Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి
#77
ఏమి చెపితిరి ఏమి చెపితిరీ....ఆమని గారూ మనిషికి ఎన్నో బాధలు. ఒకొక్కడిదీ ఒకో మన:తత్త్వం ఇంట్లో ఒకే కడుపునా పుట్టిన పిల్లలు ఒకలా ఉండట్లేదు. అలాంటిది వెబ్సైట్ కు వచ్చే వాళ్ళు ఒకొక్కళ్ళూ ఒకోలా ఉంటారు. 
మీ వ్రాసే శైలి నిజంగా చాలా బాగుంది. ఒక చోట కూడా నాకు అతి కనిపించలేదు. complete entertainer.
ఇక 
కడుపులో బాగోలేనివాడికి పరమాన్నం పెట్టినా.....పచ్చి పులుసు పెట్టినా ఒకటే......సమాధానం వద్దు అంటూ....ఇది కథకీ వర్తిస్తుంది.
ఒక పేరున్న గవర్నమెంట్ సంస్థలో సైంటిస్ట్స్ ఒకటి కనిపెట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. దానికి సంబంధించి ఒక ఒక డివైస్ చేశారు. సపోర్ట్ డివైస్ విదేశాల నుండీ తెప్పించాలి. తెపించారు. కానీ వీళ్ళు కనిపెట్టినది టైం బార్ అయిపొయింది. 

అలాగే, కథకి కూడా ఒక టైం ఉంటుంది. ఒక కథ ఒక టైంకి ఆనందాన్ని ఇస్తుంది. అన్ని టైం లకి ఇవ్వదు. 

త్యాగయ్య గారు చెప్పినట్లు సమయానికి తగు మాటలాడీ అన్నట్లు....ఆ సమయాన్ని వినియోగించుకంటేనే మనం మన్నగలం. పైరు వేసినప్పుడు కలుపు మొక్కలూ వస్తూ ఉంటాయి. పైరు కన్నా కలుపు మొక్కలే ఎక్కువగా ఎదుగుతాయి.
అలానే పనికిరాని ప్రబుత్తులే ఎక్కువ. వాళ్ళే ఎదుగుతారు., మనం పీకేసేవరకూ.....

ఇంతకన్నా చండాలాలు లైఫ్ లో చూసి ఉంటాము. కాబట్టి వీటికే మనం స్పందిస్తే.....మనం ఎక్కడున్నట్లు?మీరు మంచి కథలు అందించి మమ్ముల్ని అలరించారు. అంత కన్నా సక్సెస్ ఏముంది. మీరు సక్సెస్ అండీ.....మీరు గెలిచారు. be హ్యాపీ; మీ పేరుకి ఏ పిల్ల కాకులూ అడ్డు నిలవలేవు. 

మీరు వ్యక్తిగా ఫుల్ అండ్ అబ్సొల్యూట్.
Like Reply


Messages In This Thread
RE: దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి - by kamal kishan - 26-08-2020, 11:08 PM



Users browsing this thread: 13 Guest(s)