Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
క్రిష్‌కు గురజాడ సాహితీ పురస్కారం
#3
(02-12-2018, 05:32 PM)krish Wrote:
క్రిష్‌కు గురజాడ సాహితీ పురస్కారం
సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రి్‌ష)ను గురజాడ సాహితీ సమాఖ్య ‘గురజాడ సాహితీ పురస్కారం(2018)’తో సత్కరించింది. బంగారు ఉంగరం, వస్త్రాలతో పాటు, జ్ఞాపిక అందజేసింది. ఏటా గురజాడ అప్పారావు వర్ధంతిని పురస్కరించుకుని ప్రముఖులకు ఈ పురస్కారం అందజేస్తోంది. విజయనగరం ఆనంద గజపతి కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ అశోక్‌గజపతిరాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు క్రిష్‌కు పురస్కారాన్ని అందజేసి అభినందించారు.

యార్లగడ్డ మాట్లాడుతూ గురజాడ నివసించిన ఇంటి అభివృద్ధి విషయమై కేంద్ర సాంస్కృతికశాఖ దృష్టికి తీసుకువెళ్లాలని ఎంపీ అశోక్‌ గజపతిరాజును కోరారు. గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి మాట్లాడుతూ కన్యాశుల్కం, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ రచనలతో గురజాడ సమాజాన్ని జాగృతం చేశారని పేర్కొన్నారు. గురజాడ రచన గొప్పదనాన్ని మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ వివరించారు. క్రిష్‌ మాట్లాడుతూ ఈ పురస్కారం రావడం ఆనందంగా ఉందన్నారు.
గురజాడ  సాహిత్య పురస్కారం వేరు. ఈ అవార్డు సాహిత్యం, కళల్లో  ఇస్తారు.
సాహిత్య పురస్కారం వేరు.
గురజాడ అప్పారావు పురస్కారం కేవలం 5గురికి ఇచ్చారు.  వారిలో ప్రముఖులు కాళీపట్నం రామారావు; ఆవంత్స సుందర్ లు.
ఇంకా సాహిత్య అవార్డు 25 మందికి ఇచ్చారు.  అందులో  ఉన్నాడేమో?!
Like Reply


Messages In This Thread
RE: క్రిష్‌కు గురజాడ సాహితీ పురస్�... - by kamal kishan - 02-12-2018, 09:42 PM



Users browsing this thread: 1 Guest(s)