Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్
చందన ఆ లెటర్ చదివి థామస్ ఏ కిల్లర్ అని తెలుసుకుంది కానీ వాడే కిల్లర్ అని ప్రూఫ్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు అందుకే ఏమీ చేయాలో తెలియక ఆలోచిస్తూ హాస్పిటల్ నుంచి బయటికి వస్తుంటే థామస్ బైక్ మీద వచ్చి గన్ తో మళ్లీ చందన పైన ఎటాక్ చేశాడు దాంతో చందన అక్కడి నుంచి పారిపోయింది అప్పుడు ఒక కార్ వచ్చి చందన నీ ఎక్కించుకోని వెళ్లింది కొంచెం ముందుకు వెళ్లగానే ఆ కార్ డ్రైవర్ బ్రేక్ వేస్తే థామస్ సడన్ బ్రేక్ వేసి జారీ పడ్డాడు ఆ తర్వాత ఆ కార్ వేగంగా బెంగళూరు హైవే ఎక్కింది థామస్ నుంచి తప్పించుకున్నా అని చందన ఊపిరి పీల్చుకున్ని ఆ కార్ డ్రైవర్ నీ చూసింది తను సౌమ్యా (చందన పని చేసే చానెల్ ఓనర్) తన బాస్ తనకి డైరెక్ట్ గా వచ్చి సహాయం చేయడం చందన నీ ఆశ్చర్యానికి గురి చేసింది, ఆ తర్వాత సౌమ్యా చందన నీ తీసుకోని ఒక గెస్ట్ హౌస్ కీ వెళ్లింది లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకుని రేపు ఉదయం మాట్లాడుదాం అని చెప్పి సౌమ్యా వెళ్లి పడుకుంది, ఇంత జరిగాక చందన కీ నిద్ర రాదు అని తెలిసి ముందుగానే తనకి ఇచ్చే injection నీ వాటర్ కలిపి ఉంచింది సౌమ్యా ఆ నీళ్లు తాగి చందన ప్రశాంతంగా నిద్రపోయింది.


రామచంద్ర కృష్ణ మాట్లాడింది విన్న తర్వాత శేఖర్ ఇన్వెస్టీగేషన్ చేస్తున్న కేసు మీద ఆలోచన పెట్టాడు ఒక ఆక్సిడేంట్ కేసు నీ, ఒక మామూలు హార్ట్ ఎటాక్ కేసు కోసం తన కొడుకు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని ఆలోచించి ఆ రెండు కేసుల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తెప్పించి చూశాడు DK కేసు లో రిపోర్ట్ ప్రకారం అతని తల కీ విండో గ్లాస్ తగిలి మెడ తెగి చనిపోయాడు అని ఉంది, కాకపోతే ఆ రిపోర్ట్స్ తో పాటు ఫొటోలు చూశాడు కాకపోతే అక్కడ మెడ తెగిన మాట నిజం కానీ కొన్ని పంటి గాట్లు కూడా తెలుస్తున్నాయి, ఆ తర్వాత రవి కిషోర్ రిపోర్ట్ ప్రకారం సాయంత్రం ఊపిరి అందక, ఆక్సిజన్ సిలిండర్ కూడా అయిపోవడము తో చనిపోయాడు అని రాసి ఉంది కాకపోతే ఆ రోజు ఉదయమే ఆ రూమ్ లో కొత్త సిలిండర్ నింపి వెళ్లారు అన్న విషయం గుర్తుకు వచ్చింది, తరువాత శేఖర్ రిపోర్ట్ ప్రకారం బుల్లెట్స్ అని 6mm లోతులో దిగాయి అంత లోతులో దిగాయి అంటే అదీ కచ్చితంగా సనైపర్ గన్ నుంచే వచ్చి ఉండాలి అలాంటి గన్ నీ సిటీ లో ఎవరు అమ్ముతున్నారో కనుకోమని చెప్పాడు ఆ తర్వాత సిడి షాప్ కాంప్లెక్స్ లో జరిగిన కాల్పుల గురించి తెలుసుకొని వెళ్లాడు అక్కడ ఆ కుర్రాడికి తగిలిన బుల్లెట్ శేఖర్ బుల్లెట్ తో మ్యాచ్ అయ్యింది, దాంతో రామచంద్ర కీ అనుమానం వచ్చింది ఇది ఏమైన లైసెన్స్ గన్ అయి ఉంటుందా అని అలా ఆ బుల్లెట్స్ నెంబర్ నీ చూసి ఆ మాడల్ గన్ కనుక్కొని అది ఎవరి దగ్గర ఉందో తెలుసుకోమని చెప్పాడు.

ఇక్కడ చందన మరుసటి రోజు ఉదయం లేచే సరికి సౌమ్యా హాల్ లో కూర్చుని కాఫీ తాగుతూ టీవీ చూస్తూ ఉంది అప్పుడే చందన రావడంతో వచ్చి కూర్చోమని చెప్పి సైగ చేసింది చందన కూర్చున్న తరువాత "నువ్వు పోయిన సంవత్సరం ఆ చిల్డ్రన్స్ ట్రాఫికింగ్ కేసు కవరేజ్ చేశావు కదా" అని అడిగింది దానికి అవును అన్నట్లు తల ఆడించింది ఆ తర్వాత కాఫీ కప్పు కింద పెట్టి "చందన నువ్వు చేసిన దానికి మన చానెల్ చాలా టాప్ కీ వచ్చింది దానికి థాంక్స్ కాకపోతే నాకూ ఒక చిన్న పని చేసి పెడితే నీకు ప్రమోషన్ గ్యారంటీ " అని చెప్పింది కానీ శేఖర్ చనిపోవడంతో తన మనసు దేని మీద ఏకాగ్రతగా లేదు అప్పుడు సౌమ్యా "నేను నిన్ను ఈ హెల్ప్ నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు అని అడగడం లేదు నువ్వు నా ఫ్రెండ్ చంద్రశేఖర్ గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నా " అని చెప్పి అర్జున్ ఫోటో చూపించి "వీడు శేఖర్ బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అర్జున్ వీడు పూటక ముందే వాళ్లుకు ఒక ఆక్సిడేంట్ అయ్యింది అందులో వీడి నాన్న చనిపోయాడు వీల అమ్మ వీడికి డెలివరీ ఇస్తూ చనిపోయింది కాకపోతే వీడికి అమెరికా citizenship ఉంది అందుకే అక్కడే ఉంచి చదివిస్తున్నాడు చందు ఇప్పుడు వీడు అక్కడ అనాధ లాగా పెరగడం ఇష్టం లేక శేఖర్ వీడిని దత్తత తీసుకొని ఇండియా తీసుకోని రావాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇలా అయింది శేఖర్ నన్ను చివరిగా కలిసినప్పుడు adopting డాక్యుమెంట్ లో సంతకం పెట్టాడు నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు సంతకం పెడితే వాడిని ఇండియా తీసుకోని రావచ్చు అందుకే నిన్ను అడుగుతున్న నువ్వు ఈ సంతకం పెడితే శేఖర్ చివరి కోరిక తీర్చిన దానివి అవుతావు " అని చెప్పింది దాంతో చందన ఆలోచనలో పడింది అప్పుడు సౌమ్యా "నువ్వు ఇప్పుడే పెట్టాల్సిన అవసరం లేదు వాడిని నా చెల్లి అక్కడ చూసుకుంటుంది రేపు వాళ్లు ట్రిప్ కోసం లండన్ వెళ్తున్నారు నువ్వు వెళ్లడానికి కూడా ఏర్పాటు చేశా వాడితో వారం తిరిగి వచ్చిన తర్వాత డిసైడ్ అవ్వు" అని చెప్పింది సౌమ్యా, దాంతో లండన్ వెళ్లి థామస్ నీ చంపోచ్చు అని ఆలోచించి లండన్ కీ వెళ్లడానికి ఒప్పుకుంది చందన.

శేఖర్ నీ చంపిన వాడి గురించి వివరాలు సేకరిస్తు ఉంటే రామచంద్ర కీ సిడి షాప్ లో ఒక నానో కెమెరా దొరికింది అందులో షాప్ కీ వచ్చి వెళ్లిన వాళ్ల అందరి ఫోటో లు అందులో చందన వచ్చినప్పుడు థామస్ చేసిన ఎటాక్ లో థామస్ సిడి విరగోటి వెళ్లడం అంతా ఫోటో format లో ఉన్నాయి థామస్ ఫోటో నీ ప్రింట్ తీసి దాని మొత్తం అని స్టేషన్ లకి పంపాడు ఆ తర్వాత థామస్ పట్టుకున్న గన్ మాడల్ నెంబర్ దొరికింది దాని క్రాస్ చెక్ చేస్తే అది హీరో రవి కిషోర్ లైసెన్స్ గన్ ఆయన అప్పుడప్పుడు ఫైరింగ్ రింగ్ కీ, లేదా వేట కీ వెళ్లడం అలవాటు ఇప్పుడు ఆ గన్ థామస్ చేతిలో చూసి ఎవరూ ఇచ్చి ఉంటారు అని ఆలోచిస్తూ రవి కిషోర్ ఇంటికి వెళ్లి వనిత నీ ఎంక్వయిరీ చేశారు అప్పుడు ఆమె ఆ గన్ మిస్ అయ్యి రెండు నెలలు అయ్యింది అని కంప్లయింట్ ఇచ్చాము ఒక కంప్లయింట్ కాపీ చూపించింది కానీ రామచంద్ర నమ్మడానికి సిద్దంగా లేడు అందుకే థామస్ ఫోటో చూపించాడు, అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పి తనకు లండన్ లో షో ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది వనిత కార్ లో ఎయిర్ పోర్ట్ కీ వెళ్లుతు థామస్ కీ ఫోన్ చేసి జరిగింది చెప్పింది దాంతో థామస్ "మనల్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు అమ్మ" అని చెప్పాడు.

ఆ రోజు సాయంత్రం వనిత, చందన ఇద్దరు ఢిల్లీ లో లండన్ ఫ్లయిట్ లో పక్క పక్క సీట్ లో కూర్చున్నారు వనిత నీ చూసిన చందన చాలా సంబరపడింది తన ఇన్స్పిరేషన్ తోనే చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్న అని చెప్పింది, అప్పుడు వనిత కూడా సంతోషంగా తను ఒకరికి ఇన్స్పిరేషన్ అయ్యాను అని గర్వపడింది మాట లో మాట గా వనిత డ్రామా ఈవెంట్ కీ వెళ్ళుతాన్నా అని చెప్పింది దాంతో చందన థామస్ షో కీ తన దగ్గర పాస్ లేదు వనిత నీ trumph కార్డ్ లాగా వాడాలి అని ప్లాన్ చేసింది. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: డిటెక్టివ్ చంద్రశేఖర్ - by Vickyking02 - 31-07-2020, 08:15 AM



Users browsing this thread: 7 Guest(s)