Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
కధ వెనుక కధ

ఈ కధ రాద్దామన్న ఆలోచన దాదాపు ఒక సంవత్సరం క్రితమే వచ్చింది. ఒక చిన్న సంఘటన ఆధారంగా మొత్తం కధ అవుట్ లైన్ ఫైనల్ చేసాను. కానీ ఆఫీస్ పని, ప్రైవసీ వల్ల కధ రాయడానికి  సమయం పెట్టలేకపోయాను. అంతే కాకుండా ఏదైనా పని మొదలు పెడితే మొదటిలో సహజంగా ఉండే జడత్వం ఇంకో కారణం. కధ రాద్దామనుకొంటున్న విషయాన్ని ఈ ఫోరమ్ ద్వారా పరిచయమయిన ఇద్దరు మిత్రులతో పంచుకొన్నాను. వాళ్ళు అప్పుడప్పుడు మీ కధ ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. అరె రాయట్లేదే అని. కానీ వారి ప్రశ్నలే ఒక రకంగా ఎలాగైనా రాయాలని ప్రేరేపించేవి.

ఉపోద్ఘాతంలో చెప్పినట్టు కధ ఒకసారి మొదలుపెడితే అప్డేట్ ప్లీజ్ అని పాఠకులు అడగకుండా పోస్ట్ చేయాలనీ ముందే నిర్ణయించుకున్నాను. దాంతో ఒక ఎపిసోడ్ కు సరిపడా కొంత రాసినా పోస్ట్ చేయలేదు. రచయిత చెప్పేదాకా (దారం తెరిచి మొదటి పోస్ట్ పెడితే తప్ప) పాఠకులకి తెలియదు, ఫలానా రచయిత కధ రాయాలనుకొంటున్నారని. అలా మెసేజ్ పెట్టినా, మొదటి ఎపిసోడ్ పోస్ట్ చేసినా చాలా మంది పాఠకులు వెల్కమ్ మెసేజెస్ తో ప్రోత్సాహించటం కూడా మనం చూడొచ్చు. ఒక సారి మొదలు పెట్టాక, పాఠకులు కనీసం వారానికి ఒక అప్డేట్ కోరటం సహజం. ఏమైనా అవాంతరాలు వచ్చి కాలక్రమం చొప్పున్న అప్డేట్ ఇవ్వకపోతే (ముఖ్యంగా కధ నచ్చితే) పాఠకులకు బాగా నిరుత్సాహం, ఆ నిరుత్సాహం కోపంగా మారి శాపనార్ధాలు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఒకరకంగా అభిమానంతోనే అనుకోండి. ఏ రచయితా అలా కావాలని చేస్తారని అనుకోను. కారణాలు అనేకం అనారోగ్యం, పని వత్తిడి, ప్రైవసీ, ఆసక్తి తగ్గిపోవడం, పాఠకుల ఆదరణ లేకపోవడం. 

ఏదైనా సరే కధ మొదలంటూ పెడితే పూర్తి చేయాలన్నది నా రెండో నిర్ణయం. దాంతో సగం కధ రాసేదాకా మొదటి ఎపిసోడ్ పోస్ట్ చేయకూడదని అనుకొన్నా. మధ్య మధ్య లో రాసింది పోస్ట్ చేద్దామా అని అనిపించేది, కానీ అతి నిగ్రహంతో ఆపుకొన్న. అలా  కధ చాలామటుకు రాయటంలో చాలా ప్రయోజనాలు కనిపించాయి.

కధ అవుట్ లైన్ అనుకున్నాక మొదలుపెట్టి రాస్తుంటే లోటుపాట్లు కనిపించాయి. తక్కువ నిడివిలో రాయాలంటే సంభాషణలు, పాత్రల ఆలోచన సరళి ఎక్కువగా రాయడం కుదరదు. అవి రాయకుండా వాళ్ళ ప్రవర్తన, వారు తీసుకునే నిర్ణయాలు పాఠకులకు నప్పేలా రాయాలంటే సాధ్యం కాని పని. దాంతో విపులంగా రాయాలి అని నిశ్చయించుకొన్న. ఒక్కోసారి కధ వేగంగా, ఒక్కోసారి మెల్లగా సాగుతోందని అనిపించేది. దాంతో కథనంతా ఎపిసోడ్స్ పరంగా విభజించి, ప్రతి ఎపిసోడ్ లో ఏమిరాయాలో క్లుప్తంగా నోట్స్ రాసుకున్నా.

ఎపిసోడ్స్ గా విభజించి రాయడం ఒక రకంగా బాగా హెల్ప్ చేసింది. కధ అంతా ఒకే వరుసలో కాకుండా మూడ్ ని బట్టి కొన్ని ఎపిసోడ్స్ క్రమం తప్పికూడా రాసా. నేను ముందే రాసి పెట్టుకున్న నోట్స్ అందుకు సహాయపడింది. రాసిన తరువాత అంతా కలిపి చదువుతూ కావలిసినట్టుగా సర్దుబాటుచేస్తూ కధ ఒక లయలో ప్రయాణించేటట్టు చూసా. అప్పటికి ఒకసారి లయ తప్పినట్టు పాఠకుల అభిప్రాయం ద్వారా తెలిసింది. దాంతో తరువాత భాగాలు కూడా కొంచెం సరిచేయడం జరిగింది. కధ సగంపైగా రాయటం వలన చాలా రకాల తప్పులను పునస్సమీక్షలో దిద్దు కోవటం జరిగింది. ముఖ్యంగా కధ కొనసాగించడంలో వచ్చే తప్పులు (continuity errors)సరిదిద్దాను. ఉదాహరణకు మొదట కావ్య MA సైకాలజీ చదివింది అని రాసి తరువాత తండ్రికి బిజినెస్ లో సహాయం చేసింది అని రాసా. అది కొంచెం అసందర్భంగా ఉందని, మాస్టర్ అఫ్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్ చదివినట్టు మార్చి, సైకాలజీ బుక్స్ కూడా బాగా చదివింది ఆ విధంగా ఆమెకు మానవ మనస్తత్వలా మీద కొంచెం విశ్లేషించే పరిగ్యానమ్ ఉన్నట్టు మార్చా.

కాలక్రమానుసారానికి సంభందించిన తప్పులు (timeline mistakes) అంటే శోభనం అయిన అయిదు నెలలకే బిడ్డ పుట్టడం, అలాగే వాస్తవానికి సంభందించిన తప్పులు, ఉదాహరణకు పెళ్లి అయిన తరువాత శ్రీరామ్, కావ్యతో కాకినాడ వస్తాడు. మొదట 82 ఈస్ట్ SMRT మాల్ కు తీసుకు వెళ్లినట్టు రాసా. ఆ మాల్ 2018 లో ప్రారంభించబడింది. కధ శ్రీరామ్ పెళ్ళైన తరువాత నాలుగు సంవత్సరాలు పాటు జరుగుతుంది. వాస్తవానికి అది అసాధ్యం కాబట్టి మెయిన్ రోడ్, సినిమా స్ట్రీట్ చూపించినట్టు మార్చా. ఒక్కోసారి నేను రాసిందే తరువాత చదువుతుంటే కొంచెం విభిన్నంగా ఉండేది. తర్కంలో కొన్ని లోటుపాట్లు కనిపించేవి. ఆ విధంగా కొంత దిద్దుబాటు కుదిరింది.

ముఖ్యంగా రాసిన పదాలు కానీ, వ్యాకరణం కానీ ఒకటికి రెండు సార్లు చదివి తెలుగులో తప్పులు చాలా సరిదిద్దా. కొన్ని కధలు చదువుతుంటే తప్పులు మరీ ఎక్కువగా దొర్లి భోజనం చేస్తుంటే పంటికింద రాయిలా చదవటానికి ఇబ్బందిగా ఉండేది. నా కధకు పాఠకులు ఆ ఇబ్బంది పడకూడదని బాగా సమయం పట్టినా తొందరపడకుండా రాసా. ముందుగా రాయటం వలన కధ మీద పూర్తి అవగాహన ఉండటంతో పాఠకులు కొన్ని కోరినా, మారిస్తే ఇబ్బంది అని మార్చలేదు. అప్పటికి ముందుగా అనుకోకపోయిన, పాఠకుల కోరిక మీద కొన్ని శృంగార దృశ్యాలు కధలో అవకాశం ఉన్నప్పుడు రాయడం జరిగింది.

14  ఎపిసోడ్స్ రాసిన తరువాత, దారం తెరిచి ఉపోద్ఘాతం రాసాను. దీనివలన మధ్యలో ఏ కారణం వల్లనైనా ఏమాత్రం సమయం చిక్కకపోయిన దాదాపు 14 వారాలు (వారానికి  ఒక ఎపిసోడ్ చొప్పున) కధ కొనసాగించే వెసులుబాటు వచ్చింది. కానీ సమయం చిక్కినప్పుడల్లా రాస్తూనే ఉన్నా, రాసిన వాటిని కూడా సమీక్ష చేసి కావాల్సినట్టుగా మార్పులు చేయడం జరిగింది. అలా రాయడం వలన వారానికి ఒకటి బదులు రెండు ఎపిసోడ్స్ ఇవ్వడం కుదిరింది. మధ్యలో కంపెనీలో లే ఆఫ్ లు జరిగి పని వత్తిడి బాగా పెరిగింది. దాంతో కధ రాయడానికి సమయం తక్కువ దొరికేది. అయినప్పటికీ ముందుగా రాసిపెట్టుకోవడం వలన, క్రమేపి తరువాత కూడా ఎపిసోడ్స్ రాయడంవలన క్రమం తప్పకుండా ఇవ్వడం సాధ్యమయ్యింది. చివరకు ఉన్నవన్నీ అయిపోవడంతో కొత్తగా రాయవలసి వచ్చి మొదటి సారి క్రితం వారం ఆలస్యమయింది. కధ చివరికి వచ్చింది, ఇక ముందు ఆ ఇబ్బంది ఉండదు అనుకొంటున్న.

నేను చెప్పేది ప్రత్యేకంగా సొంత సిస్టం ప్రైవేట్ గా  ఉన్న వారికే సహాయ పడుతుంది. కేవలం మొబైల్ లో ఎప్పటికప్పుడు టైపు చేస్తూ, కధలు రాస్తున్నామని కొంత మంది రాసారు. నిజానికి అలా రాయడం చాలా కష్టం. వారికి నా జోహార్లు.

కధరాసే ఉత్సాహం ఉందని పీఎం లు పంపించిన వారికి ఇదే సలహా ఇచ్చాను. ఎవరికైనా ఔత్త్సహిక రచయితలకు పనికి వస్తుందేమో అని ఇది అందరితో పంచుకుంటున్నాను. థాంక్స్.
[+] 10 users Like prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 04-09-2020, 07:24 AM



Users browsing this thread: 5 Guest(s)