02-09-2020, 11:12 PM
తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష...
తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !
ఏంటి పద్యాలు చెబుతున్నారు అనుకుంటున్నారా. అదేమీ కాదండి. ఆ పద్యంలో ఉన్న భావం గురించి మనం మాట్లాడుకుందాం. కోపం మనిషిని, కుటుంబాన్ని, బంధాలను నాశనం చేస్తుంది. కోపం మనిషి ఆలోచనా శక్తిని చంపేస్తుంది. అందుకే తన కోపమే తనకు శత్రువు అన్నారు. కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో కూడా మనకు తెలియదు. కోపం లో వచ్చే మాటలు ఎదుటివారి మనసును ముక్కలు చేస్తాయనడంలో సందేహం లేదు. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. సాధ్యం చేయాలి కూడా. ఎందుకంటే కోపం ఎంత మంచి మనిషిని అయినా చెడ్డవాడిగా మారుస్తుంది.
ఒక ఇంట్లో భార్య భర్తలు ఏదో విషయం మీద గొడవ పడ్డారు మాట మాట అనుకున్నారు. ఆ భార్య కోపంతో భర్తని, ఆ ఇంటిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటిదాకా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్య కాస్త రెండు కుటుంబాల మధ్య సమస్యగా మారింది. గుట్టుగా ఉండాల్సిన కాపురం కాస్తా రోడ్డున పడింది. పరువు పోయింది. అది చాలదన్నట్లు చుట్టూ ఉన్న వారు ఇంకాస్త మంట పెట్టారు. వారి పరిస్థితి విడిపోయే దాకా వెళ్ళింది. కానీ దేవుని దయవల్ల ఆ జంట విడిపోలేదు. విడిపోయుంటే వారి ఇద్దరి పరిస్థితి ఏంటి. ఆ రెండు కుటుంబాల పరువు ఏంటి. రెండు జీవితాలు తలకిందులయ్యేవి. అదే కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఆ సంఘటన వారు జీవితాంతం మర్చిపోలేరు. చూసారా కోపం ఎంత చెడ్డదో.
చాలా కుటుంబాలు విడిపోవడానికి కారణం కోపమేనండి. కోపంలో అనుకునే మాటలు బంధాలను విడదీస్తాయి. ఇది ఒక భార్యాభర్తలే కాదు. స్నేహితులు, అన్నదమ్ములు, ఆఖరికి తండ్రి బిడ్డలు కూడా విడిపోతున్నారు. అందుకే కోపం చాలా చెడ్డ లక్షణం. ఎంత మంచివాడు అయినా ఈ కోపాన్ని అదుపులో పెట్టుకోలేక అందరికీ దూరమైపోతున్నాడు. ఈ కోపాన్ని అదుపులో చేసుకోవాలంటే ధ్యానం, యోగా లాంటివి చేయాలి అంటారు. కానీ వీటన్నిటి కంటే ముఖ్యమైనది మనం కోపం అదుపు చేసుకోవాలి అని బలంగా అనుకోవడం. ఏదైనా మనం బలంగా అనుకుంటే చేయగలం. ఈ కోపం ఎదుటివారికే కాదు మనకు కూడా ఎంతో నష్టాన్ని చేస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది. ఎంతో బాధని మిగులుస్తుంది. ఎవరి కోసం కాకపోయినా మన కోసమైనా మనం మారాలి. మన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !
Quote:భావము : ఎవరికైననూ తన కోపమే తనకు శత్రువగును. తన శాంతమే తనకు రక్షణగా
నిలుచును. తను చూపెడి దయాగుణమే బంధువులవలె సహకరించును.
తానూ సంతోషముగా నుండగలిగినచో అది స్వర్గముతో సమానము. తాను
ధుఃఖమును చేతులార తెచ్చుకొనినచో అదియే నరకమగుట తథ్యము.
తాత్పర్యం:
తనయొక్క కోపము శత్రువు వలె బాధయును.నెమ్మదితనము రక్షకునివలె రక్షణయును,కరుణ చుట్టమువలె ఆదరమును, సంతోషము స్వర్గమువలె సుఖమును,దుఃఖము నరకము వలె వేదనను కల్గించునని చెప్పుదురు.