07-09-2020, 12:21 AM
ఇంతలో గేటు తీసిన శబ్దం రావడంతో లావణ్య వంటగది లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి కిటికీ లోంచి తొంగి చూసింది. వాళ్ళ అత్తయ్య వచ్చిందేమో అని చెప్పి భయపడింది. కానీ వచ్చింది వాళ్ళ మామయ్య అవడంతో రిలాక్స్ గా అనిపించింది ఎందుకంటే ఆయన ఇవన్నీ పట్టించుకోడు. లావణ్య మీద ఆయనకి మంచి నమ్మకం, వాళ్ల మామయ్య లోపలికి రాగానే పంతులు గారిని పరిచయం చేసింది. వాళ్ళ మామయ్య ఆచార్య దగ్గర ఆశీస్సులు తీసుకుని లోనికి వెళ్ళాడు. లావణ్య కి బరువు దిగినట్టు అనిపించింది. ఆచారి కి కూడా అక్కడ ఎక్కువసేపు ఉండటం పద్ధతి కాదు అనిపించి కాఫీ వేగంగా తాగి బయలుదేరాడు. లావణ్య పూర్తిగా రిలాక్స్ అయింది కానీ సోఫా మీద ఇందాక వేసిన జాకెట్ తీయడం మర్చిపోయింది