది జునైద్ ఫోటో చూడగానే శేఖర్ నవ్వు చెదిరి పోయింది వాడు చేసిన మోసం గుర్తు వచ్చింది వాడి వల్ల కాలేజ్ ముందు తనకు జరిగిన అవమానం గుర్తుకు వస్తేనే కోపం వచ్చింది కానీ అదుపు చేసుకున్నాడు ఆ తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చి "సార్ కొత్త డిఎస్పి గారు వస్తున్నారు" అని చెప్పాడు దాంతో శేఖర్, కృష్ణ ఇద్దరు బయటికి వెళ్తుండగా "మా బాబు రిటైర్డ్ అయ్యాక ఆ ప్లేస్ లోకి ఎవరూ వచ్చాడు రా" అని అడిగాడు శేఖర్ దానికి కృష్ణ "తేలీదు రా నేను కూడా కొత్త డిఎస్పి జాయిన్ రోజు శైలు డెలివరీ ఉంటే హాస్పిటల్ లో ఉన్న " అని చెప్పాడు ఆ తర్వాత ఇద్దరూ బయటికి వచ్చి చూస్తే అప్పుడే కొత్త డిఎస్పి ఒక లేడి ఆఫీసర్ అని తెలిసి ఆమె వెనకు తిరిగినప్పుడు చూసి షాక్ అయ్యి అలాగే ఉన్నారు ఇద్దరు అప్పుడు ఆ డిఎస్పి వీళ్ల వైపు చూసి శేఖర్ వైపు క్షుణ్ణంగా చూస్తూ "హే చందు" అని వచ్చి హగ్ చేసుకుందీ అది చూసి కృష్ణ గుండె బద్దలు అయ్యింది ఆ తర్వాత తను వెనకు జరిగింది "హయ్ చంద్రిక" అన్నాడు శేఖర్ దాంతో చంద్రిక నవ్వుతూ కృష్ణ వైపు చూసి "అన్నయ్య ఎలా ఉన్నావు" అని అడిగింది దానికి కృష్ణ గుండె మళ్లీ పగిలింది ఆ తర్వాత కానిస్టేబుల్ పిలిస్తే వెళ్లింది చంద్రిక అప్పుడు కృష్ణ శేఖర్ వైపు చూస్తూ "దాంతో బేబి అని పిలిపించుకోవాలి అనుకుంటే అన్నయ్య అని పిలిపించావు కదా రా మిత్ర ద్రోహి" అని అన్నాడు. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: డిటెక్టివ్ చంద్రశేఖర్ (missing black shoes) - by Vickyking02 - 07-09-2020, 07:59 AM



Users browsing this thread: 14 Guest(s)