Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
#36
అన్నయ్యలూ ........... ఈ డబ్బు బుజ్జాయిల బుక్స్ కోసం please మమ్మల్ని పోనివ్వండి అని ఎంత బ్రతిమాలినా వినకుండా మా జేబులలోని డబ్బుని తీసుకుని చూసి మా జేబులన్నీ వెతికి ఇంతేనా ఏదో లక్షలు అన్నట్లు బిల్డప్ ఇచ్చారు కదరా అని నెత్తిపై కొట్టి వెళ్లండ్రా వెళ్ళండి కనీసం మందు బాటిల్ కైనా ఇచ్చారు . 
థాంక్స్ అన్నయ్యలూ అని ఆటోలోని పార్సిళ్లను అందుకోవడం చూసి కొంపదీసి అందులో ఉన్నాయా అని మాచేతులలోనుండి అందుకొని చూసి ఫుడ్ రా అని కింద పడెయ్యబోయారు  . 
అన్నయ్యా ......... డబ్బు తీసుకున్నారు ok - కొట్టారు ok ......... అది ఎంతోమంది పిల్లల ఆకలి తీరుస్తుంది వద్దు వద్దు అనిచెబుతున్నా కూడా పోండిరా పోండి అని తోసేసి , రేయ్ స్వీట్స్ మనమేమిచేసుకుంటామురా అని రెండు పార్సిళ్లను కిందకుపడేసి కాళ్లతో తొక్కి మళ్లీ ఆటోలోనుండి అందుకోబోయారు . చూసి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసి కోపంగా మారి రేయ్ అంటూ నలుగురమూ చేతులుకలిపి మైకంలో ఉన్న వాళ్ళమీదకు ఎక్కేసి వెంట్రుకలు లాగి ఆకలి గురించి మీకేమీ తెలుసురా అని తలపై పిడిగుద్దులు గుద్దడంతో ముగ్గురూ కుప్పకూలారు . కన్నీళ్ళతో కిందపడిన స్వీట్స్ ను కవర్లలో ఎత్తుకుని ఆటోలోనివి తీసుకున్నాము . 

తమ్ముళ్ళూ .......... భయంతో ఎలాగో మీకు హెల్ప్ చెయ్యలేకపోయాను . డ్రాప్ చేస్తాను రండి అని అన్నింటినీ ఎలాగోలా వెనుక ఆటోలో సర్దాము . ఒక్కనిమిషం అని భయపడుతూనేవెళ్లి వాళ్ళ జేబులోని డబ్బుని తీసుకొచ్చి అందించారు . మా 10 వేలు మాత్రమే తీసుకుని అన్నయ్యా ......... మీకే అని జేబులో ఉంచేసి , నలుగురికీ సమానంగా పంచి , ఆటోని పట్టుకుని బయట నిలబడి శరణాలయం చేరుకున్నాము . లోపలకు అన్నయ్య కూడా తీసుకొచ్చారు . థాంక్స్ చెప్పడంతో నేనే థాంక్స్ చెప్పాలి అని వెళ్లిపోయారు . 

వరండాలో చెక్క మంచం పై పడుకున్న వార్డెన్ దగ్గరికివెళ్లి వార్డెన్ వార్డెన్ ........ అని నెమ్మదిగా లేపాము . 
వార్డెన్ : మహేష్ కృష్ణ .......... వచ్చారా అని లేచి లైట్ న్ చేసి మాదెబ్బలను చూసి ఏమైంది అని కంగారుపడ్డారు . 
అదేమీ లేదు వార్డెన్ అని జరిగింది వివరించాము . 
వెంటనే లోపలికివెళ్లి డెటాల్ కాటన్ తీసుకొచ్చి అందించారు . 
వార్డెన్ ఈరోజు సంపాదన అని నా 2500 /- వార్డెన్ చేతికి అందించాను . ముగ్గురూ కూడా ఇచ్చేసారు . 
వార్డెన్ : బుజ్జాయిలకు మీరే ........
వార్డెన్ అవన్నీ మాకెలా తెలుసు మాకు అన్నీ మీరే , ఆకలేస్తోంది మన అందరికోసం సర్ వాళ్ళు భోజనం పంపించారు . అన్నయ్యలూ - తమ్ముళ్లూ ......... తిన్నారా ? 
వార్డెన్ : ఉద్వేగంతో మా నలుగురినీ హత్తుకుని , భోజనంలో బల్లి పడటం వలన అందరూ నీళ్లు తాగి పడుకున్నారు . 
అవునా అంటూ పరుగున అందరిదగ్గరికీ వెళ్ళాము . ఆకలివలన అమ్మా అమ్మా ...... అంటూ నిద్రపట్టక కడుపులపై చేతులను పట్టుకుని అటూ ఇటూ కదులుతున్నారు . 

చూసి చలించి నలుగురమూ కన్నీళ్లను కారుస్తూ వెళ్లి అన్నయ్యలూ - తమ్ముళ్లూ ....... వార్డెన్ మనకోసం ఫుడ్ తీసుకొచ్చారు లేవండి అని లేపి బుజ్జాయిలను ఎత్తుకొనివెల్లి అందరి ప్లేట్లలో వడ్డించాము .
 ఒకరినొకరు వెలిగిపోతున్న కళ్ళతో చూసుకుని , వార్డెన్ ......... ఇలాంటి భోజనం తినడం ఫస్ట్ టైం అని నాన్ వెజ్ స్వీట్స్ fruits ......... మ్మ్మ్.....మ్మ్మ్...... అని ఆకలికి మించి తిన్నారు . వార్డెన్ ఈరోజుని ఎప్పటికీ మరిచిపోము లవ్ యు అని హత్తుకుని పాదాలను తాకి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లారు . 
వార్డెన్ : మహేష్ ......... నేనని ఎందుకు చెప్పారు . 
వార్డెన్ .......... మీరుకాక ఇంకెవరు రండి ముందు తిందాము అని మిగిలినవి ఆవురావురుమంటూ కళ్ళల్లో చెమ్మతో తిన్నాము .
వార్డెన్ : మాకోసం మీరుకూడా తినలేదు కదూ ......... మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు . 
మనపై ఆ దేవుడికి కరుణ లేదు వార్డెన్ , ఈరోజు జరిగిన సంఘటనలను బట్టి మన కోరికలను మనమే కష్టపడి తీర్చుకోవాలని అర్థమైంది . ఇన్ని సంవత్సరాలూ ప్రార్థించి ప్రార్థించి అలసిపోయాము అని మా ప్లేట్లను కడిగేసి అలసిపోయాము వార్డెన్ ఉదయమే లేచి చదువుకోవాలి అనివెల్లి అందరితోపాటు వాలిపోయాము . ఇంతమంది ఆకలి తీర్చినందుకు చాలా ఆనందం వేస్తోంది ఒక కిక్కు ఉంది అని పెదాలపై చిరునవ్వుతో దోమలను కొట్టుకుంటూ హాయిగా హ హ ....... పడుకున్నాము .

రాత్రంతా నాదేవత గురించే మధురమైన కలలు . తెల్లవారకముందే లేచి బుక్ తీసుకుని శరణాలయం బయటకువెళ్లి స్ట్రీట్ లైట్ కింద చదువుతూ , ఆ రోజు న్యూస్ పేపర్ రాగానే అందుకుని ఆతృతతో పేపర్ మొత్తం తిరగేసి డిస్ట్రిక్ట్ హెడ్లైన్స్ లో మిస్ వైజాగ్ అని కిరీటం తో ఉన్న నాదేవత ఫోటోచూసి పెదాలపై చిరునవ్వుతో పరవశించి , ఎవ్వరూ లేకపోవడం చూసి ఫోటో కట్ చేసుకుని , పేపర్ ను రోజూ ఉంచే స్థానంలో ఉంచేసి లోపల వరండాలో చదువుతూ కూర్చున్నాను . 
కొద్దిసేపటి తరువాత నా ఫ్రెండ్స్ లేచివచ్చి , చదువుకోవడానికైతే రోజూ లేపేవాడు కదా  ఈరోజు ఏంటి ఒక్కడే చదువుతున్నాడు అని దూరంగా గాలికి కదులుతున్న పేపర్ ను చూసి వెళ్లి పేపర్ కట్ చేసి ఉండటం చూసి , 
రేయ్ కృష్ణా ......... నిన్న నువ్వు చెప్పినది నిజమేరోయ్ , మనోడి బండి కదిలింది అని సూరి చెప్పాడు .
కృష్ణ : ష్ ష్ ష్  ............. రాత్రికి సర్ప్రైజ్ తో వాడిని ఆటపట్టిద్దాము అని ముసిముసినవ్వులు నవ్వుకుని , నాదగ్గరికి వచ్చి వాళ్ళల్లో వాళ్లే నవ్వుకుంటూ చదువుతున్నారు . 
నేనైతే దించిన తల ఎత్తనేలేదు . 

లైట్ గా ఉప్మా తినేసి కాలేజ్ కు వెళ్ళాము . నిన్న రాత్రి పడుకోవడం ఆలస్యమైనా నిన్న అలసిపోయినా కాలేజ్లో మరింత ఉత్సాహంతో క్లాస్సెస్ విన్నాము - ప్రతి క్లాస్ పూర్తవగానే నా దేవత ఫోటోని చూసి ఆనందించేవాడిని - ఇరువైపులా ముసిముసినవ్వులు వినిపించేవి చూస్తే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు . 4 గంటలకు శరణాలయం కు వచ్చి ఫ్రెష్ అయ్యి నా దేవత ఫోటోని ట్రంక్ లో జాగ్రత్తగా ఉంచేసి , వార్డెన్ కు చెప్పి కంపెనీకి చేరుకున్నాము . నేరుగా సర్ వాళ్ళ ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళాము . వెంకట్ అన్నయ్యా ......... సర్ వాళ్ళను కలవచ్చా అని అడిగాను . 
ఒక్కనిమిషం అని లోపలికివెళ్లివచ్చి వెళ్ళండి అని పంపించారు . 
Hi మహేష్ , కృష్ణ .......... ఈరోజు ఇక్కడే పని .
OK సర్ .......... నిన్నదానిగురించి మీకు థాంక్స్ చెబుదామని వచ్చాము అని రాత్రి అందరూ తృప్తిగా తిని హాయిగా నిద్రపోవడం గురించి చెప్పాను . 
మహేష్ .......... మాకు కూడా కాస్త పుణ్యం దక్కిందన్నమాట అని నవ్వుకున్నారు . 

వెళ్లి వర్క్స్ అలాట్ చేసే సర్ దగ్గరికివెళ్లాము . 
మహేష్ నిన్నట్లానే నువ్వు మీ సర్ దగ్గరే ఉండు - కృష్ణ , రవి , సూరి ........ మీరు లోపల నిన్నటి షో ఎడిటింగ్ జరుగుతోంది వాళ్లకు కావాల్సినవి అందించండి .
కృష్ణ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ సర్ మాకు కావాల్సింది కూడా అదేనని మురిసిపోయారు . 
సర్ : తమ్ముళ్లూ ......... ఇక నుండి మీకు నెలనెలా జీతం ఇస్తారు సర్ . ఒక్కరోజులోనే మీరు పర్మనెంట్ అయిపోయారు . మధ్యలో డబ్బు అవసరమైతే అడగండి మరియు మనం చేసే ప్రతి ఈవెంట్ కు స్థాయిని తగ్గట్లు బోనస్ కూడా వస్తుంది . 
సర్ మాటలకు సంతోషంలో షాక్ కొట్టినట్లు అలా నిలబడిపోయాము . 
సర్ : మహేష్ , కృష్ణా ......... అని భుజాలను కదపడంతో స్పృహలోకొచ్చి నలుగురమూ కౌగిలించుకుని ఎవరి పని దగ్గరకు వాళ్ళము వెళ్లిపోయాము . 

ఆరోజు 9 గంటలకే పనులు పూర్తవ్వడంతో సర్ వాళ్ళు వెళ్ళమని చెప్పారు . 
గుడ్ నైట్ చెప్పేసి బయలుదేరాము . రేయ్ కృష్ణా ......... ఏంటిరా ఆ కవర్ .
కృష్ణ : వేస్ట్ వైట్ పేపర్స్ లేరా , సర్ ఇచ్చారు అని ఉత్సాహంతో చిందులేస్తూ శరణాలయం చేరుకుని , నా దేవతను గుండెలపై హత్తుకుని మళ్లీ దాచేసి , అన్నం పప్పు తిని అందరి పిల్లలతోపాటు చదువుకోవడానికి కూర్చున్నాము . 
అన్నయ్యలు తమ్ముళ్ళంతా ఒక్కొక్కరే వెళ్లి నిద్రపొయారు . చివరగా మేము నలుగురము మిగిలాము .
కృష్ణ : రేయ్ మామా ......... పాస్ అనిచెప్పి ముగ్గురూ వెళ్లి 15 నిమిషాలకు వచ్చారు.
చదువుకుంటున్న నా పుస్తకం పై గిఫ్ట్ ఉంచారు .
ఫ్రెండ్స్ ..........
మా ప్రాణమైన మిత్రుడికోసం .......... చూడరా అన్నారు .
థాంక్స్ రా అని బాక్స్ ను చెవిదగ్గర కదిలించి ఏముందిరా అని ముగ్గురితోపాటు నవ్వుకుని , గిఫ్ట్ కవర్ చిరిగిపోకుండా వేరుచేసి బాక్స్ ఓపెన్ చేసాను . వజ్రాల యువరాణీ కిరీటం ధరించి ఆనందబాస్పాలతో చిరునవ్వులు చిందిస్తూ చేతిలో ఫ్లవర్స్ తో నిలబడిన ఫోటో , చెక్ అందుకుంటున్న ఫోటో , రెండు చెక్కులూ తిరిగి ఇచ్చేస్తున్న ఫోటో , మైకుతో మాట్లాడుతున్న ఫోటో , వజ్రాలు పొదిగిన లెహంగాలో వాక్ చేస్తున్న ఫోటో , వాక్ చేస్తున్న ఫోటో , వాక్ చేస్తున్న ఫోటో , స్టేజి చివరికివచ్చి ముద్దుపెడుతున్న ఫోటో , వెనక్కు తిరిగి వెళుతున్న ఫోటో , తిరిగి వెళుతున్న ఫోటోలు ........... అన్నీ 4k డిజిటల్ ఫోటోలు చూసి నా కళ్లల్లో ఆనందబాస్పాలతో పరవశించిపోతున్నాను . 
కృష్ణ : రేయ్ మామా .......... మాకు నిన్ననే తెలుసు మేము చూసాము . ఇక ఉదయం పేపర్ కట్ అవ్వడం చూసి ఫిక్స్ అయిపోయాము . కాలేజ్లో తమరు పేపర్ చూసి మురిసిపోవడం చూసాములే , సర్ వాళ్ళు ఎడిట్ చేస్తుంటే అడిగి కాపీలు తీసుకున్నాము . ఎందుకు అని అడిగారు - ఏమి చెప్పాలో తెలియక సిగ్గుపడ్డాము . OK ok చెప్పకండి మీకోసం ఆ మాత్రం చేయలేమా ......... మీరుకూడా ఇప్పుడు కంపెనీ ఎంప్లాయిస్ మీరు ఏది కోరితే అది ఇవ్వడం మా బాధ్యత అని ఇచ్చారు . రేయ్ ఇంకా ఉన్నాయి చూడరా అని నాదేవత సైడ్ కు తిరిగిన ఫోటో వెనుకాలే , నాదేవత ప్రక్కనే నేను - నా దేవత నన్ను చూసి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన ఫోటో - నాకోసం వెనక్కు తిరిగిన ఫోటో - నేను కనిపించకపోయేసరికి నిరాసపడిన ఫోటోలను చూసి లవ్ యు లవ్ యు లవ్ యు రా అని ఫోటోలన్నింటినీ నా గుండెలపై హత్తుకుని మురిసిపోయాను . 
కృష్ణ : రేయ్ మామా ........ ఇంకా చూడు అన్నారు . 
చూస్తే పేపర్ ఉంది , ఓపెన్ చేసి చూస్తే అడ్రస్ ఉంది . రేయ్ మామా .......... నా దేవత అడ్రస్ ............ 
కృష్ణ : అవునురా ............ సర్ తో తీసుకున్నాము . దేవత .......... అని కవ్వించారు .
ఫోటోలను మళ్లీ మళ్లీ చూసి మైమరిచిపోతుండటం చూసి , రేయ్ ........ వాడు ఇక గాలిలో తేలిపోతుంటాడు మనం వాడిని డిస్టర్బ్ చెయ్యకుండా చదువుకుందాము అని నవ్వుకున్నారు . 
ఫోటోలనూ - అడ్రస్ ను పదే పదే చూస్తూ goddess goddess ......... అని ముద్దులుపెడుతూ హృదయానికి హత్తుకుని మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది - రేయ్ మామా ......... నాదేవతను వెంటనే చూడాలని ఉంది .
సూరి : ఇప్పుడా 11 గంటలు దాటింది . 
రేయ్ రేయ్ .......... చూడకపోతే పిచ్చెక్కేలా ఉందిరా - హృదయం ఆగిపోతుందేమో ..............
రేయ్ రేయ్ ......... అంటూ ఆటపట్టించి గిలిగింతలు పెట్టి , అందరూ నిద్రపోతుండటంతో ష్ ష్ ష్ ........ అని సైలెంట్ అయిపోయాము . 
కృష్ణ : ఏది అయితే అది పదరా వెళదాము అని బుక్స్ అన్నీ లోపల ఉంచేసి , గిఫ్ట్ బాక్స్ తోపాటుగా , వార్డెన్ కు తెలియకుండా గేట్ దూకాము . అరగంటలో స్ట్రీట్ చేరుకుని అడ్రస్ వెతికి పట్టుకునేసరికి అర్ధరాత్రి అయ్యింది . 
కృష్ణ : రేయ్ మామా ఇదేరా అని మా అనాథ శరణాలయం ప్లేస్ అంత పెద్ద బిల్డింగ్ ను చూసి ఆశ్చర్యపోయాము .
నాదేవత ఉండాలంటే ఈమాత్రమైనా ఉండాలి అని ఆనందించి గేట్ దగ్గర ఇద్దరు సెక్యూరిటీ ఉండటం చూసి నా దేవత సేఫ్ అనుకున్నాను . రేయ్ మామా ఎలారా ............ 
కృష్ణ : డోంట్ వర్రీ అని గోడ వెంబడి చివరకు వెళ్లి నలుగురమూ ఒకరినొకరము సహాయం చేసుకుని మా రెండింతలు ఉన్న గోడను ఎక్కి చప్పుడు చెయ్యకుండా దిగి పూల మొక్కల వెనుక దాగుతూ మెయిన్ డోర్ దగ్గరికివెలితే బయట లాక్ చేశారు .        
నేను నిరాశపడటం చూసి రేయ్ మామా .......... ఎక్కడికైనా వెల్లారేమో రా రేపు వచ్చేస్తారులే లంచ్ టైం లో వద్దాము అని ఎలా వెళ్ళామో అలా శరణాలయం చేరుకున్నాము . 
రేయ్ మామా ......... నాదేవత రేపు కనిపిస్తారుకదూ అని సిగ్గుపడి , దుప్పటిని బయటకు తీసుకొచ్చి ఆటస్థలం మధ్యలో పరిచి వాలిపోయి , బాక్స్ ను నా గుండెలపై హత్తుకుని నిండు చంద్రుడిని చూసి , చందమామా ......... నా దేవత ఎక్కడున్నా మీరు చూస్తుంటారుకదా ఎలా ఉన్నారు ఏమి చేస్తున్నారు - ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అని మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రుడిలో నా దేవత ప్రతిరూపాన్ని చూసుకుని ఆనందిస్తూ నిద్రపోయాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసిపెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-09-2020, 04:56 PM



Users browsing this thread: 35 Guest(s)