Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
#42
మహేష్ ......... కృష్ణ వాళ్లకు ఎక్కడ చదవాలని ఉంది . 

సర్ అదీ అదీ ............
సర్ :  తడబడుతున్నావు అంటే వైజాగ్ టాప్ కాలేజ్ లో అన్నమాట . చెప్పానుకదా ఫీజ్ ఎంతైనా భరిస్తాను  . అప్లై చేసి వెంటనే కౌన్సిలింగ్ కు రెడీ ఐపోండి .

ముగ్గురూ సాధించిన టాప్ రాంక్స్ వలన ఒకే కాలేజీలో మేము కోరుకున్న ***** కాలేజ్ లోనే సీట్స్ లభించాయి . 
జాయింగ్ రోజు సర్ మావెంటే వచ్చారు . కాలేజ్ ప్రిన్సిపాల్ ....... సర్ ను చూసి వారే వచ్చి మాట్లాడించారు ( ఎందుకంటే కాలేజ్ లో జరిగిన ఈవెంట్స్ అన్నీ చేసింది మేమే).
సర్ : చేతులు కలిపి మా పిల్లలు స్పెషల్ కేర్ తీసుకోవాలి అనిచెప్పారు .
ప్రిన్సిపాల్ : మీరు ఎంతచేశారు - ఆ మాత్రం చెయ్యలేనా అని చేతులుకలిపి , కృష్ణ సూరి రవి అని పేర్లు తెలుసుకుని ర్యాంక్ కార్డ్స్ చూసి సంతోషంతో hi hi hi ........ అని పలకరించి , కాలేజ్ లో ఎటువంటి ప్రాబ్లం తలెత్తినా నేరుగా నా ఆఫీస్ కు వచ్చెయ్యండి . మనం మళ్లీ కలుద్దాము ఫస్ట్ డే కదా బిజీ బిజీ ..........
సర్ : అవును సర్ ......... ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి కలుస్తాను క్యారి ఆన్ సర్ అనడంతో , నా ఫ్రెండ్స్ చేతులను మళ్లీ కలిపి మా కాలేజ్ స్థాయిని పెంచాలి అని వెళ్లిపోయారు .

ముగ్గురికీ నాలుగేళ్లకూ కట్టాల్సిన ఫీజ్ ను ఒకేసారి పెద్దమొత్తంలో పే చేసేసి , మహేష్ ok నా అని రిసిప్ట్ అందించారు .
చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో చేతులెత్తి మొక్కాను . 
సర్ : మహేష్ .......... నువ్వు త్యాగం చేసినదానితో పోలిస్తే ఇది ఏపాటికి , నువ్విచ్చిన కాన్ఫిడెన్స్ వలన మన కంపెనీ రోజురోజుకూ ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూనే ఉంది - నా కొడుకు అక్కడ హ్యాపీగా చదువుతున్నాడు - మీ అక్కయ్య పెళ్లి ఏ ఆటంకాలూ లేకుండా బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ కొడుకుతో జరగబోతోంది . మీ అక్కయ్య ప్రక్కన మీరు నిలబడి పెళ్లి అంగరంగవైభవంగా జరిగేలా చూడాలి .
అక్కయ్య .......... ఆ పిలుపే ఎంత తియ్యగా ఉంది . ధూమ్ ధామ్ చేసేస్తాము సర్ అని అంతులేని ఆనందాన్ని పొందుతూ చెప్పాము . ఆరోజే నేను govt డిగ్రీ కాలేజ్ లో చేరాను .

నెక్స్ట్ రోజు నుండి ముగ్గురూ ఇంజనీరింగ్ కాలేజ్ కు - నేను డిగ్రీ కాలేజ్ కు వెళ్ళాము.
అక్కడకూడా అమ్మాయిలవైపు కన్నెత్తికూడా చూసేవాణ్ణి కాదు . నేను మధ్యాహ్నం - నా ఫ్రెండ్స్ ముగ్గురూ సాయంత్రం వచ్చి వర్క్ లో జాయిన్ అయ్యేవాళ్ళు . 
మూడేళ్లలో నా డిగ్రీ పూర్తయ్యేటప్పటికి సర్ అన్నట్లుగానే కోట్లలోకి చేరింది మా కంపెనీ , ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . సర్ ఆనందించినా ప్రతిసారీ మా స్థాయి జీతం పెరుగుతూనే వెళుతోంది . దానిలో సగం అమౌంట్ ను వార్డెన్ అకౌంట్ లోకి మనసారా వేసేవాళ్ళము . లైఫ్ బిజీ ఉన్నా పండగలకు గిఫ్ట్స్ తో వెళ్లి అక్కడ ఆనందాన్ని చూసి మురిసిపోయేవాళ్ళము . మా ఫేవరేట్ ఫుడ్ తినేసే వచ్చేవాళ్ళము .
అలా మరొక సంవత్సరం కూడా గడిచింది . 
 కృష్ణ : రేయ్ మామా .......... రేపే క్యాంపస్ ఇంటర్వ్యూ , ఇప్పటికైనా ఒట్టు తీసేయ్యరా మనమంతా ఓకేదగ్గర ఉందాము . 
రేయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళుతున్నారురా బెంగళూరుకే కదా , నైట్ ట్రైన్ ఎక్కితే ఉదయం కలుస్తాము , వారం వారం కలుద్దాము all the best అని సంతోషంతో కౌగిలించుకున్నాను . కావాలంటే కొన్నేళ్ళు బాగా సంపాదించిన తరువాత ఇక్కడికే వచ్చెయ్యండి మళ్లీ మన కంపెనీలో స్టార్టింగ్ నుండి మొదలెడదాము నెలకు వెయ్యి వచ్చినా చాలు . 

సర్ : చప్పట్లతో నవ్వుతూ వచ్చి అంతే మహేష్ .......... కృష్ణ రవి సూరి all the best. రేపు మీరు ఇంటర్వ్యూలో ఎంతైతే ప్యాకేజీ కొడుతున్నారో అంతే సాలరీ మహేష్ కు ఇస్తాను . మంచి స్థాయిలో కూర్చోబెడతాను .
అంతే ముగ్గురి పెదాలపై అంతులేని సంతోషంతో థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ అని వెళ్లి బుక్స్ తీసి చదువుతూ కూర్చోవడం చూసి , నవ్వుకుని అయితే నేను పెద్ద అమౌంట్ ఫిక్స్ అయిపోతాను .
సర్ .........  
సర్ : మహేష్ ........ ఇది ఫిక్స్ అంతే అని కిందకువెళ్లారు .

నెక్స్ట్ రోజు రెడీ అయ్యి అమ్మవారి ఫోటోదగ్గరకువెళ్లి , అమ్మా .......... మాకోసం కాదు వాడు ఎలాగో మిమ్మల్ని పూజించడు కాబట్టి మేము ప్రార్థిస్తున్నాము . మాకు హైయెస్ట్ ప్యాకేజీ రావాలి - తెలుసుకదా మాకు ఎంతో వాడికి అంత . మేము వెళ్ళిపోయాక ( మేము ఇక్కడే వాడితోనే ఉండాలని ఉంది కానీ ఒట్టు వేసేసాడు వెధవ ) వాడిని ఒంటరిని చెయ్యకండి - వాడి లైఫ్ లో మ్యాజిక్ జరిగేలా చూడండి అని ముగ్గురూ ప్రార్థించారు .
రేయ్ .......... ఎవరిని అడుగుతున్నారు అని నవ్వుకుని , రేయ్ .......... మీరు అక్కడ హ్యాపీ అయితే నేను ఇక్కడ చాలా హ్యాపీ రా ........ , ఎందుకు పాపం అమ్మవారిని ఇబ్బందిపెడతారు . ఏదైనా కష్టపడి సాధించుకుందాము రండి రండి రండి కాలేజ్ కు ఆలస్యం అవుతోంది అని వెళ్ళాము . 
సూరికి 15 lakhs - కృష్ణ రవిలకు 12 - 12 lakhs పర్ ఇయర్ ప్యాకేజీ సాధించి , సంతోషంతో వచ్చి ముందుగా సర్ కు చెప్పారు . 
సర్ : కంగ్రాట్స్ చెప్పి , మొబైల్ తీసి రేయ్ ......... మహేష్ కు 15 lakhs పే ఫామ్ రెడీ చెయ్యండి అనిచెప్పారు .

కృష్ణ , సూరి , రవి .......... సంతోషమైన షాక్ లో ఉండిపోయారు .
సర్ ..........
సర్ : మహేష్ .......... నా అదృష్టమైన మీకు మాటిచ్చి తప్పమంటారా ? , తెలుసుకదా మాటిస్తే ............, కృష్ణ ........ హ్యాపీనా అని అడిగారు .
ముగ్గురూ : చాలా అంటే చాలా సర్ , ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగా బెంగళూరు వెళతాము అని నన్ను కౌగిలించుకున్నారు . రేయ్ మామా ......... నెక్స్ట్ వీక్ ఫైనల్ exams , అవ్వగానే నెక్స్ట్ డే జాయిన్ అవ్వాలి అని చూయించారు . 
లవ్ యు ఫ్రెండ్స్ అని సర్ కారులోనే వెనుతిరిగాము .

