Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వేమన పద్యాలు
#6
భర్తృహరి సుభాషితాలు

1

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు

భావం - ప్రయత్నం చేయుట వలన ఇసుక నుంచి తైలం తీయవచ్చును. ఎండమావిలో నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు

2

తరువు లతిరసఫలభార గురుత గాంచు
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు
డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకు నిది సహజగుణము...!

భావం - బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా సంచరిస్తుంటాయి. ఉత్తములు కూడా అంతే, సంపదవల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం.... లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయని పై పద్యం యొక్క తాత్పర్యం.
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
[+] 2 users Like krish's post
Like Reply


Messages In This Thread
వేమన పద్యాలు - by krish - 02-12-2018, 12:43 PM
RE: వేమన పద్యాలు - by krish - 02-12-2018, 12:45 PM
RE: వేమన పద్యాలు - by krish - 02-12-2018, 12:46 PM
RE: వేమన పద్యాలు - by krish - 02-12-2018, 12:47 PM
RE: వేమన పద్యాలు - by krish - 02-12-2018, 12:48 PM
RE: వేమన పద్యాలు - by krish - 02-12-2018, 12:48 PM
RE: వేమన పద్యాలు - by ~rp - 02-12-2018, 12:49 PM
RE: వేమన పద్యాలు - by krish - 02-12-2018, 08:37 PM
RE: వేమన పద్యాలు - by Cool Boy - 02-12-2018, 08:46 PM



Users browsing this thread: 5 Guest(s)