02-12-2018, 07:47 AM
లెమన్ అండ్ కొరియాండర్
కావల్సినవి: కూరగాయలు ఉడికించిన నీరు - నాలుగు కప్పులు, ఉల్లిపాయలు - రెండు (ముక్కల్లా కోయాలి), నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, చిల్లీసాస్ - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, మిరియాలపొడి - చెంచా, కొత్తిమీర తరుగు - కప్పు.
తయారీ: కూరగాయలు ఉడికించిన నీటిని ఓ గిన్నెలో తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అందులో ఉల్లిపాయముక్కలూ, నిమ్మరసం, ఉప్పూ, సగం కొత్తిమీర తరుగూ, మిరియాలపొడీ, చిల్లీసాస్ వేసి బాగా కలిపి మంట తగ్గించాలి. ఆ నీళ్లు మరిగాక మిగిలిన కొత్తిమీర తరుగు వేసి కప్పుల్లోకి తీసుకుని వడ్డిస్తే సరిపోతుంది
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish