Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
#35
యాంకర్ స్టేజీమీదకు వెళ్లి that was awesome కదా ........... i enjoyed a lot .......... మేముకూడా అంటూ అందరూ సంతోషంతో చప్పట్లుకొట్టారు . అందరూ తమ తమ అందాలతో వైజాగ్ సౌందర్యాన్ని మరింత పెంచారు అనడంలో సందేహం లేదు . దానికి సాక్ష్యం మీ ఉత్సాహమే ............

అందరూ అందంతో ఒకరినిమించి మరొకరు పోటీపడ్డారు . అందులోనుండి మిస్ వైజాగ్ కిరీటం కైవసం చేసుకునే అర్హతగల ముగ్గురు ఏంజెల్స్ ను స్టేజీమీదకు ఆహ్వానించవలసినదిగా మిస్ వైజాగ్ స్పాన్సర్స్ ను స్టేజీమీదకు ఆహ్వానిస్తున్నాము అనిచెప్పడంతో హాల్ మొత్తం కేరింతలు . 
ఆ ముగ్గురిలో నా దేవత ఉండాలి నా దేవత ఉండాలి అని దేవుళ్లను ప్రార్థించాను . 
ఫస్ట్ మోడల్ ******** 
చప్పట్లు 
సెకండ్ మోడల్ 
చప్పట్లు , నా టెన్షన్ ఆంతకంతటికీ తారాస్తాయిని చేరుతోంది .చెమటలు పట్టేసాయి .
థర్డ్ మోడల్ థర్డ్ మోడల్ ......... మిస్ కావ్య .
అందరితోపాటు నేనుకూడా చప్పట్లుకొట్టి సంతోషంతో థాంక్స్ గాడ్ థాంక్స్ గాడ్ అని మొక్కాను . 
నాదేవత స్టేజి చివరకు వస్తూ నేనున్న ప్లేస్ లో చూస్తుంటే , వొళ్ళంతా తియ్యని జలదరింపుతో అంతులేని ఆనందంతో కనిపిద్దామని స్టేజి లైట్ వెలుగులోకి వెళుతుంటే , 
సర్ : మహేష్ ........... విన్నర్ అనౌన్స్ చేయగానే , అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా ఏర్పాట్లు రెడీగా ఉన్నాయోలేదో చూసిరమ్మని పంపించారు .
Yes సర్ అంటూ నాదేవతనే చూస్తూ పరుగునవెళ్లి ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అన్నయ్యలను కలిసి , రెడీ అని తెలుసుకుని పరుగునవచ్చి సర్ అంతా రెడీ సర్ అనిచెప్పాను . 
సూపర్ మహేష్ .......... ఇంతకీ ముగ్గురిలో ఎవరు గెలుస్తారు అని అడిగారు .
ఏమాత్రం ఆలోచించకుండా కావ్య మేడం .......... అన్నాను . 
అయితే చూద్దాము మహేష్ అని నా భుజం చుట్టూ చేతులువేశారు . 

ముగ్గురూ జడ్జెస్ ఎదురుగా నిలబడ్డారు . జడ్జెస్ అడిగిన ప్రశ్నలకు హాస్యం ఆలోచన రేకెత్తించేలా సమాధానాలిచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు నాదేవత . 
సర్ : ప్రతీ సమాధానానికి wow wow మహేష్ ............ , నీ గెస్ నిజమయ్యేలా ఉంది .
సమాజం గురించి మీ అభిప్రాయం చెప్పండి అని ముగ్గురికీ మైకులను అందించారు .
మొదటి మోడల్ సెకండ్ మోడల్ మాటలకు అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు . 
నాదేవత వంతు రాగానే , మహేష్ ......... ఇప్పుడు ఏమి మాట్లాడబోతున్నారో ఆ మాటలే నీ మోడల్ ను విజయతీరాలకు చేరుస్తుంది అనిచెప్పడంతో , 
మళ్లీ దేవుళ్లను ప్రార్థించాను . 
అందరికీ విష్ చేసి , వెనక్కు తిరిగి నేనెక్కడైతే కనిపించగానే ఆ ప్లేస్ లో ఒకసారి చూసి ఒక క్షణం నిరాశ వెంటనే ఉత్సాహంతో అనాథ సరణాలయాల గురించి , వృద్ధాశ్రమాల గురించి సమాజంలో మహిళలు పడుతున్న ఇబ్బందుల గురించి కాన్ఫిడెంట్ గా మాట్లాడటం విని మా గురించి నాదేవత ........... అని కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి . 
మిస్ వైజాగ్ కోసం భలే మాటలు నేర్చింది ఆ అమ్మాయి . వాళ్ళ గురించి మాట్లాడటం కాదు , ఒకవేళ గెలిస్తే వచ్చే 5 లక్షల ప్రైజ్ మనీని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ అనాధాలకు ఇవ్వమను అప్పుడు అప్పుడు ఇంతకంటే గట్టిగా నేను కొడతాను చప్పట్లు అని వెనుకనుండి వెటకారపు మాటలు వినిపించాయి .

