02-12-2018, 07:57 AM
కరివేపాకుతో రైతా
కావల్సినవి: కరివేపాకు - కప్పు, పెరుగు - రెండు కప్పులు, మిరియాలు, జీలకర్ర - అరచెంచా చొప్పున, పచ్చిమిర్చి - ఒకటి, చింతపండు - కొద్దిగా, నూనె - చెంచా, ఉప్పు - తగినంత, కొబ్బరితురుము - పావుకప్పు.
తాలింపు కోసం: నూనె - చెంచా, ఆవాలు - పావుచెంచా, ఇంగువ - చిటికెడు.
తయారీ: బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక మిరియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి రెండుమూడు నిమిషాలు వేయించి తీసుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. అదే బాణలిలో కరివేపాకును కూడా నూనె లేకుండా ఐదు నిమిషాలు వేయించుకుని తీసుకోవాలి. తరవాత మిక్సీలో పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరితురుము, చింతపండును కూడా ముద్దలా చేసుకోవాలి. పెరుగులో కరివేపాకు పొడి, కొబ్బరి మిశ్రమం, జీలకర్ర ముద్ద, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక ఇంగువ వేసి దింపేయాలి. ఈ తాలింపును పెరుగులో వేసి బాగా కలిపితే చాలు.
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)