సర్ : డ్రైవ్ చేస్తూ , మహేష్ ........ నీ ఫ్రెండ్స్ వెల్లెలోపు కార్ డ్రైవింగ్ నేర్చుకో కార్ కీస్ టేబుల్ పై ఉంటాయి అనిచెప్పారు .
Yes సర్ ........... మాకు జీవితాన్ని ప్రసాదించిన మీకు రథసారథిగా ఉంటాను .
సర్ : మహేష్ .......... ఇంకెప్పుడూ అలా మాట్లాడకు , డ్రైవింగ్ నేర్చుకోమన్నది సొంత కారు ఎంజాయ్ చెయ్యడానికి సరేనా అన్నారు . 
Yes సర్ అని బయటకు చూస్తూ , రేయ్ మామా రేయ్ మామా .......... బెంగళూరులో ఇలాంటి అపార్ట్మెంట్ లోనే ఉండాలిరా మీరు అని వైజాగ్ లోనే రిచెస్ట్ టాప్ స్టార్ రేటింగ్ అపార్ట్మెంట్స్ వైపు చూయించాను . నేను వీక్లీ వచ్చి ఒకరోజు ఎంజాయ్ చేస్తాను . 
కృష్ణ : నీకోసమైతే ఫిక్స్ రా అన్నాడు . 
సూరి : సర్ సర్ సర్ కాస్త నెమ్మది , 1 2 3 ........11 ....... 14 15 ........ 15 ఫ్లోర్స్ రా .......... అలా 4 బిల్డింగ్స్ అద్భుతంగా ఉన్నాయి . బయటే ఇలా ఉంటే లోపల హౌసెస్ ఎలా ఉంటాయో , కనీసం మనల్ని గేట్ దాటనిస్తారో లేదో అని దాటివెళ్లిపోతున్నా కన్నార్పకుండా తొంగి తొంగి చూస్తున్నాడు . 
సర్ : సూరి .......... two weeks తరువాత అక్కడే మనం అపార్ట్మెంట్స్ ఆనివర్సరీ ఈవెంట్ చెయ్యబోతున్నాము . గేట్ లోపలికి ఏంటి - మొత్తం చుట్టేయ్యడానికి కూడా పర్మిషన్ ఇచ్చేస్తారు - మీవలన మన కంపెనీ రేంజ్ అది .
సూరి : కేక సర్ .......... యాహూ అని కార్ టాప్ లేచిపోయేలా కేకలువెయ్యడం చూసి సర్ తోపాటు నవ్వుకున్నాము .

మేము వద్దన్నా .......... వెంకట్ అన్నను పంపించి వారం రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకునేలా చేశారు సర్ .
ఫైనల్ exams స్టార్ట్ అయ్యాయి . ముగ్గురూ ప్రార్థించబోతుంటే ఆపి రేయ్ మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు అవసరం లేదురా ..........
కృష్ణ : అమ్మా .......... వాడికి మాకంటే భక్తి ఎక్కువ మీకు తెలియంది కాదు . మేము బెంగళూరు వెళ్లే సమయం దగ్గరపడుతోంది వాడిని మీరే చూసుకోవాలి . 
నన్ను నన్ను అని నవ్వుకుని , రండిరా అని లాక్కుని కిందకువెళ్లాము . 
సర్ : కీస్ నావైపు విసిరి , కారులో వెళ్ళండి అన్నారు . మహేష్ .......... నిన్నూ వెళ్ళండి .
రోజూ వాళ్ళను కారులో పిలుచుకొనివెళ్లి తీసుకొచ్చేవాడిని . Exams కూడా పూర్తయ్యాయి . 
ముగ్గురూ : రేయ్ మామా .......... రెండురోజుల్లో జాయిన్ అవ్వాలని మెయిల్ వచ్చింది రేపే ప్రయాణం అని బాధతో చెప్పారు .
Wow సూపర్ రా అని కౌగిలించుకుని వెంటనే తత్కాల్ లో టికెట్స్ బుక్ చెయ్యబోతుంటే , 
సర్ : మహేష్ .......... ఆగు , అపార్ట్మెంట్ ఫంక్షన్ రేపు సాయంత్రం . సూరి కోరిక కూడా తీర్చుకుని వెళతాడులే ..........
సర్ ........... 
సర్ : అర్థమైంది ఆలస్యం అవుతుందనే కదా ......... అని ఆఫీస్ రూంలోకివెళ్లివచ్చి , ఇదిగో ఫ్లైట్ టికెట్స్ రేపు రాత్రి 12 గంటలకు ఫ్లైట్ గంటలో వెళ్ళిపోయి ఈ హోటల్లో రెస్ట్ తీసుకోవచ్చు అని హోటల్ కూడా బుక్ చేసిన పేపర్స్ అందించారు .
నలుగురమూ : సర్ .........
సర్ : మహేష్ , కృష్ణ ........... నో సెంటిమెంట్ అని నవ్వడంతో కళ్ళల్లో చెమ్మతోనే నవ్వాము . 
Like Reply


Messages In This Thread
RE: పేదరాసిపెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-09-2020, 05:02 PM



Users browsing this thread: 13 Guest(s)