Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్ (missing black shoes)
#1
దేవరాజ్ కేసు తరువాత శేఖర్, చందన ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్లు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన అర్జున్ పుట్టిన రోజు నీ బాగ సందడిగా చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు అందుకే అమెరికా లో వాడి ఫ్రెండ్స్ మధ్య ఒక amusement పార్క్ లో సౌమ్య, శారదా తో కలిసి బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు (పార్టీ మొత్తం ఖర్చు పెట్టింది సౌమ్య) ఆ తర్వాత పార్టీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ టైమ్ లో సౌమ్య వద్దు అంటున్నా కూడా శారదా తనని తీసుకోని రోలర్ కోస్టర్ కీ తీసుకోని వెళ్లింది అసలే సౌమ్య కీ అలాంటివి అంటే భయం అలా రైడ్ అయిపోయి కిందకి దిగి వచ్చిన తర్వాత సౌమ్య కీ కళ్లు తిరిగి అడ్డు వచ్చిన శేఖర్ పైన vomiting చేసుకుంది దాంతో "సారీ చందు చూసుకోలేదు" అని చెప్పింది, శేఖర్ కూడా పర్లేదు అని చెప్పి ఇద్దరు కలిసి వాష్ రూమ్ కి వెళ్ళి ఇద్దరు క్లీన్ చేసుకుంటున్నారు అప్పుడే లోపలికి చందన అర్జున్ తో సహ వచ్చి ఇద్దరిని అలా చూసి అర్జున్ తో బయటికి వెళ్లుతుంటే శేఖర్, చందన చెయ్యి పట్టుకుని ఆపాలని చూశాడు కానీ చందన చెయ్యి వదిలించుకోని శేఖర్ నీ లాగి కొట్టింది "నువ్వు ఎప్పటికైనా మారుతావు అని ఆశ ఉండేది ఇప్పుడు అది కూడా చచ్చిపోయింది" అని బయటకు వచ్చింది శేఖర్ వెనుకనే వెళ్లుతు "చందు చెప్పేది విను నువ్వు అనుకున్నట్టు కాదు" అని చెప్పాడు కానీ చందన మాత్రం విన్నకుండా వెళ్లింది ఆ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎయిర్ పోర్ట్ కీ వెళ్లి ఇండియా వెళ్లిపోయారు చందన, అర్జున్ ఆ తర్వాత సౌమ్య తో కలిసి శేఖర్ ఇండియా వచ్చాడు ఇంటికి వెళ్లితే చందన లేదు ఆ తర్వాత ఆఫీసు నుంచి సౌమ్య కీ ఫోన్ వచ్చింది చందన ఉద్యోగం కీ రాజీనామా చేసి వెళ్లిపోయింది అని చెప్పారు, ఆ రోజు శేఖర్ ఆఫీసు కీ వెళితే కృష్ణ జరిగింది తెలుసుకొని వచ్చాడు ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుతూ ఉంటే డివోర్స్ నోటీసులు వచ్చాయి అప్పుడే కింద యాక్టింగ్ కాలేజ్ లో "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం" అని పాట వస్తే శేఖర్ "రేయ్ ఎవడు రా ఆ పాట పెట్టింది మార్చు" అన్నాడు దాంతో కింద ఉన్న పిల్లలు DVD ఆఫ్ చేశారు.


కృష్ణ నోటీసులు చూసి "మామ చందన తో నేను మాట్లాడతా" అని చెప్పాడు దానికి శేఖర్ "వద్దు వదిలేయి ఒక రోజు కోపం కే డివోర్స్ దాక వెళ్లింది అసలు అర్థం కూడా చేసుకోవడానికి కనీసం నను అర్థం చేసుకోడానికి కూడా ఆలోచించడం లేదు తను నాతోనే ఉంటే నాకూ ఎప్పుడైనా ఏమైన అయితే తట్టుకోలేదు పైగా ఇప్పుడు నేను డీల్ చేస్తున్న కేసు లో నా వల్ల వాళ్ళకి ఏమైన అయితే రెండో సారి నా వల్ల వాళ్లకు మళ్లీ అన్యాయం జరగకుండా చూడాలి " అని చెప్పి సంతకం చేశాడు డివోర్స్ మీద ఆ తర్వాత ఇద్దరూ అంగీకరించడంతో రెండు నెలల లోనే డివోర్స్ వచ్చాయి పైగా బాబు custody కూడా చందన కే ఇచ్చేశాడు శేఖర్.

ఇది జరిగిన కొద్ది రోజులకు ఒక అతను కేసు పని మీద శేఖర్ దగ్గరికి వచ్చాడు "చెప్పండి సార్ ఏమీ మిస్ అయింది " అని అడిగాడు శేఖర్ "నా కొత్త ఆఫీసు షూ సార్ మిస్ అయ్యింది" అన్నాడు దాంతో శేఖర్ ఒకసారి అతని వైపు చూసి "ఏమీ మిస్ అయ్యింది" అని అడిగాడు దానికి అతను షూ అనగానే "షూ పోయిందా షూ తోనే కోడత పో బయటికి" అన్నాడు శేఖర్ దాంతో అతను భయపడి పారిపోయాడు, అప్పుడే వచ్చిన కృష్ణ "ఏమైంది రా" అని అడిగాడు దాంతో జరిగింది చెప్పాడు అప్పుడు కృష్ణ నవ్వుతూ తన కొత్త షూ కూడా మిస్ అయ్యింది అని చెప్పాడు అప్పుడే న్యూస్ లో ఆర్టికల్ 370 రద్దు గురించి scrolling వచ్చి ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ కాలేజ్ క్లాక్ టవర్ మీద నుంచి కింద పడ్డాడు అని న్యూస్ వచ్చింది అప్పుడు అతని ఫోటో చూపిస్తే ఎడమ కాలు షూ మిస్ అయింది కుడి కాలు షూ డిజైన్ చూసి "అరేయ్ నావి అదే డిజైన్ షూ మిస్ అయ్యింది" అని చెప్పాడు కృష్ణ అప్పుడు శేఖర్ కీ అర్థం కాలేదు ఆ టివి లో షూ డిజైన్ చూసి "నీ కాలు సైజ్ ఎంత" అని అడిగాడు అప్పుడు కృష్ణ 9 అని చెప్పాడు ఆ తర్వాత టివి లో కూడా అదే సైజ్ ఉంది ఇందాక వెళ్లిన అతని visiting card టేబుల్ కింద పడి ఉంది దాంతో అతనికి ఫోన్ చేసి అతని సైజ్ కనుకున్నారు అతను 9 అని చెప్పాడు.

దాంతో శేఖర్ ఆలోచన లో పడ్డాడు ఒకటే డిజైన్ ఒకటే సైజ్ ఒకటే కలర్ షూ ఎందుకు మిస్ అవుతున్నాయి అని దాంతో ఈ కేసు కొత్త ఛాలెంజ్ ఇస్తుంది అని ఇన్వెస్టీగేషన్ మొదలు పెట్టడానికి కాలేజ్ కీ వెళ్లాలి అని డిసైడ్ అయ్యాడు శేఖర్. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
డిటెక్టివ్ చంద్రశేఖర్ (missing black shoes) - by Vickyking02 - 06-09-2020, 08:09 AM



Users browsing this thread: