02-12-2018, 07:42 AM
పాలకూర, కందిపప్పు సూప్
కావల్సినవి: పాలకూర - రెండు కట్టలు, కందిపప్పు - కప్పు, వేయించిన మిరియాలపొడి - అరచెంచా, వేయించిన జీలకర్రపొడి - చెంచా, నిమ్మరసం - రెండు చెంచాలు, పచ్చిమిర్చి - ఒకటి, నూనె- రెండు చెంచాలు, ఉప్పు - తగినంత.
తయారీ: పాలకూర తరుగూ, కందిపప్పూ, రెండు కప్పుల నీటిని కుక్కర్‌లో తీసుకుని మూడునాలుగు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. పొయ్యిమీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి నూనె వేయాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలూ, జీలకర్రపొడీ, మిరియాలపొడీ వేయాలి. తరవాత ఉడికించిన కందిపప్పూ, పాలకూరా, కప్పు నీళ్లు పోయాలి.. ఇది కాస్త చిక్కగా అయ్యాక నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి దింపేయాలి.
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish