Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్
(1999)


ఆ రోజు రాత్రి దేవరాజ్ తన గ్యారేజ్ లో నిశ్చితార్థం ఆగిపోయింది అని డ్రగ్స్ దొరికాయి అని అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఫుల్ బాటిల్ మందు లేపి కోపం లో గ్యారేజ్ లో కనిపించినవి అని విసిరేయడం మొదలు పెట్టాడు తరువాత తాడు తీసి డ్రమ్ మీద ఎక్కి ఉరి వేసుకొబోతుండగా లోపలికి వచ్చాడు జేమ్స్, దేవరాజ్ నీ కిందకు లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు అనుకోకుండా జరిగిన చిన్న తగువు లో దేవరాజ్ డ్రమ్ మీద నుంచి కింద పడుతూ పొరపాటుగా కాలు తో కోడితే జేమ్స్ వెనుక అద్దం మీద పడి మొహం మీద గాజు ముక్కలు ఇరుకుని మెడ తెగి పడి ఉన్నాడు జేమ్స్, దాంతో దేవరాజ్ కూడా పై నుంచి పడడం వల్ల అతని కాలి పైన ఖాళీగా ఉన్న గ్యాస్ సిలిండర్ పడ్డటం తో కాలు విరిగింది అయిన కూడా హడావిడిగా జేమ్స్ చనిపోవడంతో దేవరాజ్ వాడిని పట్టుకొని ఏడ్వడం మొదలు పెట్టాడు దాంతో తనతో తన బెస్ట్ ఫ్రెండ్ నే చంపుకునే లాగా చేసిన వాళ్ళని అసలు వదలకుడద్దు అని నిర్ణయం తీసుకొని తన బదులు జేమ్స్ మెడ చుట్టూ తాడు వేసి ఉరి వేసి మొహం మొత్తం గాజు ముక్కలు ఉండటం తో ఎవరూ గుర్తు పట్టరు అన్న ధైర్యం తో జేమ్స్ నీ తాడు కీ వేలాడతీసి రాత్రి అంత అక్కడే ఏడుస్తు ఉండి పోయాడు దేవరాజ్ ఆ తర్వాత ఉదయం పని వాళ్లు వస్తుంటే కాలు సహకరించలేదు తన కాలు పోయింది అని అర్థం అయ్యింది కానీ అలాగే కుంటుతూ తప్పించుకోని వెళ్లాడు ఆ తర్వాత జేమ్స్ ఇంటికి వెళ్లాడు అక్కడ మెర్సి దేవరాజ్ నీ చూసి షాక్ అయ్యింది తనకు తెలిసిన ఒక డాక్టర్ నీ పిలిచి దేవరాజ్ కీ ట్రీట్మెంట్ చేయించింది ఆ తర్వాత దేవరాజ్ చనిపోయిన విషయం గురించి టీవీ లో వస్తుంటే షాక్ అయ్యి చూసింది మెర్సి, దాంతో జరిగిన విషయం అంతా చెప్పి బాధపడాడు అప్పుడు మెర్సి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేయబోతుంటే దేవరాజ్ కంగారు లో కత్తి తో పొడిచి శవం తీసుకోని కార్ లో వేసుకొని వెళ్లి స్మశానం లో తగలబెట్టి అక్కడి నుంచి తన సొంత ఊరికి వెళ్లాడు. 

అక్కడే కొని సంవత్సరాలు ఉన్నాడు ఆ తర్వాత వనిత కీ రవి కిషోర్ తో పెళ్లి అయ్యింది అని బాధపడ్డాడు తరువాత కొన్ని నెలలకు ఒక నర్స్ తరుణ్ నీ తీసుకోని దేవరాజ్ దగ్గరికి వచ్చింది తనతో పాటు వనిత రాసి ఇచ్చిన లెటర్ ఇచ్చింది అందులో తరుణ్ తన కొడుకు ఉంది దాంతో దేవరాజ్ కీ సంతోషం పెరిగింది వాడి పేరు థామస్ గా మార్చి హైదరాబాద్ కీ వచ్చిన తను దాచుకున్న డబ్బు తో యాక్టింగ్ స్కూల్ పెట్టాడు అలా థామస్ కీ అని చెప్పి పెంచాడు, ఇన్ని రోజులు వనిత దృష్టిలో తనను జేమ్స్ గానే నమ్మిస్తూ వచ్చాడు అలా DK రావు నీ చంపడానికి కుక్క కీ ట్రైనింగ్ ఇవ్వడం నేర్పింది దేవరాజే, ఆ తర్వాత రవి కిషోర్ DK శవం చూడ్డానికి వచ్చినప్పుడు థామస్ injection ఇవ్వడం లో తప్పు చేశాడు అది పొరపాటున ఒక కానిస్టేబుల్ కీ ఇచ్చాడు దాంతో దేవరాజ్, రవి కిషోర్ ముందుకు వచ్చి నిలబడి హగ్ చేసుకొని మెడ పైన గిలి స్ట్రోక్ వచ్చేలా చేసి హాస్పిటల్ లో రవి కిషోర్ కీ తన అసలు రూపం చూపించి తనకు తెలిసిన కల్రీపటు ద్వారా గొంతులో వేలుతో పొడిచి ఊపిరి ఆపి చంపేసాడు అలా ఇప్పుడు ఇంక తన గురించి వనిత కీ చెప్పే అవకాశం వచ్చింది అని లండన్ కీ రప్పించి తన గురించి నిజం చెప్పాడు.

(నాలుగు రోజుల క్రితం బెంగళూరు లో)

సౌమ్యా తో సెంట్రల్ జైలు కీ వెళ్లినప్పుడు శేఖర్ తన తమ్ముడూ గుణ తో కలిసి మాట్లాడుతు ఉన్నాడు "చూడు గుణ నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నీ ఫ్రీడం నీకు ఇప్పిస్తా" అంటూ తన సుట్కేస్ లో నుంచి ఒక పెన్ తీసి అందులో ఉన్న పిన్ నీ వెనుక ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ కీ chloroform ఇచ్చి తరువాత గుణ వైపు తిరిగి "నీకు మ్యాజిక్ ట్రిక్స్ తెలుసు కదా నువ్వు సుట్కేస్ లో చాలా తేలికగా దూరి పోతావు కాబట్టి ఆ బాక్స్ లో దూరు నిన్ను నేను బయటికి తీసుకోని వెళ్లతా నాకూ ఒక హెల్ప్ చేస్తే నిన్ను దేశం దాటించి మళ్లీ అమెరికా పంపిస్తా" అన్నాడు దాంతో గుణ వేరే ఆలోచన లేకుండా తన ఎముకలను విరిచి బాక్స్ లో కూర్చున్నాడు ఆ తర్వాత శేఖర్ బాక్స్ మూసి ఎత్తుకొని బయటకు వెళ్లాడు "అమ్మ నా తమ్ముడా జైలు ఫుడ్ బాగానే పట్టింది ఎదవకి బాగా బరువు పెరిగాడు" అని తిట్టుకుంటు వాడిని తీసుకోని వచ్చి కార్ లో వేశాడు తరువాత గుణ బాక్స్ నుంచి బయటకు వచ్చి సౌమ్యా నీ చూసి "హే బేబి ఇంకా అంతే సెక్సీ గా ఉన్నావు" అన్నాడు దానికి సౌమ్యా చిరాకుగా కార్ దిగి శేఖర్ దగ్గరికి వెళ్లి "ఈ సైకో నా కొడుకు నీ బయటకు తెచ్చావు చంపేస్తా వాడిని" అనింది దానికి శేఖర్ నవ్వుతూ "వాడు బ్రతికి ఉంటే నీకంటే నాకూ రిస్క్ ఎక్కువ ఈ రోజు రాత్రికి వాడు చస్తాడు" అని చెప్పి కార్ లో కూర్చుని ఎయిర్ పోర్ట్ కీ వెళ్లాడు సౌమ్యా ఆశ్చర్యంగా శేఖర్ నీ చూస్తూ వాళ్ళని తీసుకోని ఎయిర్ పోర్ట్ లో దింపి వెళ్లింది కానీ కార్ లో తరువాత ఏమీ చేయాలో రాసి ఒక లెటర్ ఉంచి వెళ్లాడు.

గన్ మీద concentrate చేసిన థామస్ దివ్య ఫోన్ మీద పెట్టలేదు దివ్య ఫోన్ లో థామస్ గురించి అని వివరాలు ఉన్నాయి దాంతో థామస్ తనని చంపుతాడు అని తెలిసి గుణ అనే ఏనుగు నీ ఈ చదరంగం లోకి దింపి థామస్ నీ పక్క దారి లోకి పంపాడు హాస్పిటల్ లో ఉన్నపుడు తన మీద ఎటాక్ జరగగానే గుణ నీ థామస్ వెంట పడమని చెప్పాడు అలా గుణ నీ బిల్డింగ్ మీదకు తీసుకోని వెళ్లి చంపేసాడు, ఆ తర్వాత మాయ కీ ఫోన్ చేసాడు అప్పటికే మాయ కీ శేఖర్ ప్లాన్ తెలియడం తో హాస్పిటల్ కీ వచ్చి శేఖర్ నీ తన ఇంటి లో పెట్టి ట్రీట్మెంట్ చేయించి తరువాత తన షూటింగ్ కోసం లండన్ వెళుతుంటే తనతో పాటు లండన్ కీ వచ్చాడు అలా ఎయిర్ పోర్ట్ లో సాంటా క్లాస్ వేషం లో చందన కోసం చూస్తుంటే థామస్, వనిత అర్జున్ నీ కిడ్నాప్ చేయబోతుంటే ముందే అర్జున్ ఫోన్ నీ కొట్టేసి తనకి చందన కీ వాడి లొకేషన్ పంపించి వనిత కీ hug ఇచ్చినప్పుడు అర్జున్ ఫోన్ నీ వనిత బాగ్ లో వదిలేసాడు అలా అర్జున్, చందన నీ ఫాలో అవుతూ వచ్చి వాళ్ళని కాపాడాడు.

ఆ తరువాత థామస్ నీ కొట్టి కార్ డిక్కి లో వేశాడు అప్పుడు చందన శేఖర్ తో "చందు దేవరాజ్ ఇంకా బ్రతికే ఉన్నాడు" అని చెప్పింది దానికి శేఖర్ "నాకూ తెలుసు ఇప్పుడు వాడు హాల్ లో ఇంకో మర్డర్ చేయబోతున్నాడు" అని చెప్పి కార్ లో కూర్చున్నాడు. 
Like Reply


Messages In This Thread
RE: డిటెక్టివ్ చంద్రశేఖర్ - by Vickyking02 - 02-08-2020, 08:51 AM



Users browsing this thread: 3 Guest(s)