యాంకర్ wow అంటూ అందరితోపాటు టాప్ లేచిపోయేలా చప్పట్లతో ముగ్గురినీ అభినందనలతో ముంచెత్తారు . ఈ ముగ్గురు సుందరీమణులలో మిస్ వైజాగ్ కిరీటం ఎవరు గెలుచుకోబోతున్నారో అనౌన్స్ చేయవలసిందిగా జడ్జెస్ ను కోరుతున్నాము . కిరీటాన్ని బహుకరించేందుకు లాస్ట్ ఇయర్ మిస్ వైజాగ్ శ్రావ్య గారిని స్టేజీమీదకు ఆహ్వానిస్తున్నాము అనడంతో , ఆర్గనైజర్లు వెళ్లి ఆమెను స్టేజీమీదకు తీసుకెళ్లారు . 

అందరూ ఉత్కంఠతో ఎవరు ఎవరు అని ఆశతో ఎదురుచూస్తున్నారు . మహేష్ ........ మళ్లీ ప్రార్ధిస్తావా అని సర్ నవ్వారు .
ఘాడంగా సర్ అని కళ్ళుమూసుకుని ప్రార్థించాను . నాదేవత విన్నర్ అనితప్ప ఇక ఏమాటలూ నాకు వినపడేలా లేవు . 
జడ్జెస్ మైకు అందుకొని మిస్ వైజాగ్ కిరీటాన్ని కైవసం చేసుకున్నవారు తన అందం అభినయంతోపాటు సమాజం పట్ల తనదైన వైఖరిని వ్యక్తపరిచి అందరి మన్ననలు పొందిన మిస్ కావ్య అనగానే , మిగతా ఇద్దరు అమ్మాయిలు ఏమాత్రం ఈర్ష్య అసూయలు లేకుండా నాదేవతను కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలపడం చూసి హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది . ఆ మాటలు వినగానే అంతులేని ఆనందంతో కళ్ళుతెరిచి లాస్ట్ ఇయర్ మిస్ వైజాగ్ నాదేవతకు కిరీటం ఉంచడం చూసి అందరితోపాటు గట్టిగా కేకలువేశాను . 
సర్ : మహేష్ .......... అంటూ సర్ రెండుచేతులతో హైఫై కొట్టి ఆనందించారు . 
యాంకర్ : ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందిగా చీఫ్ గెస్ట్ ను స్టేజీపైకి ఆహ్వానిస్తున్నాము అనడంతో ఒక పెద్దావిడ వచ్చి శుభాకాంక్షలు తెలిపి చెక్ అందించారు .

నాదేవత మైకు అందుకుని చాలా సంతోషంగా ఉంది . ఈ విజయాన్ని నేను అలంకరణగా ఫీల్ అవ్వను . సమాజానికి నావంతు బాధ్యతను నిర్వహిస్తాను . అందులో భాగంగా ఈ ప్రైజ్ మనీని మరియు నా నుండి 5 లక్షల రూపాయలను అని ఒకరి నుండి మరొక చెక్ అందుకుని వైజాగ్ లో ఉండే అనాథ ఆంధ శరణాలయాలకు మరియు వృద్ధాశ్రమాలకు అందివ్వాల్సిందిగా ఆర్గనైజర్స్ ను కోరుతున్నాను అని వాళ్ళకే అందించారు . 
హాల్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది . సూపర్ మేడం అని మా నలుగురమూ గట్టిగా సంతోషంతో అరిచి చప్పట్లు కొట్టడం చూసి అక్కడ ఉన్న ప్రతిఒక్కరూ నాదేవతను ఆకాశానికి ఎత్తేస్తూ wow wow .......... అంటూ వైజాగ్ మొత్తం వినిపించేలా కరతాళధ్వనులతో కేకలతో వాహ్ ........ అనుకున్నారు . వెనక్కు తిరిగిచూస్తే మాట్లాడినట్లుగానే ఆ వ్యక్తి సంతోషంతో విజిల్స్ వేస్తూ ఆపకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు . 

