Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
ఎపిసోడ్ 25

మూడు రోజులు అక్క, బావ లతో గడిపి బెంగుళూరు లో కొత్త ఉద్యోగం ట్రైనింగ్ కి జాయిన్ అయ్యేట్టు ప్లాన్ చేసుకొని, సౌమ్య తో పాటు జానకి, రాజారావు లు హైదరాబాద్  వచ్చారు. కావ్యకు సహాయం చేయడానికి మనిషి దొరకక పోవడంతో సీతను కూడా తీసుకు వచ్చింది జానకి. కొంచెం విచార వదనంతో వీడ్కోలు పలికిన చెల్లిని మళ్ళీ మాములుగా చూడటంతో సంతోషించింది కావ్య. రాగానే బాబుని ఆడిస్తూ, బావతో మునుపటి లాగే చలాకీగా మాట్లాడటంతో ఇక వాళ్ళ మధ్య ఏమి జరిగిందా అన్న విషయం గురించి మరచిపోయింది.

మరుసటి రోజు ఆఫీస్ నుంచి చాలా ఉత్సాహంగా వచ్చాడు శ్రీరామ్. స్నానం చేసి, బెడ్ రూమ్ లో బట్టలు మార్చుకుని కావ్యను పిలిచి అసలు విషయం చెప్పాడు. ఆనందంతో ముద్దులు పెట్టి తర్వాత అందరికి చెపుదాము అని నిర్ణయించుకున్నారు. శ్రీరామ్ తో స్వీట్స్ తెప్పించింది కావ్య. రాత్రి భోజనాలు తర్వాత అందరూ కూర్చున్నారు. అందరి మధ్య శ్రీరామ్ అసలు విషయం చెప్పాడు. అమెరికాలో తమ కంపెనీ IPO కి వెళ్ళబోతున్నట్టు, కంపెనీ ప్రాధమిక అంచనా ప్రకారం శ్రీరామ్ స్టాక్ ఆప్షన్స్ విలువ దాదాపు  ఒకటిన్నర మిలియన్ డాలర్స్ పైనే ఉన్నట్టు. రూపాయలలోకి మారిస్తే పది కోట్ల పైమాటే. అందరు అభినందనలు తెలుపుతుంటే కావ్య స్వీట్స్ పంచింది. రాజారావు, జానకి లు కూడా చాలా ఆనంద పడ్డారు. అంత త్వరలోనే అల్లుడు పైకి ఎదుగుతాడనే ఆలోచన లేదు, వాళ్ళిద్దరికీ.

"ఈ స్వీట్ సరిపట్టేస్తే సరిపోదు బావ. ఇంకా చాలా పెద్ద పార్టీ ఇవ్వాలి", అంది సౌమ్య బావ చేయి షేక్ హ్యాండ్ ఇస్తూ ఊపేస్తూ.

"అలాగే డబ్బులు వచ్చిన తరువాత. మేమంతా ఎంప్లాయిస్ కంపెనీ పబ్లిక్ వెళ్లిన ఆరు నెలల వరకు అమ్మటానికి లేదు. డబ్బులు వచ్చాక చూద్దాం".

"అలా తప్పించుకుంటే కాదు. ఇప్పుడు ఒక పార్టీ. తరువాత డబ్బులు వచ్చాక ఇంకో పెద్ద పార్టీ లేకపోతె మీ ఇంట్లోంచి కదిలేది లేదు. ఇంతకీ ఆ డబ్బుతో ఏమి చేస్తావు బావ?" అంది తన పక్కనే చనువుగా కూర్చుంటూ. కావ్య ఓరకంట కనిపెడుతూనే ఉంది. చెల్లి పూర్వంలా ఉన్నందుకు ఆనంద పడింది. ఏమి మాట్లాడకుంటా వాళ్ళ మాటలు వింటుంది.

