Thread Rating:
  • 11 Vote(s) - 2.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ప్రేమ,ఆత్మఅనుబంధం
#35
ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఒక మంచి రోజు చూసి మా పెళ్లి చూపులకి ఏర్పాటు
చేశారు.

అమ్మాయిని మొదటి సారి నేను చూడటం,

అమెరికా లో వున్నా కూడా ఆ చీరకట్టు లో ఇక్కడి అమ్మాయిలకు ఏమాత్రం
తీసిపోనివిధం గా చాల అందంగా వుంది,

ఒక్క మాటలో చెప్పాయి అంటే అను కంటె
కూడా బాగుంది,

కానీ అను లా మాత్రం లేదు,

అను అంత ప్రేమ ఎవ్వరికి ఉండదు.

మల్లి అను గుర్తుకు రాగానే కాస్త నెర్వస్ గా ఫీల్ అయ్యాను.

అమ్మ వాళ్ళు అమ్మాయిని చూసి మాకు ఇష్టమే అని ఓపెన్ గానే చెప్పి నా వైపు చూసారు.

నేను కళ్ళతోనే సరే నాకు కూడా ఇష్టమే అని చెప్పను.

తనతో నేను కాస్త ఒంటరిగా మాట్లాడాలి సార్ అని తనకు చెప్పను,

మా బాస్ దానిదేముంది ఆలా బాల్కనీ లోకి గని ఇంటి వెనక గార్డెన్ లోకి గాని వెళ్లి రండి,

మరి ప్రైవసీ లేదు అనుకుంటే టెంపుల్ కి గాని,ఆలా పార్క్ కి గని వెళ్లి మీ మనసులో వున్నా అన్ని విషయాలు మాట్లాడుకోండి

ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండేది మీరే కదా అన్నాడు అంటూ కార్ కీస్ తెప్పించి చేతికి ఇవ్వబోయాడు.

నేను గార్డెన్ ఓకే సార్ అన్నాను

10నిముషాల తర్వాత గార్డెన్ లో మాకు ఇద్దరికి చైర్ లు వేసి వెళ్లి పోయారు పని వాళ్ళు,

టేబుల్ మీద టీ,కాఫీ స్నాక్స్ అన్ని ఆరెంజ్ చేసి వెళ్లారు.

మరొక 2 నిముషాల తర్వాత తాను వచ్చింది గార్డెన్ లోని తన పాదం కింద వుండే గడ్డిని కూడా కందకుండా
నాలాగా కుండా

చాలా సుతారంగా వయ్యారంగా నడిస్తే నాకు హంసనె గుర్తుకువచ్చింది.

2 నిముషాల మౌనం తర్వాత నేనే మాట్లాడా

హాయ్.... నేను ప్రేమ్.. మీ కంపెనీలోనే మొన్నటి వరకు మేనేజర్ గా జాబ్ చేశా,

అని స్టార్ట్ చేశా..

తాను... హాయ్... నేను మాధురి.. మా కంపెనీలోనే
జాబ్ చేసారు అని తెలుసు అని మొదటి సారి నాతో మాట్లాడింది.

వెయ్యి కోకిల రాగాలు ఒక్కసారి కూసాయా అన్నట్లుగా వుంది తన స్వరం.

ముందు నా గురించి చెప్పనివ్వండి అని స్టార్ట్ చేశా..

నా స్టడీ,కాలేజీ లైఫ్, ఫ్రెండ్స్,అమ్మ -నాన్న అన్ని చెప్పి,

చివరగా నా ప్రేమ కథ కూడా పూర్తిగా చెప్పి,మాధురి..నిన్ను నా భార్యగా చేసుకోవడం నాకు ఇష్టమే,కానీ నీ దగ్గర నేను ఏమి దాచాలి అని అనుకోవడం లేదు,

నేను చెప్పినవి అన్ని విని నీ నిర్ణయం ఇప్పుడు కాకున్నా ఎప్పుడు చెప్పిన నాకు ఓకే

అది ఎస్ ఐన నో ఐన ని చెప్పి తన వైపు చూసాను.

తన కళ్ళలో ఎదో భావం,చెప్పలేక పోతుంది.
5 నిముషాల మౌనం తర్వాత నాన్కు మీరు ఇష్టమే, మీలాగా నిజాయితీగా ఈ రోజుల్లో ఎంత మంది చెప్పగలరు.

అందుకేనేమో మా మామయ్య మిమ్మల్ని నాకోసం చూసిపెట్టారు.

మీతో పెళ్లి నాకు ఇష్టమే అని నవ్వింది.

నేను తనకు షాక్ హ్యాండ్ ఇచ్చి నవ్వాను,

ఇద్దరం హాల్ లోకి వచ్చి సర్ మంచి మంచి స్వీట్ ఒకటి స్పెషల్గా చేయించండి మీ అందరికి తినిపించాలి అని అన్నాను.

మేము ఇద్దరం ఇష్టపడ్డట్లు అందరు గ్రహించి ఆనందంగా ఫీల్ అయ్యారు.

నేను సర్ నది ఒక కండిషన్ అన్నాను.

అందరు ఏంటి అన్నట్లుగా చూసారు,

నాకు కంపెనీలో వాటా లాంటివి ఏమి వద్దు, జస్ట్ శాలరీ మాత్రం మంచి ప్యాకేజీ ఇవ్వండి అన్నాను,

అదేంటీ బాబు ఆలా అంటావు,

తన కంపెనీ అంటే నీ కంపెనీ నే కదా,నీ ఇష్టం వచ్చినంత తీసుకో..

ఎలాగూ మాధురి కంపెనీ కి నువ్వే కదా అన్ని,తాను కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకుంటుంది అన్నాడు,

కరెక్టే కానీ నాకు కేవలం శాలరీ మాత్రమే కావాలి అన్నాను.

దానికి మాధురి సరేనండి, మీ ఇష్టం కానీ నాకు మాత్రం కాసింత రెస్ట్ ఇప్పించండి,

పవర్ అఫ్ అటార్నీ మీ పేరు మీద ఉంటుంది,

నా భర్తగా మీకు పూర్తి అధికారాలు ఉంటాయి,

వాటిని మాతరం కాదు అనకండి అంది.

నేను సరే అని ఒప్పుకున్నాను.

అందరు సంతృప్తి చెంది అప్పటికి అప్పుడు పంతులు గారిని పిలిపించి జాతకాలు పరిశీలించి ముహుస్తాం కాయం చేసారు,

కరెక్ట్ గా నెల రోజులల్లో పెళ్లి డేట్ వచ్చింది.

నాన్న మీ ఆరోగ్యం సరిగా లేదు, మీ బదులు నేను ఒకసారి మా వూరు వెళ్లి అందరిని ఆహ్వానించి వస్తా అని అమ్మ-నాన్నకి చెప్పను.

వాళ్ళు సరే అన్నారు.

* * *
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ,ఆత్మఅనుబంధం - by sarit11 - 03-12-2018, 12:47 PM



Users browsing this thread: 4 Guest(s)