02-09-2020, 10:43 PM
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ...!
4. ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందర పడక నిజమో, అబద్దమో... తెలుకోవాలి. ఇది బద్దెన గారి సూక్తి. మరి ఎంత మంది ఇలా మంచి చెడ్డలు పరిశీలించి న్యాయ పరమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు.
అందువల్లే .. చాడీలు చెప్పే వారి మాటలే చెల్లుబాటు అవుతున్నాయి. నిజానిజాలు గమనించక... తొందర నిర్ణయాలు తీసుకొని... అపార్ధాలతో.... ఆవేశపడి, ఆతర్వాత ఎంత బాధపడితే.... ఎమి ప్రయోజనం...!
చెప్పుడు మాటలు విని శతృత్వం తెచ్చుకొంటే.. ఆ తర్వాత సర్దుకుపోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఒకవేళ చెప్పుడు మాటలతో బలమైన వ్యక్తులను ఢీ కొట్టాల్సివస్తే.. మొదటికే మోసం రావచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకోన్నట్లవుతుంది.
5. ఎవరు చెప్పినా ముందు వినండి.
ఇక్కడ 'ఎవ్వరైనా' అనే మాటకు విస్తృతమైన స్థాయిఉంది.అంటే మిత్రుడు చెప్పినా,శత్రువు చెప్పినా,పిల్లవాడు చెప్పినా,పెద్దవాడు చెప్పినా,మనవాళ్ళు చెప్పినా,పరాయివారు చెప్పినా..ఇలా వారు,వీరు అనికాకుండా ఎవ్వరైనా అని.
.
తొందరపడొద్దు..ముందు విను. ఆ విన్నమాటలో నిజమెంతో,అబద్దమెంతో పరిశీలనలో పెట్టి..చూడు.తేలిన తర్వాతే..ఒక నిర్ణయానికి రండి.
అంటే..మిత్రుడు చెప్పింది తప్పని తేలితే..విడిచి పెట్టండి.శత్రువు చెప్పింది నిజమని తేలితే అంగీకరించండి.ఇలా ఉండేవాడిని బుద్ధిమంతుడు అని చెబుతున్నారిక్కడ.
.
మనం మన జీవితాలలో అమలు చేసుకోవాల్సిన ఒక మంచి పద్దతి ఇది.దీన్నే మన భారత రాజ్యాంగం కూడా..శాస్త్రీయ దృక్పథం పేరున మనల్ని అలవరచుకొమ్మంటుంది.
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ...!
Quote:1. లోకంలో ఎవ్వరు ఏమి చెప్పినా ఓపికగా వినేవాడే ఉత్తముడు. ఏదేని విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా... అందులో నిజా నిజాలను తెలుసుకునేవాడే ఈ భూప్రపంచంలో నీతిపరుడుగా నిలుస్తాడని ఈ పద్యం యొక్క భావం.
2. ఎవ్వరు చెప్పిననూ వినవచ్చును.వినగానే తొందరపడక నిజమో-అబద్దమో వివరించి తెలిసికొనినవాడే న్యాయము తెలిసినవాడు.
3. ఎవరు ఏమి చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందర పడకుండా బాగా ఆలోచించాలి. అలా ఆలోచించి నిజానిజాలను తెలుసుకున్నవాడే తెలివయినవాడు.