"మీ అక్కకి ఇండిపెండెంట్ ఇల్లు అంటె ఇష్టమని చెప్పింది. డబ్బులు వచ్చాకా ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ లో చూస్తాము. డౌన్ పేమెంట్ చాలా ఉంటుంది బుక్ చేయటానికి. చూద్దాం. చాలా రోజుల మాట. "

రాజారావు అందు కున్నాడు,"ఏమి అనుకోకు బాబు. ఇలా చెబుతున్నందుకు. ఈ  లోపులే మీరు వెదకండి. ఏదైనా నచ్చితే డౌన్ పేమెంట్ నేను కడతాను. మీకు డబ్బులు వచ్చినప్పుడే ఇద్దురు కాని." అల్లుడు ఏమంటాడా అని ఎదురు చూసాడు.

ఒక సారి కావ్య కేసి చూసాడు శ్రీరామ్. ఆమె నవ్వుతో భార్య మనోగతం అర్ధం అయ్యింది. "అలాగే మామయ్యా, కనీసం బ్యాంకు వడ్డీ అయినా తీసుకోవాలి."

అదే మంచి సమయం అని జానకి కూడా అందుకుంది."కావ్య! ఉద్యోగంలో చేరి సంవత్సరం అవుతోంది. నేర్చుకోవలసింది ఈపాటికే నేర్చుకొని ఉంటావు. నీకు ఇంకా చేయాలనీ ఉంటె నాన్నకే సహాయం చేయొచ్చు కదా?"

నిజానికి కావ్య మనసులో ఆ ఆలోచన ఉంది. బాబు పుట్టిన తరువాత ఎవరితోనో వాడిని వదిలి వెళ్ళటం అంత ఇష్టం లేదు. తను చొరవ తీసుకోకుండా తల్లి తండ్రుల దగ్గర నుంచి ఆ ప్రతిపాదన వస్తే బాగుంటుందని ఎదురు చూస్తోంది.

భర్త వేపు ఒక సారి చూసి, "అలాగే అమ్మ. నోటీసు ఇచ్చి ఇంకో నెలలో రిలీవ్ అయిన తరువాత చూద్దాం. నాన్న నాకు కనీసం ఇరవై శాతం ఎక్కువ ఇస్తేనే", అంది నవ్వుతూ.
"నీవు వస్తానంటే నా కదే ఆనందం. ఎంత కావాలో నువ్వే డిసైడ్ చేయి" అన్నాడు తండ్రి ఆనందంతో.

సరదాగా మాటలు నడుస్తున్నాయి. సౌమ్య ఎప్పటిలాగే బావను కెలికింది అందరి ముందూ. "బావా నువ్వు ప్రేమ వివాహం ఎందుకు చేసుకోలేదు?"

బాబుకి పాలు పడుతున్న కావ్య అందరితో పాటు మౌనంగా భర్త ఏమి చెబుతాడా అని ఒక చెవి అటు పడేసింది.

"ప్రేమ అనేది కాలేజీలో లేక పని చేసే చోట ఎవరితోనైనా పరిచయం అయితే, వారు నచ్చితే ఆ స్నేహం ప్రేమగా రూపాంతరం చెందుతుంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు పూర్తిగా చదువు, తరువాత ఫ్యూచర్ మీదే ధ్యాస పెట్టేవాడిని. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో నాన్న గారు నాకు పంపించేది జాగ్రత్తగా ఉంటేనే సరిపోయేది. ఎవరినైనా రెస్టారెంట్  కు తీసుకు వెళ్ళటానికి కూడా డబ్బులు ఉండేవి కావు. అమెరికాలో MS చేస్తున్నప్పుడు కూడా అంతే. అక్కడ జాబ్ లో జాయిన్ అయిన తరువాత అమెరికా చదువు కోసం ఇండియాలో తీసుకున్న లోన్లు తీర్చేదానిమీదే దృష్టి. వారాంతాల్లో డ్రైవ్ చేసుకుంటూ అమెరికా చూడటం అలా గడిచి పోయింది. ఇండియా వచ్చి సెటిల్ అయ్యాకా మా పేరెంట్స్ పెళ్లి అంటె ఒప్పుకున్నాను. మొదటి సంభందమే మీది. ఆ తరువాత నీకు తెలిసిందే."

కాలేజీలో తన భర్త ఆర్ధిక పరిస్థితి విని కొంచెం చివుక్కుమన్నా నిజాయితీగా చెప్పడం, కష్టపడి స్వశక్తితో పైకి రావడంతో కొంచెం గర్వపడింది మనసులోనే.

సౌమ్య అంతటితో ఆపెయ్యకుండా, "ఇక్కడ కొచ్చి సెటిల్ అయిన తరువాత అయినా ప్రేమ వివాహం ప్రయతించలేదా? మీ పేరెంట్స్ ఒప్పుకోరనా?" అంటూ రెట్టించింది.

"లేదు. పెళ్లి విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. వాళ్ళు సంభందం చూసినా అంతిమ నిర్ణయం నాదే. అందరికి నచ్చితే బాగుంటుందని వాళ్లనే చూడమన్నాను, అంతే."

"అయితే ప్రేమ వివాహం అయితే అందరికి నచ్చదంటావు." కూతురి మాటలతో తనలో ఏమయినా ఆ ఆలోచన ఉందా అన్న అనుమానం కలిగింది తల్లి తండ్రులకు.

"నేను అలా అని చెప్పలేదు. ఎవరికీ ఏ పద్దతి నచ్చితే అదే. నీ అక్క నేను సంతోషంగా ఉన్నాము కదా. కాకపొతే పెద్దవాళ్లకు అనుభవంతో అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. తెలిసిన వాళ్ళతో వాకబు చేయించి మంచి చెడులు తెలుసుకుంటారు. నీ మాటను గౌరవించే తల్లితండ్రులు వున్నారు. నీకు ఎవరైనా దృష్టిలో ఉంటె పేరెంట్స్ తో కాని, లేకపోతె నీతో అతి సన్నిహితంగా ఉండే నీ అక్కతో కాని చర్చించి నిర్ణయం తీసుకో. మేమందరం నీ ఆనందాన్నే కోరుకొనేది."

తమ మనసులో ఉన్న అనుమానం లాంటిందే అల్లుడికి కలిగిందా అని ఆశ్చర్యం పోయారు. కాని అల్లుడు చెప్పిన తీరు బాగా నచ్చింది.

"నీ మనసులో ఎవరైనా ఉంటె బావ చెప్పినట్టు మాతో నైనా చెప్పు, అక్కతోనైనా డిస్కస్ చేయి. మా సహకారం నీకు ఎప్పుడు ఉంటుంది."అన్నాడు రాజారావు.

"అదేమీ లేదు నాన్న. బావ ఏమంటాడో అని పరీక్ష చేస్తున్న."

"ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావు. నీకు పెళ్లి సంభందాలు చూడ మంటావా?"అంది జానకి, ఆ వేడి మీదే కూతురి సమ్మతం తీసుకుందామని.

"బావ లాంటి వాడు దొరికితే నేను రెడీ", అంది శ్రీరామ్ కేసి ఆరాధనగా చూస్తూ.
"మొదలు పెట్టండి నాన్న. ఎలాగూ సమయం పడుతుందిగా", అంది అప్పటి వరకు మౌనంగా ఉన్న కావ్య.

నిద్ర వస్తుందని తమ గదిలోకి వెళ్లిపోయారు రాజారావు, జానకి. శ్రీరామ్ కూడా వెళ్ళిపోయాడు నిద్ర వస్తుందని.

"బావకు బోల్డంత డబ్బు వస్తుంది కదా! అక్కా ఏమిటీ స్పెషల్?" అని అడిగింది సౌమ్య.
"చెప్పు. నీకు ఏది కావాలంటే అది"
"నేనడుగుతుంది నా గురించి కాదు. ఈ రాత్రి బావకి స్పెషల్ ఏమిటి అని" అంది కొంటెగా నవ్వుతూ తగ్గు స్వరంలో.
"ఏయ్ నీకు బాగా బలిసిందే", అంది చిరు కోపంతో  వీపుపై చిన్నగా చరుస్తూ.
"నేను వెళ్తా. బావ ఎదురు చూస్తుంటాడు. నువ్వు కూడా పడుకో."
"నీకేమిటే. బావతో ఫుల్ ఎంజాయ్ చేసి హాయిగా నిద్రపోతావు. నాకు ఎప్పటికి నిద్ర పట్టెను?"
"తొందరగా పెళ్లి చేసుకో. నీవు ఎంజాయ్ చేయొచ్చు."
"ఎవరో ఎందుకు? బావనే చేసుకుంటే పోలా."
"ఆ ఆశలు పెట్టుకోకు. నేను ఒప్పుకున్నా, నీ బావ ఒప్పుకునే రకం కాదు." ఆ సంభాషణను అక్కడితో ఆపేస్తూ బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది కావ్య.

*********************

ఆ రాత్రి గదిలో శబ్దం బయటకు పోకుండా, శ్రీరామ్ తలుపు దగ్గర ఫ్లోర్ మాట్ పెట్టబోతుంటే వారించింది కావ్య. 

"రోజు ఆలా ఫ్లోర్ మాట్ పెట్టాలంటే కష్టమే శ్రీ. నీకు అంత ఇబ్బందిగా ఉంటే కార్పెంటర్ తో ఫిక్స్ చేయించు. అయినా మన గదిలో ఏమి జరుగుతుందో ఈ బుడ్డోడికి తప్పితే అందరికి తెలుసు."

"ఇంట్లో పెళ్లి కానీ ఆడపిల్లను పెట్టుకొని...." ఆ మాటను ముగించపోయినప్పటికీ తను ఏమి చెప్పదలుచుకున్నాడో అర్ధం అయ్యింది.

"అది అమాయకురాలేమి కాదు. ఎదో పోర్న్ వీడియోలు చూస్తూనే ఉంటుంది. ఎలాగూ పెళ్లి చెయ్యబోతున్నారుగా. దాని గురించి మరి అంతగా ఆలోచించకు" అంటూ దగ్గరకు లాక్కుంది.

*********************

మరుసటి కావ్యకు సంభందం కుదిర్చిన పురుషోత్తమ రావుకి ఫోన్ చేసి చెప్పాడు. అలాగే తెలిసిన దగ్గరి బందువులకు, స్నేహితులకు ఫోన్ చేసి కూతురికి పెళ్లి సంభందం వెదుకుతున్నట్టు తెలియ చేసాడు. అలాగే అల్లుడికి చెప్పాడు తనకి తెలిసిన ఫ్రెండ్స్ లో ఎవరైనా సరిపోయేవారు ఉంటె చూడమని. కావ్య సౌమ్యను ఆట పట్టించ సాగింది. సౌమ్య మాత్రం ఎలాంటి వాడు వస్తాడా అని ఒక సందిగ్ధావస్థలో వుంది. ఆదివారం మధ్యాహ్నం ఫ్లైట్ లో బెంగుళూరు వెళ్లి పోయింది సౌమ్య. సీతను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి విజయవాడకు బయలుదేరారు తల్లి తండ్రులు.