ఆ సంతోషంలో కొంతమంది స్టేజీమీదకు ఎక్కుతుంటే , సర్ వాళ్ళు ఏర్పాటుచేసిన బౌన్సర్లు నాదేవతను ఇద్దరు అమ్మాయిలనూ సేఫ్ గా లోపలికి తీసుకుపోయారు . 
యాంకర్ : అనుకున్నదానికంటే ఈవెంట్ ను అద్భుతంగా జరిగేలా సహకరించిన అందరికీ - ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించిన ******** ఈవెంట్ వాళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు . వచ్చినవారందరూ మా ఆథిత్యాన్ని స్వీకరించి సేఫ్ గా వెళ్లాలని ఆశిస్తున్నాము అనిచెప్పడంతో లైట్స్ అన్నీ on అయ్యాయి . 

ఆర్గనైజర్స్ వచ్చి సర్ ను ప్రత్యేకంగా అభినందించి అక్కడికక్కడే చెక్ అందించారు . 
సర్ మిగతాసార్లను కౌగిలించుకుని ఫస్ట్ బిగ్ ఈవెంట్ సక్సెస్ అని ఆనందాన్ని పంచుకున్నారు . అతిథులందరూ డైనింగ్ వైపు వెళుతుంటే ఫ్రెండ్స్ ఇక డిన్నర్ ఏర్పాట్లుకూడా సక్సెస్ చేసామంటే మనగురించి వైజాగ్ మొత్తం తెలుస్తుంది లెట్స్ గో అని హైఫై కొట్టుకుని మహేష్ కృష్ణ ......... రండి అని బయట arange చేసిన దగ్గరకు పిలుచుకొనివెళ్లారు .

మహేష్ కృష్ణ ........... విజయం సాధించాము , ఇందులో మీ వంతు కూడా ఉంది , ఆకలివేస్తే వెళ్లి తినండి అంతా మనం ఏర్పాటుచేసినదే అనిచెప్పారు . అక్కడ వంటలను చూసి మాకు నోరూరిపోయింది . ఎలా రా మామా మన శరణాలయంలోని పిల్లలు లేకుండా తినడం అని బాధపడ్డాము .
10 గంటలకల్లా ......... గెస్ట్స్  అందరూ తినేసి లవ్లీ ఫుడ్ - tasty ఫుడ్ అనిచెప్పేసి వెళ్లిపోయారు . మేము తిన్నామేమో అనుకుని సర్ వాళ్ళుకూడా వెళ్లి తిన్నారు . ఎక్కువైన పర్లేదు ఒక్క వంటా మిస్ అవ్వకూడదు అని చాలా వంటలు చేయించడంతో మిగిలిపోవడం చూసాము .
నాదేవత కూడా ఇక్కడికే వచ్చి తింటారా అని ఆశతో చూసి చూసి రాకపోవడంతో నిరాశ చెందాను . 
రేయ్ .......... మిస్ వైజాగ్ కూడా మన వంటలను తృప్తిగా ఆస్వాదించారట అని ఆ ఏర్పాట్లు చూసుకున్న ఒక సర్ వచ్చి సర్ వాళ్లకు చెప్పడంతో అందరూ ఆనందించారు. అంటే నాదేవత లోపల తిన్నారన్నమాట మళ్లీ చూస్తానో లేదోనని మనసులో అనుకున్నాను . 

మహేష్ ......... రండి అని పిలిచి done a good job ఇదిగోండి అని పర్సులోనుండి నలుగురికీ కలసి పదివేలు అందించి , రేపు కూడా ఈరోజు వచ్చిన సమయానికి వచ్చెయ్యండి అనిచెప్పారు .
సర్ .......... మాకు డబ్బు వద్దు . ఎలాగో చాలా వంటలు స్వీట్స్ మిగిలిపోయాయి వాటిలో కొన్ని మాకు ఇస్తే శరణాలయంలో షేర్ చేసుకుని తింటాము . తప్పుగా మాట్లాడితే క్షమించండి .
సర్ : తింటారా ? మహేష్ ......... అయితే మీరు ఇంకా తినలేదా ? , తిన్నారు అనుకుని మేము పిలవనైనా పిలవలేదు అని సర్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు . రేయ్ రేయ్ ఫ్రెండ్స్ అందరమూ తప్పుచేసాము . ఇద్దరు వెళ్లి నాలుగు ప్లేట్లలో వడ్డించుకునివచ్చారు . 
సర్ ........... మా అన్నయ్యలు తమ్ముళ్లను వదిలి ఇంత costly ఫుడ్ తినలేము . ఏది తిన్నా మేము కలిసే తింటాము లేకున్నా కలిసే పస్తులుంటాము . 
సర్ : ఫ్రెండ్స్ మొత్తం మిగిలినవన్నింటినీ ఫైవ్ స్టార్ పార్సిల్లా ప్యాక్ చేయించండి . అలాగేరా అంటూ సర్ వాళ్ళు వెళ్లారు . తమ్ముళ్లూ ......... షేర్ చేసుకోవడం కాదు తృప్తిగా తినండి .
నలుగురమూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో చేతులెత్తి నమస్కరించాము . 
సర్ : తమ్ముళ్లూ .......... ఆపండి ఆపండి , ఈ డబ్బు మీ కష్టానికి ఫలితం అని 2500 మా జేబులలో ఉంచారు . 

రేయ్ రెడీ రా అని సర్వర్లు తీసుకొచ్చిన పెద్ద పెద్ద పార్సిళ్లను చూయించారు . మహేష్ .......... ఆలస్యం అయ్యింది మా కారులో వదులుతాము రండి అన్నారు . 
సర్ .......... ఇప్పటికే మాకోసం చాలా చేశారు . మేము నడుచుకుంటూ వెళ్లిపోతాము మీరు సక్సెస్ ను ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పాము .
సర్ : మహేష్ చాలా బరువున్నాయి చాలా ఉన్నాయి . కనీసం ఆటోలోనైనా వెళ్ళండి అని పార్సిళ్లను పట్టుకుని బయటకు నడిచాము . రెండు ఆటోలను ఆపి సర్దారు . మహేష్ .......... మీరెక్కడ కూర్చుంటారు ఆటోలు నిండిపోయాయి , అందుకే మేము వదులుతాము అన్నది . 
సర్ .......... ఇక్కడ అని ఆటో డ్రైవర్ కు ఇరువైపులా కూర్చున్నాము . 
ఆటోలకు డబ్బులు కూడా సర్ ఇచ్చారు .
సర్ ......... మాజీవితంలో ఇప్పటివరకూ చూడనంత డబ్బు ఇచ్చారు మేము ఇస్తాము లేండి .
సర్ వాళ్ళు నవ్వుకుని మహేష్ కృష్ణ జాగ్రత్త రేపు కలుద్దాము గుడ్ నైట్ .........
గుడ్ నైట్ సర్ అని కేకలువేసి బయలుదేరాము . అర్ధరాత్రి అవుతుండటంతో సిటీ మొత్తం ప్రాసాంతంగా ఉంది .

రేయ్ మామా మనవాళ్ల పెదాలపై చిరునవ్వులు చూడబోతున్నాము . 
కృష్ణ : అవునురా మామా ........... అన్నయ్యా అన్నయ్యా ........ ఇటువైపు ఇటువైపు అనిచెబుతున్నా , మరొకవైపుకు పోనిచ్చి నాకు తెలియదా అటువైపు రోడ్ బాలేదు అని ఏకంగా సిటీ దాటి పొలాల్లోకి పోనిచ్చారు . వెనుక ఆటో మమ్మల్నే ఫాలో అయ్యింది . 
మెయిన్ రోడ్ నుండి టర్న్ చేసి కొద్దిగా లోపలికి తీసుకెళ్లాడు . ఎదురుగా ఇద్దరు నిలబడిన దగ్గర ఆపి కిందకు దిగమని దిగి వాళ్ళతో చేతులుకలిపి , రేయ్ పిల్లనాయాల్లారా ...........జీవితంలో చూడనంత డబ్బా ........ అదికూడా ఫైవ్ స్టార్ హోటల్ నుండి బయటకువచ్చారు . మర్యాదగా డబ్బు ఇచ్చేసి పరిగెత్తి వెళ్లిపోండి . 
వెనుక ఆటో డ్రైవర్ వచ్చి హలో బ్రదర్ వైజాగ్ లో ఆటోవాలాకు ఒక గుర్తింపు ఉంది పాపం కష్టపడి సంపాదించినట్లున్నారు - ఆ డ్రెస్ చూస్తే తెలుస్తోంది . బ్రదర్ పాపం అనాధలు అని చెబుతుండగానే రేయ్ నీ సోధి ఆపరా ......... లేకపోతే నీకు ఆటో లేకుండా చేస్తాము అనిచెప్పడంతో సైలెంట్ అయిపోయాడు . 
Like Reply


Messages In This Thread
RE: పేదరాసిపెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-09-2020, 04:55 PM



Users browsing this thread: 26 Guest(s)