02-12-2018, 07:56 AM
మామిడికాయతో రైతా
కావల్సినవి: మామిడి కాయ - సగం ముక్క (తురమాలి), పచ్చిమిర్చి - ఒకటి, కొబ్బరి తురుము - అరకప్పు, చిక్కటి పెరుగు - రెండు కప్పులు, ఉప్పు - తగినంత.
తాలింపు కోసం: నూనె - చెంచా, ఆవాలు - పావుచెంచా, ఇంగువ - చిటికెడు.
తయారీ: ముందుగా మిక్సీలో మామిడి తురుము, కొబ్బరితురుము, పచ్చిమిర్చి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, ఇంగువ వేయాలి. అవాలు చిటపటలాడాక పొయ్యికట్టేసి ఈ తాలింపును పెరుగులో వేస్తే చాలు

