Thread Rating:
  • 9 Vote(s) - 2.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ప్రేమ,ఆత్మఅనుబంధం
#33
6.30 కల్ల మా ఎండి ఇంట్లో వున్నాను,


నన్ను చూస్తూనే షాక్ అవుతూ,రావయ్యా ప్రేమ్,నీ రాజీనామా ఇందాకే చూసాను.

ఏంటి బాబు అలా మధ్యలో వదిలేస్తే ఎలా,మా వాళ్ళ ఎమన్నా తప్పు జరిగితే మమ్మల్ని క్షమించు,కానీ రాజీనామా చేయకు,

ఎదో ముసలివాడ్ని,ఆశ పడ్డాను,నా కోడలికి ఒక మంచి జీవితం ఇచ్చి నేను ప్రశాంతం గా ఈ లోకంనుండి పోవాలి అనుకున్నాను.

సారీ బాబు అన్నాడు,

అదికాదు సర్,

మీ ఇంటికి కాబోయే అల్లుడు ఇలా చిన్న కంపెనీ లో పని చేస్తే ఎలా,

నాకు మీ కోడల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే,

కానీ,

నావి 2 కండీషన్స్ ,

1 నాకు కొంత డబ్బు కావలి,

మా నాన్న గారు హాస్పిటల్లో వున్నారు అని జరిగినది మొత్తం చెప్పను.

కానీ అందులో ఒక్క రూపాయీ కూడా ఏక్సట్రా నాకు వద్దు. కేవలం హాస్పిటల్ బిల్స్ పే చేయండి అంతే,

2 మా పెళ్లి కి మీ కోడలు ఒప్పుకుంటేనే జరుగుతుంది.

ఇవి రెండు జరిగితేనే నేను మీ కంపెనీ ని అమెరికా చేసుకోగలను అన్నాను,

తాను.. ఓస్ అంతేనా,

ముందు హాస్పిటల్ ఖర్చులకు ఎంత కావాలో చెప్పు అన్నాడు,

నాకు ఏమి వద్దు సార్,

మీ మేనేజర్ ని పంపండి,తనే అన్ని లెక్క చూసుకుంటాడు అన్నాను,

దానికి మేనేజర్ ఎందుకు,నేను చూసుకుంటానులే అన్నాడు,

ముందు నువ్వు వెళ్లి మీ నాన్న చూసుకో మిగితావి అన్ని నేను చూసుకుంటాను అని చెప్పి పంపేశాడు,

నేను కార్ తీసి హాస్పిటల్ వైపుగా వెళ్ళసాగాను,

డ్రైవ్ చేస్తున్న అన్న మాటే గాని నాలో ఒక గిల్టీ ఫీలింగ్,

అను నాకు చేసింది ద్రోహం ఇప్పుడు నేను చేస్తున్నది ఏమిటి.

ఇది ద్రోహమే కదా,నాకు నేను ద్రోహమే కదా.

నాలో భావోద్వేగం,

ప్రేమంటే ఇంతేనా.

ఛా.. చివరికి నేను కూడా నా అవసరం కోసం నా ప్రేమను వదిలేసిన అందరిలానే,

జీవితం మీద మొదటి సారి విరక్తి కలిగింది,

ఇలాంటి సంఘటను సృష్టించిన దేవుని మీద కోపం,

నా బ్రతుకుమీద నాకే జాలి అన్ని పిచ్చివాణ్ణి చేసాయి,

హాస్పిటల్ కి చేరుకొని రిఫ్రెష్ అయి నాన్న రూమ్ లోకి వచ్చాను.

కానీ అక్కడ నాన్న లేదు,

నర్స్ వచ్చి సార్ మీ ఫాదర్ ని వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నాము

ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి రిసెప్షన్ లో అంది,

నేను రిసెప్షన్ కి వెళ్ళాను,

అక్కడ 3 డాక్టర్స్ నన్ను వింతగానూ కొంత గొప్పగాను చూస్తున్నారు,

సార్, మీ నాన్నకి ఇక్కడ కాదు ఆపరేషన్,

ఇతను డాక్టర్ రఘు,చాల ఫేమస్ డాక్టర్,తాను మీతో పాటు అంబులెన్సు లో వస్తారు,

ఓకే బాయ్ సార్,

బెస్ట్ అఫ్ లక్ అంటూ డాక్టర్ ని పరిచయం చేసి వెళ్ళాడు.

నాన్నను అంబులెన్సు లోకి షిఫ్ట్ చేశారు,

అమ్మ నేను డాక్టర్ నాన్నతో పాటు కూర్చున్నాం,

సరిగ్గా 30 నిముషాల్లో అంబులెన్సు ఒక కాళీ ప్లేస్ ముందు ఆగింది,

నేను దిగాను,

చుట్టూ చూసాను,

కానీ అది హాస్పిటల్ కాదు,

పక్కన చూసాను,

అది ఫ్లైట్స్ ఎగిరే రన్ వే.

 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ,ఆత్మఅనుబంధం - by sarit11 - 03-12-2018, 12:44 PM



Users browsing this thread: 2 Guest(s)