Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కవితలు
#5
ప్రియా.... అన్నీ కరిగిపోతాయ్... నీ ప్రేమ మాత్రం....
సోర్స్:webdunia.com


కొవ్వొత్తి కరిగిపోతుంది
క్షణం గడిచిపోతుంది
వెలుగు చీకటవుతుంది
పున్నమి అమావాస్య అవుతుంది

నీటి చినుకు ఆవిరవుతుంది
కారు మేఘం మాయమవుతుంది
ఇంధ్ర ధనుస్సు ఇంద్రజాలమవుతుంది
సముద్రపు కెరటం అంతర్థానమవుతుంది

చెట్టు ఆకులు రాల్చుతుంది
పిట్ట కూత ఆగిపోతుంది
చేనుగట్టు చిత్తడి ముద్దగా మారిపోతుంది
పంటచేను పండిపోయి పడిపోతుంది

కానీ
ఈ భూమి తిరుగుతుంది
కాలం గమనిస్తూనే ఉంటుంది
మనిద్దరి ప్రేమ నిత్యం కొత్త చిగురులేస్తూ ఉంటుంది
విశ్వంలో నక్షత్రాల్లా మన ప్రేమ తళుకులు
నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి

నీ హృదయ సవ్వడులు
నిత్యం నా హృదయంతో పరవడి చేస్తూనే ఉంటాయి
ప్రాణాలు పోయినా... ఆత్మలుగా అహరహం
నువ్వూ నేనూ ఒకటే ప్రియా...
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply


Messages In This Thread
కవితలు - by krish - 02-12-2018, 08:41 PM
RE: కవితలు - by krish - 02-12-2018, 08:43 PM
RE: కవితలు - by krish - 02-12-2018, 08:47 PM
RE: కవితలు - by అన్నెపు - 02-12-2018, 09:09 PM
RE: కవితలు - by krish - 03-12-2018, 05:40 AM
RE: కవితలు - by krish - 03-12-2018, 05:44 AM
RE: కవితలు - by SIri - 03-12-2018, 08:26 PM



Users browsing this thread: 4 Guest(s)