కల్యాణ మొచ్చిన కక్కు వచ్చినా ఆగదంటారు. రెండు నెలల్లోనే సౌమ్యకు సంభందం కుదిరింది. శశిధర్ ఇంజనీరింగ్ చదివి ఐఐఎం బెంగుళూరులో MBA చేసి ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్ గా మూడేళ్ళుగా పని చేస్తున్నాడు. చిన్న వయసులోనే తండ్రి పోయాడు. ఉన్నపొలంతో కష్టపడి చదివించింది అతని తల్లి. ఆమెది బొత్తిగా పల్లెటూరి వ్యవహారం. అందుకనే ఇద్దరూ బెంగుళూరులోనే వున్నా, విజయవాడలోనే ఫార్మల్ గా పెళ్లి చూపులు ఏర్పాటు చేసాడు రాజారావు. అందరికి నచ్చినా బావ కూడా మాట్లాడాలని పట్టు పట్టడంతో, శ్రీరామ్ కూడా బెంగుళూరు వెళ్లి అతనిని కలసి గ్రీన్ సిగ్నల్ అవ్వడంతో పెళ్లి నిశ్చయం చేసారు.

*********************

మొదటి కూతురి పెళ్లి లాగానే, చాలా ఘనంగా చేసారు సౌమ్య వివాహం కూడా. కోటి రూపాయలు పైనే పెట్టి బెంగుళూర్లో లగ్జరీ అపార్ట్మెంట్ కొనిచ్చాడు రాజారావు. అలాగే ఒక కార్ కూడా. అలాగే లాంఛనాలు కూడా భారీగా ముట్ట చెప్పరు. ఏ మాత్రం మొహమాటం లేకుండా స్వీకరించారు అవన్నీ.

పెళ్ళైన తర్వాత శ్రీరామ్, కావ్య లను ప్రైవేట్ గా కూర్చొపెట్టుకొని భార్య సమక్షంలో తన అభిప్రాయం చెప్పాడు రాజారావు.
"నా ఆస్తికి నా కూతుళ్లిద్దరూ సమానంగా వారసులు. పెళ్లి ఖర్చులు పక్కన పెడితే, రెండు కోట్ల దాకా ఇచ్చాము సౌమ్యకు. మీ పెళ్ళికి నువ్వేమి తీసుకోలేదు. న్యాయంగా మీకు నేను అంత డబ్బు ఇవ్వాలి. మీరు కాదనకూడదు."

అంత డైరెక్ట్ గా అడిగేసరికి నోట మాట రాలేదు. నాన్న చెప్పింది సబబుగా ఉన్నా, భర్తే సమాధానం చెబితే బాగుంటుందని కావ్య మౌనం వహించింది.

"కాదనకు బాబు, మామ గారు చెప్పింది న్యాయం కూడాను. మీరిద్దరూ సమానం"అంది జానకి వంత పాడుతూ.

కొంచెం సేపు ఆలోచించి మెల్లిగా నోరు విప్పాడు శ్రీరామ్. "దేవుడి దయ వాళ్ళ, మా పరిస్థితి బాగానే వుంది. మీకు అంతా తెలుసుగా. కానీ మీరు చెప్పింది తోసి పుచ్చడానికి లేదు మామయ్యా. మీకు అంతగా పట్టింపుగా ఉంటె, కావ్య పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వెయ్యండి. ఎప్పుడైనా అవసరం అయితే వాడతాం లేకపోతె మీ పేరు చెప్పి పిల్లలకు ఇస్తాం."

అల్లుడి సంగతి తెలిసి, ఆ మాత్రం మాటకు ఆనందించారు. ఈ రోజుల్లో డబ్బు కాదనుకే వారు అరుదు, దాంతో అల్లుడి మీద గౌరవం, నమ్మకం విపరీతంగా పెరిగిపోయింది.

పెళ్లి అయిన తరువాత కొత్త కాపురం బెంగుళూరులో మొదలు పెట్టారు. శ్రీరామ్ కి పని బాగా ఉండటంతో వెళ్లలేకపోయాడు. వీలున్నప్పుడు బెంగుళూరు వచ్చి తమతో ఒక వారం రోజులు గడపాలని అక్క బావలతో ప్రామిస్ చేయించుకుంది సౌమ్య.

*********************
[+] 12 users Like prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 06-08-2020, 08:12 AM



Users browsing this thread: 27 Guest(s)