09-03-2019, 12:32 AM
కామాతురానా న భయం న లజ్జ అని ఒక సామెత. కామంతో మనిషి ఆలోచనలు నిండిపోతే ఎలాంటి తప్పు చేయడానికైనా వెనకాడరని పెద్దలు చెప్పిన మాట అది. ఇప్పుడు చెప్పే ఘటన వింటే అది నిజమేనని అనిపించక మానదు. తన కొడుకు స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక తల్లి.. తన సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి ఆ స్నేహితుడి సహాయంతో కొడుకుని హత్య చేసింది. ఈ దారుణ ఘటన హర్యాణాలో చోటు చేసుకుంది. సెక్యూరిటీ ఆఫీసర్లు చెప్పిన వివరాల ప్రకారం..
హర్యాణాలోని జబ్జర్ జిల్లాకు చెందిన మీనా (44) అనే మహిళకు ప్రమోద్ (23) అనే కొడుకు ఉన్నాడు. బౌన్సర్‌గా పని చేసే కొడుకును కలవడానికి అతని స్నేహితుడైన ప్రదీప్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో మీనా, ప్రదీప్ మధ్య సాన్నిహిత్యం పెరిగి అది అక్రమ సంబంధానికి దారి తీసింది.
అయితే కొన్ని రోజులకు తల్లి ప్రవర్తనపై కొడుకు ప్రమోద్‌కు అనుమానం వచ్చి ఆరాతీయగా తన స్నేహితుడితోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించాడు.
దీంతో తీవ్రంగా మనస్థాపం చెందిన ప్రమోద్.. డ్యూటీకి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. అంతే కాకుండా తన స్నేహితుడు ప్రదీప్‌ను ఇంటికి రావద్దని హెచ్చరించాడు. అయితే మీనా, ప్రదీప్‌లు తమ ఎడబాటును తట్టుకోలేక ప్రమోద్‌ను హత్య చేయాలని నిశ్చయించుకున్నారు.
గత ఫిబ్రవరి 19న ప్రమోద్ ఇంటి వద్ద ఉన్నప్పుడు మీనా తన ప్రియుడు ప్రదీప్‌తో సహా మరో ఇద్దరు స్నేహితులను ఇంటికి పిలిపించి కొడుకును దారుణంగా హత్య చేయించింది. అనంతరం మరుసటి రోజు ఉదయం తన కొడుకు హత్యకు గురయ్యాడని పేర్కొంటూ సెక్యూరిటీ ఆఫీసర్లకు పిర్యాదు చేసింది.
సెక్యూరిటీ ఆఫీసర్లు పలు కోణాల్లో విచారించి అనుమానితులను అదుపులోనికి తీసుకున్నారు. ఈ క్రమంలో సౌరభ్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోనికి వచ్చింది. దీంతో తల్లి మీనా, నిందితుడు ప్రదీప్, అతని స్నేహితులను గురువారం అరెస్టు చేశారు.
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు