Thread Rating:
  • 9 Vote(s) - 2.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ప్రేమ,ఆత్మఅనుబంధం
#26
ఇంటెర్నేషనల్ ఎయిర్పోర్ట్,


అమెరికా నుండీ ఫ్లైట్ గంట లేటుగా హైదరాబాదు లో దిగింది,

ఆలస్యానికి తిట్టుకుంటూ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి ఆలస్యానికి తిట్టుకుంటూ ముందుగా బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేసాను,

5 నిముషాల్లో నన్ను పికప్ చేసుకున్నాడు,

కార్ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా బయలుదేరి కొద్దిసేపట్లోనే సిటీ ని వదిలేసి 4లైన్స్ రోడ్ ఎక్కింది,

నేను మా ఊరికి వెళ్తున్నాను,

అదికూడా దాదాపు 5 సంవత్సరాల తర్వాత.

మా ఊరికి వెళ్ళాలి అంటే దాదాపు 5 గంటల జర్నీ చేయాలి,

కానీ అప్పటికి ఇప్పటికి రోడ్ లు, వాహనాల్లో వేగం చాల మారిపోయింది.

గంట ప్రయాణం తర్వాత హైవే పక్కన వున్నా చిన్న హోటల్ లో రూమ్ తీసుకుని స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను,

టిఫిన్ టీ లు కానిచ్చి,తిరిగి ప్రయాణం కానిచ్చాను.

ఏ/సి చల్లదనానికి తొందరగానే నిద్రపట్టేసింది,

అలాగా పడుకుంది పోయాను,

సార్ ...సార్ అనే పిలిపు విని నిద్రలోనుండి లేచాను,

మీ ఊరికి దగ్గర దాకా వచ్చాము.

ఇక్కడ రెండు దార్లు వున్నాయ్,

ఎటువెళ్ళాలో తెలియడం లేదు అన్నాడు.

నేను చుట్టూ చూసి, కుడి వైపుకి పోనీ అన్నాను.

కార్ తిరిగి బయలు దేరింది.

అరగంట తర్వాత మా ఊరిలోకి ఎంటర్ అయ్యింది,

చాల మారిపోయింది మా వూరు,

పెంకుటిళ్లు ఒక్కటికూడా సరిగా కనిపించడం లేదు,

అన్ని బంగ్లాలు అయ్యాయి,

వై-ఫై టవర్లు కూడా కనిపిస్తున్నాయ్.

హ్మ్మ్ అని ఒక్క నిట్టూర్పు విడిచి తిన్నగా పోనివ్వమని చెప్పాను.

ఒక చ్చోట ఆపమని చెప్పాను.

కార్ ఆగింది.

దిగాను. శిథిలావస్థలో దీనం గా వున్నా ఒక దివాణం ముందు వున్నా నేను.

ఏమండి ఎవరు మీరు చూస్తుంటే ఈ వురి వాళ్ళలా లేరు అని ఒక ముసలి అడిగాడు.

నేను నవ్వి.

అవునండి, మాది అమెరికా..ఒక ఫ్రెండ్ కోసం వచ్చాను ఇక్కడికి అన్నాను.

ఏ ఇల్లు ఎవరిదండి. ఇలా వదిలేశారు అన్నాను.

అడా బాబు..ఒకప్పుడు అది పెద్ద దివాణం.

ఒకప్పుడు ఏ ఊర్లో ఎవరికి తిండికి లేకున్నా ఆ ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు దొరికేవి.

ఎవరికి ఎం కష్టం వచ్చిన దేవాలయం లా ఆదుకునే ఇల్లు ఇప్పుడు దయ్యాలు తిరిగే కొంపలు అయ్యింది.

ఆ ఇద్దరు దేవుళ్ళు బయటి దేశం వెళ్లి చని పోయారు.

ఇప్పుడు దీని పట్టించుకునే వాళ్ళే లేరు అని తన దారిన వెళ్లి పోయాడు.
నిజమే..దాన్ని పట్టించుకునే వల్లే లేరు.

పెద్ద గేట్ తీసుకొని లోపకి వెళ్ళాను..

నా అలికిడికి లోపల గబ్బిలాలు వేగం గా బయటకు వెళ్లి పోయాయి.

సగం వీరికి పడిపోయే లా వున్నా తలుపును తోసుకుంటూ లోపకివి వచ్చాను..

భవంతి మొత్తం పూర్తిగ పనికి రాకుండా పోయింది.

డ్రైవర్ ని నా సామానులు తీసుకురమ్మని చెప్పను..

తాను తీసుకు వచ్చాడు.
పక్కన ఒక గది తలుపు తెరవమని చెప్పాను.

తాను భయపడుతూ తెరిచాడు.

అందులోంచి పాము ఒకటి మమ్మల్ని చూసి జర జర పాక్కుంటు కిటికీ గుండా బయటకు వెళ్లి పోయింది,

వాడు భయం తో సర్... ఇక్కడ పెట్టాలా అన్నాడు, నేను అవును అన్నాను.

వాడు నన్ను చిత్రం గా చూస్తూ గదిలో సామాను వదిలేసి వెళ్ళాడు.

నేను నా కాళీ షూ విప్పి పక్కనే వున్నా ఒక్క పెద్ద గది తలుపు తేరుకుకొని లోపలికి వెళ్ళాను.

అక్కడ నాకు ఒక తెల్లటి వెలుగు ప్రత్యక్షం అయి,అది రెండుగా , తర్వాత మూడుగా, నాలుగుగా విడి పోయి మాయం అయిపొయింది.

ఒక్క నిముషం నా కళ్ళకు అదేదో మాయలా అనిపించింది.

ముందుకు వెళ్ళాను.

హాలు మధ్యలో ఒక పెద్ద ఊయల, దాని పక్క ఒక కుర్చీ వేసి వున్నాయి.

నా రెండు మోకాళ్ళ మీద కూర్చొని,తలా వంచి, ఆ ఊయలకు కుర్చీకి నమస్కరించాను.

ఎదో చెయ్యి నన్ను తాకినట్లు ఆశీర్వదిస్తున్నట్లు అనిపించి నా వొళ్ళు పులకించి పోయింది.

పక్కన గోడకు పెద్ద తైలవర్ణ పటం.

ముందడుకు వెళ్లి చూసా.

ఆ ఇంటి దేవుళ్ళు.

తలా వంచి నమస్కరించాను.

ఆ దేవుళ్ళు ఎవరో కాదు.

మా అమ్మ-నాన్నలు.
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ,ఆత్మఅనుబంధం - by sarit11 - 03-12-2018, 10:55 AM



Users browsing this thread: 2 Guest(s)