02-12-2018, 07:45 AM
టొమాటో సూప్
కావలసినవి:
టొమాటోలు: 5, క్యాప్సికమ్: ఒకటి(చిన్నది), ఉల్లిపాయలు: ఒకటి, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, వెన్న: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు, మిరియాలపొడి: రుచికి సరిపడా, పంచదార: 2 టేబుల్‌స్పూన్లు, మైదా లేదా కార్న్‌ఫ్లోర్:టేబుల్ స్పూను, తులసి లేదా ఒరెగానొ: టీస్పూను, రెడ్ కలర్: రెండుమూడు చుక్కలు, క్రీమ్: పావుకప్పు (కావాలనుకుంటేనే)
తయారుచేసే విధానం:
టొమాటోలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలుగా కోయాలి.పాన్‌లో టేబుల్‌స్పూను వెన్న వేసి వెల్లుల్లి ముక్కలు, ఉల్లిముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు కూడా వేసి నాలుగు కప్పులు నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. ఉడికిన తరవాత ఉప్పు, పంచదార, మిరియాలపొడి, తులసి ఆకులు వేసి కలపాలి. స్టవ్‌మీద నుంచి దించి చల్లారాక మిక్సీలోవేసి మెత్తని గుజ్జులాచేసి వడగట్టాలి.పాన్‌లో మిగిలిన టేబుల్‌స్పూను వెన్న వేసి మైదా లేదా కార్న్‌ఫ్లోర్ వేసి తక్కువ మంటమీద గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి. తరవాత వడగట్టిన టొమాటో మిశ్రమం పోసి ఉండలు కట్టకుండా కలపాలి. చిక్కదనం చూసుకుని అవసరమైతే మరికొన్ని నీళ్లు కలిపి ఓసారి మరిగించి దించాలి. ఉప్పు సరిచూసుకుని రుచి కావాలనుకుంటే క్రీమ్ కలిపితే సూప్ రెడీ.
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish