02-12-2018, 11:36 AM
(02-12-2018, 07:43 AM)krish Wrote:స్వీట్ కార్న్ పాలకూర సూప్కావల్సినవి: స్వీట్‌కార్న్ - రెండు కప్పులు, వెల్లుల్లి తరుగు - టేబుల్‌స్పూను, ఉప్పు - తగినంత, మిరియాలపొడి - రుచికి సరిపడా, పాలకూర తరుగు - కప్పు, నూనె - రెండు చెంచాలు, క్రీం - కొద్దిగా.
తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేయించాలి. నిమిషమయ్యాక స్వీట్‌కార్న్ వేసి వేయించాలి. అవి కాస్త వేగాక నాలుగు కప్పుల నీళ్లు పోసి మంట పెంచాలి. అవి మరుగుతున్నప్పుడు తగినంత ఉప్పూ, మిరియాలపొడీ వేసి దింపేయాలి. ఆ నీళ్ల వేడి తగ్గాక స్వీట్‌కార్న్‌ని మిక్సీలో తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని మళ్లీ నీళ్లలో వేసి పొయ్యిమీద పెట్టాలి. రెండు నిమిషాల తరవాత పాలకూర తరుగు వేసి మంట తగ్గించాలి. కాస్త ఉడికాక దింపేసి క్రీం వేస్తే చాలు
గుడ్ ఫర్ హెల్త్