29-08-2020, 02:40 PM
ఈనాటి తెలుగు వచనం
క్రమక్రమంగా ఈ ఉద్యోగాల్లో తెలుగు మీద ఏ విధమైన పట్టు లేనివాళ్లు, అంతో ఇంతో ఇంగ్లీషు మాత్రమే చదువుకున్నవాళ్లు చేరారు. దీని ఫలితంగా తెలుగు పత్రికల్లో భాష ఇటు తెలుగూ కాని, అటు ఇంగ్లీషూ కాని ఒక విలక్షణమైన స్థితికి చేరుకుంది. ఇంగ్లీషుకి సమానమైన ఏ తెలుగు మాటా వెంటనే తోచకపోతే, ఆ ఇంగ్లీషు మాటనే వాడెయ్యడం ఈ కొత్త ఉపసంపాదకులు అలవాటుచేసుకున్న పద్ధతి.
ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రికలో మాకు కనిపించిన, తెలుగు అక్షరాలలో రాసిన, కొన్ని ఇంగ్లీషు మాటల జాబితా ఇది: రూమరేనట, బిగ్ బ్రేకింగ్ న్యూస్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం, బ్యాంకింగేతర లావాదేవీలు, ఫిస్కల్ రోడ్‌మ్యాప్, టెంపర్ టాంట్రం, ట్రెండింగ్ ఫోనులు, ఫ్యాబ్రిక్‌తో ఫోన్ వ్యాలెట్, విమానాలు ల్యాండు చేసి, కన్‌ఫం చేశారు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, పాక్ ఆర్మీ, రైల్వే జోన్ పరిథిలో సింథటిక్ వినియోగానికి చెక్ చెబుతున్నారు… (ఇది కేవలం ఈ దినపత్రికకే ప్రత్యేకమయిన జాడ్యం కాదు.)
ఇక పోతే కర్త కర్మలను పట్టించుకోకుండా ఏ అన్వయమూ లేకుండా రాసిన వాక్యాలు అన్ని తెలుగు పత్రికల్లో కొల్లలుగా కనిపిస్తాయి. అవి చదివి వార్తలు ఇలాగే వుంటాయి అని సహించి వూరుకుంటున్న తెలుగు పాఠకుల ఔదార్యాన్ని మన్నించాలి.
కవిత్వం, కథలు కాకుండా ఆలోచనాపరమైన విమర్శలతో, వ్యాసాలతో గట్టిగా చదువుకున్నవాళ్లు ప్రాచీన, మధ్యకాలపు, ఆధునిక రంగాలలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆలోచనల్ని పురస్కరించుకుని వ్యాసాలు రాసే మేధావులు కానీ, అవి ప్రచురించే పత్రికలు కానీ మనకి లేవు. తెలుగులో మేధావులకు కావలసిన ప్రోత్సాహం లేదు. అంచేత మేధావి అని చెప్పడానికి అనువైన ప్రమాణాలు లేవు. వాళ్లని గుర్తించే సమాజమూ లేదు.
తెలుగులో పద్యాలు రాసేవాళ్ళకి చాలా నిక్కచ్చి అయిన శిక్షణ వుండాలనే నియమం వుంది. కథలు రాసేవాళ్ళకి కూడా, మంచి కథలు అని గుర్తింపు పొందిన కథలు అనేకం చదవడం మూలంగా వొచ్చిన అనుభవం వుంది. కాని, వచనమంటే నోటికి ఏది వస్తే అదే రాసే వాక్యాలు అనే అభిప్రాయమే మన మనసుల్లో వుంది. వచన రచనకి ప్రత్యేకమైన శిక్షణ కావాలని, వ్యాసనిర్మాణానికి నియమాలు, పద్ధతులు ఉన్నాయని, ఆలోచనలు చెప్పడానికి, అవి స్పష్టమైన భాషలో రాయడానికి ప్రత్యేకమైన తర్ఫీదు అవసరమని, ప్రతి ఆలోచనారంగానికీ అనువైన ఒక తార్కిక విధానం వుందని, ఆలోచనల్లో క్లిష్టత, వాక్యనిర్మాణంలో సరళత, రెండూ కలుపుకున్నదే మంచి వచనమని మనకి చెప్పేవాళ్లు ఎవరూ లేరు. బళ్ళు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల్ని సమాచారం కంఠతా పట్టి అప్పచెప్పేవాళ్ళుగానే తయారుచేస్తున్నాయి కాని విమర్శతో కూడిన ఆలోచన చేయగలవాళ్ళుగా తయారుచేయడం లేదని మనం ఇప్పటికీ గుర్తించడంలేదు. విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలు మరో విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నాయి. తెలుగులో పిహెచ్.డి.లు తయారవడం మొదలుపెట్టి దాదాపు 90 ఏళ్లు కావస్తున్నా డజన్ల కొద్దీ పిహెచ్.డి.లు తయారవుతున్నా, ఇంతవరకూ సిద్ధాంత నిరూపణ కోసం ఎలా పరిశోధన చేయాలి, ఏమి చదవాలి, తన పరిశ్రమ చేస్తున్న రంగంలో ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి? అనే విషయంలో ఏ రకమైన ప్రావీణ్యం లేకుండా నానాటికీ చవకబారు పిహెచ్.డి.లు వస్తున్నాయి. పిహెచ్.డి. కోసం రాసిన థీసిస్ ఎంత చవకబారుగా వున్నా, డాక్టర్ అనే బిరుదుకి మాత్రం గౌరవం పెరిగిపోయింది. కవిత్వం రాసేవాళ్లు కూడా పేరు ముందు డా. అని పెట్టుకుంటున్నారు.
తెలుగు భాషలో వాక్యనిర్మాణక్రమం కానీ, వాక్యాన్ని వాక్యాన్ని కలిపి ఒక ఊహని సహేతుకంగా ఒక పద్ధతిలో రాయడం కానీ ఎలాగో మనం ఎప్పుడూ నేర్పలేదు. పిల్లలకి తెలుగు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పదస్వరూపంలో తప్పుందా, అరసున్నాలు, బండి-రలు సరిగా ఉన్నాయా లేదా, సంధులు సరిగా చేశారా లేదా, ఇవే పట్టించుకున్నారే కానీ వాక్య నిర్మాణ క్రమాన్ని, ప్రసంగ పాఠపు పొందికని ఎప్పుడూ గమనించలేదు. ఈ రోజుక్కూడా తెలుగు వచనంలో ఆ లక్షణాలు సరిగ్గా లేవు. మంచి వచనం అంటే ఏమిటి అన్నదాని గురించి ఆలోచన లేదు, శిక్షణా లేదు. ఈ సంగతి దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం రాస్తున్న తెలుగు వచనాన్ని పరిశీలిస్తే ఎంత మంది పెద్ద పేరున్న తెలుగువాళ్లు అవలీలగా గజిబిజి వాక్యాలు రాస్తారో, గందరగోళంగా ఊహలు చెప్తారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంగ్లీషు నుంచి మనం కామాలు, ఫుల్‌స్టాపులు, ఆశ్చర్యార్థక గుర్తులు, ప్రశ్నార్థకాలు తెచ్చుకున్నాం సరే. ఇవి వచ్చిన తరవాత కూడా పేరాగ్రాఫులు ఎలా కూర్చాలి, పేరాగ్రాఫు ఎక్కడ అయిపోతుంది, మొదటి పేరాగ్రాఫుకి రెండవ పేరాగ్రాఫుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఈ వ్యాసంలో చెప్పిన ఊహ మళ్లామళ్లా చెప్పామా, ఆ చెప్పిన ఊహ స్పష్టంగా చెప్పామా, ఇందులో అక్కర్లేని వాక్యాలు ఎన్ని ఉన్నాయి, నిరాధారమైన విషయాలు అస్పష్టంగా చెప్పినవి, బాధ్యత లేకుండా రాసిన వాక్యాలు ఈ వ్యాసంలో ఉన్నాయా? వంటి ప్రశ్నలు వేసుకుని చూస్తే ఇవాళ అచ్చయిన పుస్తకాలలో వున్న వచనంలో ఎన్ని లోపాలున్నాయో మనకు తెలుస్తుంది.
ఈ లోపాలని ఎలా సవరించుకోవాలి అన్న ప్రశ్న మనకు పుట్టనే పుట్టదు. రాసింది రాసినట్లే అచ్చు కావటం, ఇంతే మనకు కావలిసింది. ఈ రకమైన విశృంఖలమైన స్వేచ్చకి వ్యావహారిక భాషా వాదం బోలెడు సాయం చేసింది. ఒక మాట వ్యాకరణం ప్రకారం సాధువా కాదా అని ఆలోచించవలసిన రోజుల్లో అందమైన వాక్యానికి, నిర్దుష్టమైన వాక్యానికి తేడా చూసుకోవలసిన అవసరం మాత్రమే ఉండేది. వ్యావహారిక భాషా వాదం వచ్చి మనకు నేర్పినది ఏమిటి అంటే, మనకు నోటికి వచ్చిన వాక్యం ఎలాంటి శిక్షణా లేకుండా హాయిగా రాసేయవచ్చు అని.
ఈ రకమైన విశృంఖలమైన స్వేచ్ఛ వల్ల ఇప్పుడు తెలుగు భాషలో రచన ఏ స్థితిలో వుంది? ముందు రచనలని రెండు భాగాలు చేద్దాం. ఒకటి సాహిత్య రచనలు: పద్యాలు, వచన పద్యాలు, పాటలు, కథలు, నవలలు, ఇలాంటివి. వీటిని ఎవరూ ఏ రకంగానూ శాసించకూడదు. కవి, రచయిత, ఆడ, మగ, ఎక్కువ కులాలవారు, తక్కువ కులాలవారు, హిందువులు, ముస్లిములు, ఇంకా అనేక సమూహాలవాళ్లు తమ సృజనాశక్తిని, ఆలోచనని, ఉద్యమాలని, ఊహల్ని, రకరకాల భాషల్లో వాళ్లకి ఇష్టమొచ్చిన పద్ధతిలో రాయనివ్వండి. ఆ రకమైన రచనలకి భాష పరంగా ఏ రకమైనటువంటి నియమాలు అక్కరలేదు.
రెండవది, ఇక మిగిలినది, వచనం. కేవలం ఆలోచనలు స్పష్టంగా చెప్పడానికి మాత్రమే వచనం ఉపయోగపడాలి. ఇది రాసే భాష వ్యావహారిక భాష అనే పేరు పెట్టుకుంటే తప్పులేదు కానీ ఇది ఆధునిక రచనాభాష అని గుర్తించాలి. ఈ భాషకి ఏకత్వం, ప్రామాణికత ఉండి తీరాలి. ఇప్పటికీ దీనికి మంచి పేరు ఏర్పడలేదు. ఏమయినా ఇది కథలు, కావ్యాలు రాసే భాష కాదని, ఆలోచనలు రాసే భాష మాత్రమే అని, ఇది రచనా భాష అని, అక్షరాలా మాట్లాడే భాష కాదని–గుర్తించాలి. భాషా చర్చల్లో పాల్గొన్న కొన్ని వందల మంది–గిడుగు రామమూర్తిగారి దగ్గరినుంచి వీధిని పోయే దానయ్య వరకు–ఎవరూ స్పష్టంగా చెప్పలేదు, ప్రపంచంలో ఏ భాష కూడా అక్షరాలా మాట్లాడినట్టు రాయబడదని, రాసినట్టు మాట్లాడబడదని. అంచేత రాసే భాషకి ఒక రకమైన ప్రామాణికత, కొన్ని నియమాలు ఉండక తప్పదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు, ఎవరు పలికినట్లు వాళ్లు రాయొచ్చు, అదే వ్యావహారిక భాష అనే అభిప్రాయం తెలుగు వచనాన్ని ఏ స్థితికి తీసుకొచ్చిందో ఏ ఒక రోజు పత్రికల్ని చూసినా తెలుస్తుంది.